English | Telugu

ఆస్కార్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న విక్ర‌మ్‌!

ఏ సినిమాకు సైన్ చేసినా, ప్రాణం పెట్టి ప‌నిచేస్తారు విక్ర‌మ్‌. తీసుకున్న ప్ర‌తి రూపాయికీ న్యాయం జ‌రిగేలా చెమ‌టోడుస్తారు. విక్ర‌మ్ మూవీ రిలీజ్ అంటే, థియేట‌ర్ల‌కు జ‌నాలు బారులు తీయ‌డానికి కార‌ణం కూడా అదే. ఎప్పుడూ త‌న విశ్వ‌రూపాన్ని ఆఫ్ట‌ర్ రిలీజ్ చూపించే విక్ర‌మ్‌, ఈ సారి మొద‌టి నుంచీ త‌న కేర‌క్ట‌ర్‌ని జ‌నాల‌కు ఇంజెక్ట్ చేయ‌డానికి ట్రై చేస్తున్నారు. తంగ‌లాన్ సినిమాలో విక్ర‌మ్ లుక్ చూసిన వారు, ఆ ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్‌కి క‌ళ్లు చెదిరిపోతున్నాయ‌ని అంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా స‌రే, అన్నీ అవార్డులు విక్ర‌మ్‌కి వ‌చ్చి తీరుతాయ‌ని జోస్యం చెబుతున్నారు.

జ‌నాలే కాదు, మేక‌ర్స్ కూడా సేమ్ న‌మ్మ‌కంతో ఉన్నారు. విక్ర‌మ్ సినిమా ఆస్కార్ బ‌రిలో అవార్డుల పంట పండిస్తుంద‌ని అంటున్నారు నిర్మాత‌లు. ధ‌నుంజ‌య‌న్ ఆ మ‌ధ్య మాట్లాడుతూ ``విక్ర‌మ్ న‌టిస్తున్న తంగ‌లాన్ సినిమా మా దృష్టిలో చాలా స్పెష‌ల్‌. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో ప‌నిచేసిన వ‌ర్క‌ర్స్ కి సంబంధించిన క‌థ‌తో తెర‌కెక్కిస్తున్నాం. పా.రంజిత్ సినిమాలంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఇది ఇంటెన్స్ కా బాప్ అన్న‌ట్టు సాగుతుంది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. ఆస్కార్ జ్యూరీ మెంబ‌ర్స్ కి కూడా నచ్చుతుంది. విక్ర‌మ్ యాక్టింగ్ నెవ‌ర్ బిఫోర్‌, ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అన్న‌ట్టు ఉంటుంది. అస‌లు ఈ గెట‌ప్‌లో విక్ర‌మ్‌ని చూసి చాలా మంది గుర్తు ప‌ట్ట‌లేదు. అంత‌గా కేర‌క్ట‌ర్‌లో ఇన్వాల్వ్ అయిపోయారు`` అని అన్నారు. విక్ర‌మ్ సినిమాలో పార్వ‌తి తిరువోతు, మాళ‌విక మోహ‌న‌న్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఫైన‌ల్ ప్రొడ‌క్ష‌న్‌లో ఉంది సినిమా. ఈ ఏడాది ఆఖ‌రున గానీ, సంక్రాంతికి గానీ సినిమాను విడుద‌ల చేయాల‌న్న ప్లాన్‌లో ఉంది యూనిట్‌.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.