English | Telugu
వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఏమైందంటూ నెటిజన్స్ ఆరా!
Updated : Aug 19, 2023
అనసూయ తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు.. అటు బుల్లితెరమీద జబర్దస్త్ అనసూయగా ఓ వెలుగు వెలిగిన అనసూయ.. వెండితెరమీద కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వుంది. ఎప్పుడూసోషల్ మీడియా లో యాక్టీవ్ గా వుండే అనసూయ.. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది.దీన్ని చూసినెటిజన్స్ షాక్ అవుతున్నారు..
సోషల్ మీడియా వేదికగా తన ఇష్టాయిష్టాలతో పాటుగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పే మనస్తత్వం తనది. చాలాసార్లు ట్రోల్స్ కి కూడా గురి అయ్యింది తాను.ఐతే గత కొంతకాలంగా తాను మానసికంగా అంత స్ట్రాంగ్ గాలేను అని.. ఓ ఐదు రోజుల క్రితం తన పరిస్థితి ఇది అంటూ తాను ఏడుస్తున్న వీడియో షేర్ చేసింది.
ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కళ్లు ఏమైంది అంటూ అనసూయకు రిప్లై ఇస్తున్నారు. అనసూయ మాత్రం వీడియో తో పాటుగా తనకు సంతోషం వచ్చినా, ఏ జ్ఞాపకం అయినా సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో వున్నఅందరితో షేర్ చేసుకొనే దాన్ని అని.. అలానే బాధ కలిగినప్పుడు కూడా అలానే షేర్ చేసుకుంటున్నానని..బట్ ఇప్పుడు ఓకే అంటూ రైటప్ షేర్ చేసింది. మొత్తానికి అనసూయ ఏడుస్తున్న వీడియో షేర్ చేసి అందరికి షాక్ ఇస్తే.. ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం ఒక్కొక్కరు ఒక్కోలాగా రియాక్ట్ అవుతున్నారు