English | Telugu

తమన్ జపం చేస్తున్న బాలయ్య!

టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లు ఎన్నో ఉన్నాయి. పలువురు దర్శకులు హిట్ సెంటిమెంట్ ని కొనసాగిస్తూ వరుసగా ఒకే సంగీత దర్శకుడితో ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ ని హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ కి వరుస అవకాశాలు ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. 'అఖండ', 'వీరసింహారెడ్డి'తో వరుస విజయాలు అందుకున్న బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న 'NBK 108'తో హ్యాట్రిక్ పై కన్నేశాడు. అయితే బాలయ్య లేటెస్ట్ సక్సెస్ జర్నీలో తమన్ భాగమయ్యాడు. బాలయ్య-తమన్ మొదటిసారి 2016 లో విడుదలైన 'డిక్టేటర్' కోసం చేతులు కలిపారు. 'అఖండ'తో వీరిది సక్సెస్ ఫుల్ కాంబోగా పేరు తెచ్చుకుంది. బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత వచ్చిన 'వీరసింహారెడ్డి'తోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. ఇక ఇప్పుడు బాలయ్య నటిస్తున్న 'NBK 108'కి కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. దీని తర్వాత బాలయ్య చేయనున్న మరో సినిమాకి సైతం సంగీత దర్శకుడిగా తమన్ వ్యవహరించనున్నాడని సమాచారం.

బాలయ్య తన 109 వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్ర ప్రకటన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న రానుంది. ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా తమన్ పని చేయనున్నాడట. అంతేకాదు దీని తర్వాత బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో రానున్న కొత్త చిత్రానికి సైతం తమన్ సంగీతం అందిస్తాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తానికి బాలయ్య కొత్త సినిమా వస్తుందంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫిక్స్ అనేలా పరిస్థితి ఉంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.