English | Telugu

'భోళా శంకర్'.. కొంచెం ఓవర్!

'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న సినిమా 'భోళా శంకర్'. తమిళ చిత్రం'వేదాళం' ఆధారంగా రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో.. చిరుకి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా ఎంటర్టైన్ చేయనుంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ మూవీలో చిరుకి చెల్లెలిగా కీర్తి సురేశ్ కనిపించనుంది. మెహర్ రమేశ్ పదేళ్ళ తరువాత మెగాఫోన్ పట్టి తీసిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. ఈ నెల 11న జనం ముందుకు వస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా 'భోళా శంకర్'కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 'యు/ఎ' సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా.. 159.49 నిమిషాల (2 గంటల 39 నిమిషాలు) నిడివితో ఎంటర్టైన్ చేయనుంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఒరిజనల్ వెర్షన్'వేదాళం' 154 నిమిషాల డ్యూరేషన్ తో సాగితే.. రీమేక్ వెర్షన్ మరో 5 నిమిషాల అదనపు నిడివితో తెరకెక్కింది. సో.. ఒరిజినల్ కంటే రీమేక్ రన్ టైమ్ కొంచెం ఓవర్ అయిందన్నమాట. మరి.. ఈ డ్యూరేషన్ 'భోళా శంకర్'కి ప్లస్సవుతుందో లేదో తెలియాలంటే మరో 7 రోజులు ఆగాల్సిందే.