English | Telugu

2018 మూవీ ఇష్యూ... కేర‌ళ థియేట‌ర్లు బంద్‌!

టొవినో థామ‌స్ హీరోగా న‌టించిన సినిమా 2018. కేర‌ళ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కించారు. ఆద్యంతం భావోద్వేగభ‌రితంగా రూపొందించారు డైర‌క్ట‌ర్‌. ఈ సినిమాను ఇటీవ‌ల తెలుగులో విడుద‌ల చేశారు. కొన్న‌దానికి ప‌దింత‌ల లాభం తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో జూన్ 7 నుంచి ప్ర‌సారం చేయ‌నున్నారు. ఇది కేర‌ళ థియేట‌ర్ ఓనర్స్ ని అప్‌సెట్ చేసింది. అందుకే జూన్ 7, 8న ప్రొటెస్ట్ చేయ‌నున్నారు. ఇంత త్వ‌ర‌గా ఓటీటీల్లో విడుద‌ల చేయ‌డం ఏంట‌న్న‌ది వారి ప్ర‌శ్న‌. థియేట‌ర్స్ లో 2018కి బ్ర‌హ్మాండ‌మైన ర‌న్ ఉంది. ఇప్పుడు క‌నుక ఓటీటీలో విడుద‌ల చేస్తే వ‌చ్చేవారు కూడా రారు. అందుకే కేర‌ళ థియేట‌ర్ ఓన‌ర్లు స‌మావేశ‌మ‌య్యారు. సినిమా విడుద‌లైన ఐదు వారాల్లోపే ఓటీటీల్లో విడుద‌ల చేయ‌డం ఏంట‌న్న‌ది వారి ప్ర‌శ్న‌.

ఎవ‌రికోసం శింబు లండ‌న్‌కి వెళ్లారో తెలుసా?

శింబు ఇప్పుడు స్కై హైలో ఉన్నారు. ఆయ‌న చేసిన సినిమాలు వ‌రుస‌గా విజ‌యం సాధిస్తుండ‌టంతో అదే జోరుమీద నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే థాయ్‌ల్యాండ్ కి వెళ్లొచ్చారు శింబు. ఆ వెంట‌నే కొన్నాళ్లు చెన్నైలో ఉండి లండ‌న్‌కి వెళ్లారు. అక్క‌డ దేశింగ్ పెరియ‌సామి సినిమా కోసం మేకోవ‌ర్ అవుతున్న‌ట్టు టాక్‌.  దేశింగ్ పెరియ‌సామి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్టీఆర్ 48 ఉంటుంద‌ని గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఇంకా ఫైన‌ల్ కాలేదు. ఆగ‌స్టులో చిత్రాన్ని ఫ్లోర్ మీద‌కు తీసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. రాజ్‌క‌మ‌ల్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌నల్ పతాకంపై ఈ సినిమాను క‌మ‌ల్‌హాస‌న్ నిర్మిస్తున్నారు.