English | Telugu

స‌మ్మ‌ర్ రేస్‌లో పార్టిసిపేట్ చేస్తున్న శివ‌!

ఇప్పుడంతా ప్యాన్ ఇండియా సంస్కృతి న‌డుస్తోంది. అందుకే కాస్త పేరున్న హీరోలంద‌రూ ప్యాన్ ఇండియ‌న్ స్టార్లుగా చ‌లామ‌ణి అవుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో శివ కార్తికేయ‌న్ కూడా ప్యాన్ ఇండియా స్టారే. బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు ఇచ్చిన హీరో అనే గౌర‌వం ఇండ‌స్ట్రీకి ఉంది. అభిమానుల్లోనూ ఉంది. మంచి కాన్సెప్టుల‌తో సినిమా చేస్తార‌నే ఫీలింగ్ తెలుగు ఆడియ‌న్స్ కి కూడా ఉంది. శివ‌కార్తికేయ‌న్ ఇప్పుడు న‌టిస్తున్న సినిమా మావీర‌న్‌.

ఈ సినిమాలో ఆయ‌న పార్ట్ షూటింగ్ పూర్త‌యింది. ఈ సినిమాను మండేలా ఫేమ్ అశ్విన్ మ‌డోన్న తెర‌కెక్కిస్తున్నారు. గ‌త కొన్ని నెల‌ల ముందు టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. ఏడాదిగా ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్ కంటిన్యూ అవుతోంది. సినిమాలో శివ పోర్ష‌న్ కంప్లీట్ అయింద‌ని మేక‌ర్స్ ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించారు. బ‌క్రీద్‌ని పుర‌స్క‌రించుకుని జూన్ 29న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. హై ఆక్టేన్ యాక్ష‌న్ చిత్ర‌మిది. పొలిటిక‌ల్ కామెంట‌రీ డోస్ కూడా ఉంటుంది. అదితి శంక‌ర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

అరుణ్ విశ్వ తెర‌కెక్కిస్తున్నారు. శాంతీ టాకీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇంకా కొంత భాగం మాత్ర‌మే షూటింగ్ పెండింగ్ ఉందని ప్ర‌క‌టించింది శాంతీ టాకీస్‌. త్వ‌ర‌లోనే దాన్ని కూడా పూర్తి చేసేస్తామ‌ని, బ‌క్రీద్ సంద‌ర్భంగా జూన్ 29న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని అన్నారు అరుణ్‌. జూన్‌లో విడుద‌ల కానున్న ఈ సినిమాతో స‌మ్మ‌ర్ రేసులో తాను కూడా ఉన్న‌ట్టే అని అంటున్నార‌ట శివ కార్తికేయ‌న్‌. ఈ సినిమాతో పాటు అయ‌లాన్ అనే మ‌రో ప్రాజెక్ట్ లోనూ న‌టిస్తున్నారు శివ‌. సైన్స్ ఫిక్ష‌న్ సినిమా అది. ఆర్థిక ఇబ్బందులు, ప‌లు కాంట్ర‌వ‌ర్శీల కార‌ణంగా ప్రొడ‌క్ష‌న్ డిలే అయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. డాక్టర్, డాన్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన శివ కార్తికేయ‌న్ కి ప్రిన్స్ ఫ్లాప్ అయింది. అందుకే ఇప్పుడు ఆశల‌న్నీ మావీర‌న్ మీదే పెట్టుకున్నారు. ర‌జ‌నీకాంత్ జైల‌ర్‌లోనూ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు శివ‌కార్తికేయ‌న్‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.