English | Telugu

వినాయ‌క చ‌వితికి `అఖండ‌`?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `అఖండ‌`. ఇందులో ద్విపాత్రాభిన‌యం చేస్తున్న బాల‌య్య‌.. ఒక పాత్ర కోసం అఘోరాగా నెవ‌ర్ సీన్ బిఫోర్ లుక్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. `టైటిల్ రోర్` పేరుతో ఉగాది ప‌ర్వ‌దినాన‌ విడుద‌లైన టీజ‌ర్ లో త‌నదైన అభిన‌యంతో, సంభాష‌ణ‌ల‌తో యూట్యూబ్ వేదిక‌గా రికార్డులు క్రియేట్ చేసి.. సినిమాపై అంచ‌నాలు పెంచేశారు న‌ట‌సింహం. అన్నింటికి మించి.. `సింహా`, `లెజెండ్` వంటి సెన్సేష‌న‌ల్ హిట్స్ త‌రువాత బోయ‌పాటి శ్రీ‌నుతో బాల‌య్య చేస్తున్న హ్యాట్రిక్ అటెంప్ట్ కావ‌డంతో.. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ పై స్కై హై ఎక్స్ పెక్టేష‌న్స్ నెల‌కొని ఉన్నాయి.

కాగా, య‌న్టీఆర్ జయంతి సంద‌ర్భంగా మే 28న విడుద‌ల కావాల్సిన `అఖండ‌`.. క‌రోనా రెండో ద‌శ ఉధృతి కార‌ణంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో చిత్రీక‌ర‌ణని పునః ప్రారంభించి.. వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్ 10న సినిమాని జ‌నం ముందుకు తీసుకురావాల‌ని యూనిట్ ప్లాన్ చేస్తోంద‌ట‌. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

ఇదిలా ఉంటే.. యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందిస్తున్న `అఖండ‌`ని ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇందులో బాల‌య్య‌కి జోడీగా ప్ర‌గ్యా జైశ్వాల్ న‌టిస్తుండ‌గా పూర్ణ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.