English | Telugu
నిత్యమీనన్ మాస్టర్ పీస్ టీజర్ ఎలా ఉందంటే!
Updated : Aug 21, 2023
ప్రేక్షకుల అభిరుచిని బట్టి కొత్త కంటెంట్ తో సినిమాల కథలని తీసుకొస్తున్నారు కొందరు దర్శక నిర్మాతలు. అయితే ఇప్పుడు వెండితెర మీద కంటే ఓటిటిల మీద వచ్చే సినిమాలకి, వెబ్ సిరీస్ లకి ఇప్పుడు క్రేజ్ ఉంది. దానిని వినియోగించుకుంటు ఓటిటి వేదికపై క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామాలు అలరిస్తున్నాయి. అలాంటి కొత్త కథతో నిత్యమీనన్ నటించిన 'మాస్టర్ పీస్' టీజర్ విడుదలైంది. కాగా ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఒక ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కించిన ఈ మాస్టర్ పీస్.. ఫన్, ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉన్నట్టుగా టీజర్ చూస్తుంటే తెలుస్తుంది.
అలా మొదలైంది ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది నిత్య. అంతకు మునుపే బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో టబుకు చెల్లిగా నటించింది. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది. మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమెకి కాస్త ఎక్కువే. అందుకే తొలిసినిమా అలా మొదలైందిలోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా వినిపించింది. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.., అబ్బబ్బో.. అబ్బో.. అంటూ పాడిన రెండు పాటలు విజయవంతం అయ్యాయి.
తెలుగు సినిమాలతో పాటు, అటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అక్కడ కూడా పాటలు పాడుతూ ఒక పాటకు నృత్య దర్శకత్వం కూడా చేసింది. అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద ఊహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన ఇష్క్ మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. గుండెజారి గల్లంతైందే, కాంచన-2, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొకడు, జనతా గ్యారేజ్, అ, గీతా గోవిందం, సైకో, స్కైలాబ్, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాల్లో నటించిన నిత్య.. భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన నిత్య.. కొత్త కథలని ఎంపిక చేసుకుంటూ బిజీగా ఉంటుంది నిత్య మీనన్. తాజాగా నిత్య మీనన్ చేసిన మాస్టర్ పీస్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైంది. శ్రీజిత్ దర్శకత్వం వహించగా, స్క్రీన్ ప్లే, మాటల రచయితగా ప్రవీణ్ ఎస్ చేశాడు. ఈ మాస్టర్ పీస్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్వంతంగా నిర్మించింది. అన్నీ రకాల ఫన్ ఎలిమెంట్స్ ఉన్న ఈ కథ ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.