English | Telugu

సౌత్ చిత్రాల్లో యాక్టింగ్‌... ఓపెన్ అయిన బాల‌య్య నాయిక‌!

నంద‌మూరి బాల‌కృష్ణ పక్క‌న న‌టించిన క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా స‌త్తా చాటుకున్నారు న‌టి రాధికా ఆప్టే. ఈ మ‌ధ్య వ‌రుస‌గా బాలీవుడ్ ప్రాజెక్టుల‌తో తెలుగుకు దూర‌మ‌య్యారు. ఎక్స‌లెంట్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్న న‌టిగా పేరు తెచ్చుకున్నారు రాధిక‌. ఆమె చివ‌రిగా మిసెస్ అండ‌ర్‌క‌వ‌ర్‌లో క‌నిపించారు. నెక్స్ట్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ప్రాజెక్ట్ కోసం ప‌నిచేస్తున్నారు. అబ్రాడ్‌లో ప‌నిచేయ‌డానికి ఇండియాలో ప‌నిచేయ‌డానికి ఉన్న వ్య‌త్యాసం గురించి మాట్లాడారు. ``నేను ఇంగ్లిష్లో ఎక్కువ సినిమాలు చేయ‌లేదు. ఓ బ్రిటిష్ ఫిల్మ్ చేస్తే, దాన్ని కూడా ఇండియాలోనే తెర‌కెక్కించారు. హెచ్ ఓ డీ త‌ప్ప‌, మిగిలిన వాళ్లంద‌రూ ఇక్క‌డివాళ్లే. నా త‌దుప‌రి సినిమా అబ్రాడ్‌లో తెర‌కెక్కుతోంది. ఫారిన్ లొకేష‌న్ల‌లో ప‌నిచేసి వ‌చ్చాక ఎక్కువ అవ‌గాహ‌న వ‌స్తుంద‌ని భావిస్తున్నాను`` అని అన్నారు.

కెరీర్ గురించి మాట్లాడుతూ ``నా కెరీర్‌లో ఎప్పుడూ అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. కొన్నిసార్లు సినిమాలు వ‌ర్క‌వుట్ అవుతాయి. కొన్ని ముంచేస్తాయి. మ‌న‌ముందుకు వ‌చ్చిన అవ‌కాశాల్లో నచ్చిన‌వాటిని చేస్తాం. కొన్నిటిని ఆత్మ‌సంతృప్తికోసం, మ‌రికొన్నిటిని డ‌బ్బు కోసం చేస్తాం. నేనెప్పుడూ నా కెరీర్ గ్రాఫ్‌ని సీరీయ‌స్‌గా తీసుకోలేదు. నేను చేస్తున్న పాత్ర‌లు స‌మాజం మీద ఎలా రిఫ్లెక్ట్ అవుతాయోన‌నే విష‌యాల గురించి నేనెప్పుడూ ఆలోచించ‌లేదు. నేను ఓ బిజినెస్ ఇండ‌స్ట్రీలో ఉన్నాను. నేను చేసే ప‌ని వ‌ల్ల నిర్మాత‌ల‌కు డ‌బ్బులు రావాలి. నా ఇంటెన్ష‌న్ కంప్లీట్‌గా అది మాత్ర‌మే`` అని అన్నారు. ఇండియాలో సినిమాల‌కు వెళ్ల‌డం, హోట‌ల్స్ కి వెళ్ల‌డాన్ని ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డ‌తార‌ని, వాళ్లు చూసిన‌న్ని రోజులు థియేట‌ర్ల‌లో సినిమాలు ప‌చ్చ‌గా ఉంటాయ‌ని చెప్పారు. టిక్కెట్ రేట్ల‌ను త‌గ్గిస్తే ప్ర‌జ‌ల మీద వినోద‌పు భారం త‌గ్గుతుందని అన్నారు. సౌత్ ఇండియ‌న్ సినిమాలు చేస్తారా? అని అడిగితే ``నాకు భాషా ప‌రమైన సరిహ‌ద్దులు అస‌లు లేవు. మంచి రోల్ వ‌స్తే ఎక్క‌డైనా న‌టించ‌డానికి సిద్ధంగా ఉన్నాను`` అని అన్నారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.