English | Telugu
మీరే చూస్తారుగా.. ఇక మనల్ని ఎవరూ ఆపలేరు బ్రో!
Updated : Jun 28, 2023
మెగా ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పవన్, సాయి తేజ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది.
"ఇక మనల్ని ఎవరూ ఆపలేరు బ్రో", "మీరే చూస్తారుగా" అంటూ తాజాగా టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'బ్రో' టీజర్ ని రేపు(జూన్ 29) సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే టీజర్ కి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతుండగా తీసిన ఫోటోని కూడా పంచుకున్నారు. 'బ్రో' టీజర్ కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రేపే టీజర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో వాళ్ళు ఫుల్ ఖుషి అవుతున్నారు.