English | Telugu

శేఖర్ కమ్ముల-ధనుష్ మూవీలో మరో హీరో!!

తమిళ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నాడని కొన్ని రోజులుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమా చేయనున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందనుంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

శేఖర్ కమ్ముల-ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీలో మరో హీరో కూడా నటించనున్నాడట. ఈ మూవీలో ఒక కీలక పాత్ర కోసం సీనియర్ హీరోని తీసుకోనున్నారట. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి సీనియర్ స్టార్స్ పేర్లతో పాటు దాదాపు అరడజను పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎవరి పేరుని ఫైనల్ చేస్తారో చూడాలి.

మ‌రోవైఫు ధ‌నుష్ లేటెస్ట్ ఫిల్మ్ 'జ‌గ‌మే తంత్ర‌మ్' శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌ లో నేరుగా విడుదలైంది. దీనికి కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌కుడు. ప్రస్తుతం ధనుష్ తమిళంలో కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే హాలీవుడ్ లో ఓ సినిమా, బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక శేఖర్ కమ్ముల విషయానికొస్తే నాగచైతన్య-సాయిపల్లవి జంటగా ఆయన తెరకెక్కించిన 'లవ్ స్టొరీ' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.