ఎన్టీఆర్ సినిమా ట్యాగ్ లైన్ ని 'గుంటూరు కారం'కి పెట్టేశారు!
'అతడు', 'ఖలేజా' సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్ర టైటిల్ ని, గ్లింప్స్ ని సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నిన్న(మే 31న) విడుదల చేశారు. టైటిల్ ఎంత ఘాటుగా ఉందో, గ్లింప్స్ కూడా అంతే ఘాటుగా మాస్ ఆడియన్స్ మెచ్చేలా ఉంది.