English | Telugu

ఏడుపు వీడియోపై అనసూయ క్లారిటీ.. షాక్ లో విజయ్ ఫ్యాన్స్!

అనసూయ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో వెక్కి వెక్కి ఏడుస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోతో పాటు టెక్ట్స్ కూడా జోడించింది. కొద్ది సేపట్లోనే ఈ వీడియో కాస్త వైరల్ అయింది. ఎక్కడ చూసినా ఈ వీడియోనే కనిపించింది. కొందరు అనసూయ భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ పోస్ట్ చేస్తే.. మరికొందరు దాన్ని ట్రోలింగ్ చేశారు. మరికొందరు సింపతీ కోసమే అనసూయ ఈ ఏడుపు వీడియో పెట్టిందంటూ కామెంట్ చేశారు. ఇంత చేసి తను ఎందుకు అలా భావోద్వేగానికి గురైందో మాత్రం వివరించలేదు అనసూయ.

కట్ చేస్తే.. ఆ పోస్ట్ బాగా వైరల్ కావడంతో.. తన ఏడుపు వెనుక కారణాన్ని వివరించింది. అరేయ్ ఏంట్రా ఇది.. అనే టైటిల్ పెట్టి సోషల్ మీడియాలో నెగటివిటీని తను సీరియస్ గా తీసుకోనని.. నెగటివిటీపై తన ఫీలింగ్ ఏడుపుతో ఉండదని, కోపంతో ఉంటుందని చెప్పుకొచ్చింది. అలాగే తన ప్రజెంటేషన్ కొంతమంది అర్థం చేసుకున్నారని, అయితే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన వచ్చిన సందర్భంలో తను అలా భావోద్వేగానికి గురయ్యానని.. సెలబ్రిటీలు అన్నాక హ్యాపీ మూమెంట్స్ నే షేర్ చేయాలన్నది ఏమి లేదని.. నేను పబ్లిక్ ఫిగర్ ని కాబట్టి ఇంట్లో అయినా, బయటైనా ఏడవకూడదని అనేదేమి లేదని.. అదే చెప్పాలనుకున్నానని వీడియోలో షేర్ చేసింది. ఏడవడం వల్ల సింపతీ కోరుకోవడం కాదని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే, అనసూయ ఏ పోస్ట్ చేసినా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు. అలాంటిది ఈ వీడియో చూసి విజయ్ ఫ్యాన్స్ కూడా షాక్ కి గురయ్యారు. విజయ్ ఫ్యాన్స్ కి, అనసూయకి మొన్నటివరకు సోషల్ మీడియాలో మినీ యుద్ధమే జరిగింది. అయితే, అనసూయ ఏడుపుకి కారణం తెలియక అందరిలాగే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా గందరగోళంలో ఉండగా.. అనసూయ పోస్ట్ చేసిన రెండో వీడియోతో అటు నెటిజన్స్ కి, అలాగే విజయ్ ఫ్యాన్స్ కి సమాధానం దొరికినట్లయ్యింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.