English | Telugu

స‌క్సెస్‌ఫుల్ హీరో టొవినోతో త్రిష‌!

మ‌ల‌యాళంలో ఇప్పుడు సూప‌ర్‌స‌క్సెస్‌ఫుల్ హీరో టొవినో థామ‌స్‌. ఆయ‌న ప‌క్క‌న న‌టించ‌డానికి త్రిష కృష్ణ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. మాలీవుడ్‌లో ఇప్పుడు ఇది బిగ్ న్యూస్‌. అఖిల్ పాల్, అనాస్ ఖాన్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. త్రిష మ‌ల‌యాళంలో నివిన్ పాలీ సినిమా హే జ్యూడ్‌తో ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం మోహ‌న్‌లాల్ స‌ర‌స‌న థ్రిల్ల‌ర్ రామ్‌లో న‌టిస్తున్నారు. ఇది విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ప్పుడే టొవినో మూవీ ఆఫ‌ర్ త‌లుపు త‌ట్టింది. టొవినో, త్రిష ఇప్ప‌టికే ప‌లు అవార్డుల వేడుక‌ల్లో క‌లుసుకున్నారు. ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకునే విధానాన్ని గుర్తుచేసుకుని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తే చూద్దామ‌నుకున్న‌వారి క‌ల నెర‌వేరుతోంది. ఆన్‌స్క్రీన్ మీద వారిద్ద‌రి కెమిస్ట్రీ చూడటానికి ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

విన్నైతాండి వ‌రువాయా సినిమా సీక్వెల్ లో హీరోగా టొవినో థామ‌స్‌నే అనుకున్నార‌ట డైర‌క్ట‌ర్ గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్‌. కానీ, ఆ ప్రాజెక్ట్ మెటీరియ‌లైజ్ కాలేదు. అప్పుడు మిస్ అయిన కాంబినేష‌న్ ఇప్పుడు కుదురుతున్నందుకు హ్యాపీగా ఉన్నారు టొవినో, త్రిష అభిమానులు. ఆల్రెడీ 2018 స‌క్సెస్‌తో ఉన్నారు టొవినో. పొన్నియిన్ సెల్వ‌న్ రెండు పార్టులూ కుందవైగా త్రిష‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది అక్టోబ‌ర్ 19న విడుద‌ల కానున్న లియోలో త్రిష హీరోయిన్‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .