English | Telugu

ఖైదీ2 గురించి క్లారిటీ ఇచ్చిన లోకేష్‌!

లోకేష్ క‌న‌గ‌రాజ్ నెక్స్ట్ సినిమా లియో. ద‌ళ‌ప‌తి విజ‌య్‌, సంజ‌య్‌ద‌త్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను అక్టోబ‌ర్ 19న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు దాదాపు 400 కోట్ల రూపాయ‌ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింద‌ని టాక్‌. దీంతో లోకేష్ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఈ సినిమా తర్వాత లోకేష్ త‌లైవ‌ర్ 171ని డైర‌క్ట్ చేస్తారు. ఈ విష‌యాన్ని లోకేష్ స్వ‌యంగా వెల్ల‌డించారు. అంతే కాదు, ఈ సినిమా త‌ర్వాత అత‌ను ఖైదీ సీక్వెల్ ఖైదీ2ని చేస్తారు. అయితే, కోడంబాక్కం న్యూస్ ప్ర‌కారం ఈ లైన‌ప్‌లో పెద్ద మార్పు క‌నిపిస్తోంది. ఖైదీ2 సినిమా చేయాల్సిన కాల్షీట్ల‌లో లోకేష్ మ‌రో సినిమా చేయ‌డానికి ఫిక్స్ అయ్యార‌ట‌. ఆ సినిమా పేరు రోలెక్స్. సూర్య హీరోగా డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ తెర‌కెక్కిస్తుంది.

క‌మ‌ల్‌హాసన్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన విక్ర‌మ్ సినిమా క్లైమాక్స్ లో రూత్‌లెస్ విల‌న్‌గా న‌టించారు సూర్య‌. ఆ కేర‌క్ట‌ర్ పేరే రోలెక్స్. ఇప్పుడు ఆ కేర‌క్ట‌ర్ ఆధారంగా ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు.రీసెంట్‌గా రోలెక్స్ సినిమా గురించి సూర్య కూడా మెన్ష‌న్ చేశారు. ఈ సినిమా త‌ర్వాత లోకేష్‌తో ఇరుంబు కై మాయావి అనే మూవీ కూడా చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు. అయితే, ఖైదీ 2 లేద‌న్న‌ది కార్తి ఫ్యాన్స్ కి మాత్రం చేదు వార్తే. ఎందుకంటే ఆయ‌న్ని ఢిల్లీ రోల్‌లో ఇంకో సారి చూడ‌టానికి త‌హ‌త‌హ‌లాడుతున్నారు ఫ్యాన్స్. అంద‌రికీ తెలిసిన ఈ విష‌యాన్ని లోకేష్ కూడా క‌న్సిడ‌ర్ చేస్తార‌నే టాక్ కూడా ఒక‌టి న‌డుస్తోంది. ఈ సినిమాలో సూర్య‌, కార్తి ఇద్ద‌రూ ఉండేలా లోకేష్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. రోలెక్స్, ఢిల్లీ కేర‌క్ట‌ర్ల‌ను క‌లిపి లోకేష్ ఓ స్క్రిప్ట్ చేశార‌నే మాట‌లు కూడా న‌డుస్తున్నాయి. 2024 ఆఖ‌రున‌గానీ, 2025 ప్రారంభంలోగానీ, ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్తుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.