English | Telugu

నేను రెడీ... మీరు రెడీయేనా అంటున్న న‌యన్!

సౌత్ ఇండియ‌న్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార ఆగ‌స్టులో మూవీ రిలీజ్‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. నేను రెడీ, మీరు రెడీయేనా అని అభిమానుల‌ను ఊరిస్తున్నారు. జ‌యం ర‌వితో న‌య‌న‌తార న‌టించిన సినిమా ఇరైవ‌న్‌. ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ఆగ‌స్టు 25న విడుద‌ల‌కు రెడీ అవుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఒక‌టి కాదు,రెండు కాదు, నాలుగు భాష‌ల్లో ఇరైవ‌న్‌ని విడుద‌ల చేస్తున్నామ‌ని అన్నారు. తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో ఇరైవ‌న్‌రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిపారు. సిల్వ‌ర్ స్క్రీన్ మీద గ‌ట్టిగా సంద‌డి చేసిన జోడీల్లో జ‌యం ర‌వి, న‌య‌న‌తార జోడీ కూడా ఉంది. వీరిద్ద‌రూ క‌లిసి త‌ని ఒరువ‌న్ సినిమాను ఆల్రెడీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చేశారు. వాళ్లిద్ద‌రినీ క‌లిసి స్క్రీన్ మీద చూసి ఎనిమిదేళ్ల‌యింది.

సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై మూవీ రివ్యూ

మైనర్ బాలిక 'ను'(అద్రిజ సిన్హా) పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, బయట ప్రపంచానికి మంచివాడిలా కనిపించే ఒక కీచక బాబాజీ(సూర్య మోహన్ కులశ్రేష్ట) తనని లైంగికంగా వేధించాడని కంప్లైంట్ చేస్తుంది. 'ను' కంప్లైంట్ ఆధారంగా విచారణ కోసం పోలీసులు ఆ బాబాజీని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరుస్తారు. అయితే 'ను' తరుపున వాదించే లాయర్ డబ్బులకి ఆశపడి కేస్ ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తాడు. తమ లాయర్ ఇలా చేస్తున్నాడని తెలుసుకున్న 'ను' వేరొక లాయర్ సోలంకి(మనోజ్ బాజ్ పాయ్) దగ్గరికి వెళ్తుంది. అయితే 'ను' బాధని అర్థం చేసుకున్న సోలంకి కేసు టేకప్ చేస్తాడు. ఆ తర్వాత కోర్టులో పి.సి. సోలంకి ఎదురైన ఇబ్బందులేంటి? బాబాజీకి శిక్షపడేలా చేశాడా? 'ను' కి సోలంకి న్యాయం జరిగేలా చేశాడా లేదా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే....

20 ఏళ్ల త‌ర్వాత విజ‌య్‌తో జ్యోతిక‌ జోడీ!

ఓ వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు జ్యోతిక‌. సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న హీరోయిన్‌గానూ మెప్పిస్తున్నారు. రీసెంట్‌గా చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యారు సూర్య అండ్ జ్యోతిక‌. ఇప్పుడు జ్యోతిక‌కు అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. జ్యోతిక గురించి రీసెంట్‌గా ఓ న్యూస్ త‌మిళ‌నాడులో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదే ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో జ్యోతిక జోడీ క‌డుతున్నార‌నే విష‌యం. దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేస్తున్నార‌న్న‌ది న్యూస్‌. వెంక‌ట్‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు ద‌ళ‌ప‌తి విజ‌య్‌. క‌స్ట‌డీ సినిమా రిజ‌ల్ట్ ప‌ట్టించుకోకుండా వెంక‌ట్ ప్ర‌భుకి ఛాన్స్ ఇచ్చారు విజ‌య్‌. వెంక‌ట్ ప్ర‌భు డైర‌క్ష‌న్ అంటేనే సినిమాలో కామెడీ ఉంటుంద‌న్న‌ది వార్త‌. ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ప్ర‌భాస్‌కి ఆ స్టామినా ఉందంటున్న బ్యూటీ

ఇప్పుడు ఎక్క‌డ విన్నా రామనామ‌మే. ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా వార్త‌లే. ఆదిపురుష్ గురించి లేటెస్ట్ గా న‌టి సోనాల్ చౌహాన్ కూడా త‌న అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఓమ్‌ర‌వుత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఆదిపురుష్‌. జూన్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది ఈ చిత్రం. తొలిసారి ప్ర‌భాస్ పౌరాణిక పాత్ర‌లో న‌టించారు. ఆయ‌న కెరీర్‌లో ఫ‌స్ట్ త్రీడీ సినిమా కూడా ఇదే. ఈ చిత్రం గురించి సోనాల్ మాట్లాడుతూ ``ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ చూశాక బాలీవుడ్ దృష్టి మారిపోతుంది. ఆదిపురుష్‌కి ముందు, ఆదిపురుష్ త‌ర్వాత అని మాట్లాడుకుంటారు జ‌నాలు. ఓం ర‌వుత్ అంత అద్భుతంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు`` అని అన్నారు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఓ రోల్ చేస్తున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. టీమ్ ఆమెను అప్రోచ్ అయిన‌ప్పుడు అస‌లు క‌థ‌నుగానీ, త‌న పాత్ర గురించిగానీ  అడ‌గ‌లేద‌ట  సోనాల్‌. ఇన్‌స్టంట్‌గా ఒప్పుకున్నార‌ట‌.

ధ్రువ‌న‌క్ష‌త్రం రిలీజ్‌కి రెడీ అవుతోందా?

చియాన్ విక్రమ్ నటించిన సినిమా ధ్రువ న‌క్ష‌త్రం. ఈ చిత్రం ట్రైల‌ర్‌ని ఈ నెల 17న విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. స్పై థ్రిల్ల‌ర్ మూవీ ఇది. 2016లో చేయాలనుకున్నారు. కానీ డిఫ‌రెంట్ రీజ‌న్స్ వ‌ల్ల మూవీ ఓపెనింగ్‌వాయిదా ప‌డింది. ఒకానొక సంద‌ర్భంలో ఈ సినిమా డ్రాప్ అయింద‌ని కూడా అనుకున్నారు. అయితే 2022లో చియాన్ విక్ర‌మ్‌, గౌత‌మ్ వాసుదేవ మీనన్ కలిసి ఈ సినిమా కోసం ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టారు.  ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని చాలా సార్లు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా క్రూని అడిగారు ఫ్యాన్స్. అయితే దాని వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగమూ లేదు.

విజ‌య్ స్టూడెంట్స్ మీట్‌:  పొలిటిక‌ల్ ఎంట్రీ కోస‌మేనా?

ద‌ళ‌ప‌తి విజ‌య్ ఏదో ఒక రీజ‌న్‌తో నిత్యం న్యూస్‌లో ఉంటున్నారు. లేటెస్ట్‌గా విజ‌య్ స్టూడెంట్స్‌తో క‌నెక్ట్ అయ్యే న్యూస్ ఒక‌టి హ‌ల్‌చ‌ల్  చేస్తోంది. త‌మిళ‌నాడులో ప‌దో త‌ర‌గ‌తి, ప‌న్నెండో త‌ర‌గ‌తి (ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్‌)లో  టాప‌ర్ల‌కు  ముగ్గురికి విజ‌య్ చేతుల మీదుగా స‌త్కారం జ‌రుగుతుంద‌న్న‌ది ట్రెండ్ అవుతున్న విష‌యం.  జూన్ 17వ తేదీన ఈ కార్య‌క్ర‌మం కోసం కాల్షీట్ ఇచ్చారు ద‌ళ‌ప‌తి విజ‌య్‌. వారి ఉన్న‌త చ‌దువుల కోసం ఆర్థిక సాయం కూడా చేయ‌నున్నారు. త‌మిళ‌నాడులో మొత్తం 234 నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌దో త‌ర‌గ‌తిలోనూ, ప‌న్నెండో త‌ర‌గ‌తిలోనూ టాప్ స్కోర్ చేసి త‌లా ముగ్గురిని ఎంపిక చేసే ప్ర‌క్రియ ఇప్ప‌టికే మొద‌లైంది. 17వ తేదీన జ‌రిగే కార్య‌క్ర‌మంలో ఈ విద్యార్థుల‌తో పాటు, వారి త‌ల్లిదండ్రులు కూడా పాల్గొంటారు.