English | Telugu

దిమ్మతిరిగేలా 'దసరా' ఫస్ట్ డే కలెక్షన్స్!

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'దసరా'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం రేపు(మార్చి 30న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం నాని కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దసరాలో నాని మొదటిసారి ఊర మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ.50 కోట్లని అంచనా. ఇప్పటిదాకా నాని హీరోగా నటించిన ఏ సినిమా కూడా రూ.50 కోట్ల షేర్ మార్క్ ని అందుకోలేదు. నాని కెరీర్ లో అత్యధికంగా 'MCA'(మిడిల్ క్లాస్ అబ్బాయి) మూవీ రూ.40 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అలాంటిది ఇప్పుడు దసరా థియేట్రికల్ బిజినెస్ రూ.50 కోట్లంటే అంచనాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హిట్ టాక్ వస్తే ఈ సినిమా రూ.50 కోట్ల షేర్ మార్క్ ని సునాయాసంగా అందుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దసరా సినిమాపై భారీ అంచనాలు ఉండటం, పైగా రేపు శ్రీరామనవమి(సెలవు దినం) కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే భారీస్థాయిలో టికెట్లు బుక్ అయ్యాయి. దీంతో ఈ మూవీ ఓపెనింగ్స్ పరంగా సంచలనం సృష్టించడం ఖాయమంటున్నారు. మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.10 కోట్లకి పైగా షేర్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.15 కోట్లకు పైగా షేర్(రూ.30 కోట్లకు పైగా గ్రాస్) రాబట్టే అవకాశముంది అంటున్నారు. ఆ అంచనాలను దసరా అందుకుంటుందేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.