English | Telugu

తమన్నాకి అప్పుడు లవర్.. ఇప్పుడు బ్రదర్!

సరిగ్గా 15 ఏళ్ళ క్రితం మిల్కీ బ్యూటీ తమన్నాతో రొమాన్స్ చేసిన ఓ యంగ్ హీరో.. ఇప్పుడేమో అన్నగా అవతారమెత్తాడు. మరి.. లవర్ గా కలిసిరాని తమన్నా.. సిస్టర్ గా అచ్చొస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఆ వివరాల్లోకి వెళితే.. 2008లో 'కాళిదాసు'చిత్రంతో కథానాయకుడిగా తెరంగేట్రం చేశాడు అక్కినేని కాంపౌండ్ కి చెందిన సుశాంత్. అప్పుడప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న తమన్నా ఇందులో అతనికి జోడీగా నటించింది. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించలేకపోయింది. కట్ చేస్తే.. ఒకటిన్నర దశాబ్దం తరువాత ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టారు. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటించిన 'భోళా శంకర్'లో చాలా కాలం తరువాత ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా తమన్నా నటించగా.. తమన్నాకి సోదరుడిగా సుశాంత్ కనిపించనున్నాడు. మరి.. 15 ఏళ్ళ అనంతరం కలిసి నటించిన వీరికి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

కాగా, 'భోళా శంకర్' ఆగస్టు 11న థియేటర్స్ లోకి రానుంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మహతి స్వర సాగర్ సంగీతమందించాడు. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్ దర్శనమివ్వనుంది.