English | Telugu
హాట్ ఫోటోస్ తో పిచ్చెక్కిస్తున్న ప్రియాంక సింగ్!
Updated : Apr 10, 2023
జబర్దస్త్ ద్వారా ఫేమ్ సంపాదించిన ప్రియాంక సింగ్ అలియాస్ సాయితేజ.. బిగ్ బాస్ -5 లో ఛాన్స్ కొట్టేసింది. జబర్దస్త్ కి ముందు నుంచే ఆమె ట్రాన్స్ జెండర్.. కాగా సొసైటీలో ట్రాన్స్ జెండర్ పై చిన్న చూపు అంటూ ఆమె చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది. అయితే తన ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రియాంక సింగ్ ఇండస్ట్రీకి వచ్చింది.
బిగ్ బాస్- 5 లో అవకాశం రావడంతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. అయితే తన బాడీని ఒక అమ్మాయిలాగా మేకోవర్ చేపించుకొని, హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రియాంక సింగ్. అయితే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో బిగ్ బాస్ ప్రేక్షకులకు మరింత చేరువైన తను.. బిగ్ బాస్ లో తన హౌస్ మేట్ అయిన మానస్ తో సన్నిహితంగా ఉండేది. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక పలు టీవీ షోస్ లో మెరిసిన ప్రియాంక సింగ్.. చేసే ప్రతి పనిని వీడియో వ్లాగ్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో, యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంటుంది. అలా తను సమాజంలో ట్రాన్స్ జెండర్స్ మీద ఉన్న చులకన భావాన్ని కాదని.. ఒక్కతే బ్రతికి చూపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. చాలా మంది ఆమెని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు.
ప్రియాంక సింగ్ మొదట్లో సింప్లిసిటీకి కేరాఫ్ గా ఉండేది. ఇప్పుడు మాత్రం కొత్త కొత్త ఫోటోలతో అలరిస్తోంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో హాట్ గా కనిపించిన ప్రియాంకని కొందరు బాగున్నావంటూ పొగడగా.. మరికొందరు చూసి నిరాశని వ్యక్తం చేస్తున్నారు. నువ్వు ముందులానే ఉండు.. ట్రెండీగా ఉండాలి. కానీ మరీ ఇలా కాదు. ఇలాంటి ఫోటోస్ లో బాలేవని తన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ప్రియాంక సింగ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు అటు నెగెటివ్, ఇటు పాజిటివ్ కామెంట్లతో వైరల్ గా మారాయి.