English | Telugu
'గాంఢీవధారి అర్జున' షూటింగ్ పూర్తి.. మెగా ప్రిన్స్ సందడి షురూ!
Updated : Jun 28, 2023
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాయే 'గాంఢీవధారి అర్జున'. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పక్కా యాక్షన్ మోడ్‌లో ఆకట్టుకోబోతున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది.
వరుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఎస్వీసీసీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాపినీడు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. యూరోపియన్ దేశాలతో పాటు యు.ఎస్.ఎలోనూ షూటింగ్ జరుపుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా ప్రకటించినట్లుగానే ఆగస్ట్ 25న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
'గాంఢీవధారి అర్జున' షూటింగ్ పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో వరుణ్ తేజ్ చేతిలో గన్ పట్టుకుని చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. వరుణ్‌తేజ్ ఈ చిత్రంలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి ప్రజలను అతను ఎలా కాపాడాడు, అతని స్ట్రాటజీస్ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఆగస్ట్ 25 వరకు ఆగాల్సిందేనంటున్నారు మేకర్స్. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ముఖేష్, ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్ల వ్యవహరిస్తున్నారు.