English | Telugu

శంకర్‌-చరణ్‌ మూవీలో హీరోయిన్‌ ఖరారు!!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్ లో ఓ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ కు చెందిన పులువురు ప్రముఖ నటులు నటించనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌ గా కూడా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ ను ఎంపిక చేశారని ఇటీవల టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు మరో బ్యూటీ పేరు వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో చరణ్‌ కి జోడిగా కియారా అద్వానీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ కియారాతో సంప్రదింపులు జరిపిందని.. ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తిగా ఉందని సమాచారం. కాగా గతంలో కియారా 'వినయ విధేయ రామ' సినిమాలో చరణ్‌ సరసన నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో నిరాశ పరిచిన ఈ జోడి.. ఈ సినిమాతో ఆకట్టుకుందేమో చూడాలి.

చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో నటిస్తున్నాడు. అలాగే, చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'ఆచార్య' మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.