English | Telugu
మమ్ముట్టి బజూకా బడ్జెట్ ఎంతో తెలుసా?
Updated : Apr 10, 2023
మమ్ముట్టి ఇప్పుడు క్లౌడ్ నైన్‌లో ఉన్నారు. ఆయన లేటెస్ట్ సినిమా బజూకా ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పూర్తి స్థాయి యాక్షన్ ఓరియంటెడ్ సినిమా ఇది. గత కొన్నాళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మమ్ముట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు డీనో డెన్నిస్ డైరక్ట్ చేస్తున్నారు. మలయాళంలో స్క్రీన్ రైటర్గా పేరున్న కలూర్ డెన్నిస్ తనయుడే డీనో డెన్నిస్. తన చుట్టూ షూటర్స్. గట్టిగా టార్గెట్ చేశారు. అయినా ఏమాత్రం బెదురులేకుండా నిలుచున్న మమ్ముట్టి పిక్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ఇంట్రస్టింగ్‌గా డిజైన్ చేశారు. బజూకా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ఇది. డీనో డెన్నిస్ డైరక్ట్ చేస్తున్నారు. థియేటర్ ఆఫ్ డ్రీమ్స్, సరేగమ సంయుక్తంగా నిర్మిస్తున్నారు అని ట్వీట్ చేశారు మమ్ముట్టి. సినిమా కథ గురించి మాత్రం టీమ్ ఇంకా ఏ వివరాలనూ ప్రకటించలేదు.
ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవమీనన్ కూడా నటిస్తున్నారు. నటుడిగా ఇదే ఆయనకు మమ్ముట్టితో తొలి సినిమా. హై ఆక్టేన్ సినిమాగా రూపొందుతోంది. డి.పి.నిమిష్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. మమ్ముట్టితో ఆయనకు ఇది రెండో సినిమా. మిథున్ ముకుందన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేయాలన్నది మేకర్స్ ప్లాన్. ఈ సినిమాతో పాటు మమ్ముట్టి చేతిలో మరికొన్ని చిత్రాలున్నాయి. వర్గీస్ రాజ్ దర్శకత్వంలో కన్నూర్ స్క్వాడ్ అనే చిత్రంలో నటిస్తున్నారు మమ్ముట్టి. జియో బేబీ డైరక్ట్ చేస్తున్న కాదల్ ది కోర్‌లోనూ చాలా మంచి రోల్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ యాంథాలజీ కడుగన్నవా ఒరు యాత్రలో ఆయనది చాలా స్పెషల్ రోల్. నెవర్ బిఫోర్ సీన్ అవతార్‌లో కనిపించనున్నారు. తెలుగు వాళ్లకి అన్నిటికన్నా ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఏజెంట్. కథ బాగోలేకపోతే ఏమాత్రం పట్టించుకోని మమ్ముట్టి, తెలుగులో యాత్ర తర్వాత నటిస్తున్న సినిమా ఏజెంట్. ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు. ఏప్రిల్ 28న విడుదల కానుంది ఏజెంట్.