English | Telugu
చిత్తూరు యాసలో సందడి చేయనున్న మాస్ రాజా!!
Updated : Jun 17, 2021
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఖిలాడి తరువాత శరత్ మండవ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో రవితేజ చిత్తూరు యాసలో మాట్లాడనున్నాడని తెలుస్తోంది.
శరత్ మండవ ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ చాలా కొత్తగా ఉంటుందట. పాతికేళ్ల క్రితం జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఇందులో రవితేజ క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని, ఓ ప్రభుత్వ అధికారిగా కనిపిస్తారని, లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో రవితేజ చిత్తూరు యాసలో మాట్లాడతాడనే విషయం తాజాగా బయటికి వచ్చింది.
రవితేజ-శరత్ మండవ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో హీరోయిన్ గా మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మించనుండగా.. సామ్ సీఎస్ సంగీతం అందించనున్నాడు.