English | Telugu
‘ఆడుజీవితం’ ట్రైలర్ గురించి అసహనం వ్యక్తం చేసిన పృథ్వి
Updated : Apr 10, 2023
పృథ్విరాజ్ సుకుమారన్ చాలా ఇష్టంగా చేస్తున్న సినిమా ఆడుజీవితం. ఈ సినిమాలోని ఓ క్లిప్ వెబ్‌సైట్‌లో లీక్ అయింది. బిజినెస్ పర్పస్ కోసం ఫారిన్ ఏజెంట్స్ కి పంపిన క్లిప్ ఎలా లీక్ అయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డైరక్టర్ బ్లెస్సీ.
బ్లెస్సీ మాట్లాడుతూ ''ఆడుజీవితం నుంచి లీక్ అయిన క్లిప్‌ని అందరూ ట్రైలర్ అనుకున్నారు. కానీ, అది ట్రైలర్ కాదు. అది మూడు నిమిషాల రఫ్ కట్ క్లిప్. ఫారిన్ ఏజెంట్స్ కి బిజినెస్ పర్పస్ కోసం, ఫిల్మ్ ఫెస్టివల్స్ ని ఉద్దేశించి చెక్ చేయడం కోసం పంపిన క్లిప్ అది. అలా ఎలా లీక్ అయిందో అర్థం కావడం లేదు. అసహనంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్లిప్ విషయంలో అసలేం జరిగిందనేదాని గురించి జనాలకు స్పష్టమైన అవగాహన రావాలనే ఇదంతా చెబుతున్నాను'' అని అన్నారు.
మైగ్రంట్ వర్కర్‌గా ఈ సినిమాలో కనిపిస్తారు పృథ్విరాజ్ సుకుమారన్. వాస్తవ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. సౌదీ అరేబియాలో గొర్రెల కాపరిగా పనిచేసే ఓ వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. బెన్యమిన్ రాసిన ఆడుజీవితం అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
గతేడాది జులైలో షూటింగ్ పూర్తయింది. అప్పటి నుంచే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ కేరక్టర్ కోసం పృథ్విరాజ్ ఫిజికల్‌గా చాలా మేకోవర్ అయ్యారు.
రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. జోర్దన్, అల్గేరియా, ఇండియాలో కీ పోర్షన్ తెరకెక్కించారు. ఈ సినిమాను వెండితెరపై చూడాలన్నది బ్లెస్సీ పదేళ్ల కల. అందుకే అంతగా డిస్టర్బ్ అయ్యారని అంటున్నారు సన్నిహితులు.