టాలీవుడ్ కి మరో రాజమౌళి దొరికినట్లేనా!
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఎదగనున్నాడా అంటే, ఆయన అడుగులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అంటే.. ముందుగా ఎస్.ఎస్. రాజమౌళి పేరు గుర్తుకొస్తుంది. 'బాహుబలి' ఫ్రాంచైజ్, 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచస్థాయిలో సంచనాలు సృష్టించాడు. అయితే రాజమౌళి ఒక్కో సినిమాకి ఎక్కువ సమయం తీసుకుంటాడు.