English | Telugu

అప్పుడు మెగాస్టార్.. ఇప్పుడు సూపర్ స్టార్

ఆమధ్య మెగాస్టార్ చిరంజీవి సినిమా టికెట్ ధరల విషయమై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చేతులు జోడించి వేడుకోవడంపై మెగా అభిమానులు నొచ్చుకున్నారు. మెగాస్టార్ స్థాయికి తనకంటే వయస్సులో చిన్నవాడైన జగన్ ముందు చేతులు జోడించడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. అయితే అది ముఖ్యమంత్రి స్థానానికి చిరు ఇచ్చిన గౌరవం అని సమర్ధించిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు కూడా ఇంచుమించు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

తన రీసెంట్ మూవీ 'జైలర్' సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రజినీకాంత్.. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను లక్నో లోని ఆయన నివాసంలో కలిశారు. కలవడం వరకు ఓకే కానీ యోగి కాళ్ళకు రజినీ మొక్కడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ గా రజినీకాంత్ కి ఎంతో స్థాయి ఉందని, అలాంటి వ్యక్తి తనకంటే చిన్నవాడైన యోగి కాళ్ళు మొక్కడం ఏంటని పలువురు తప్పుబడుతున్నారు. రజినీ చర్యను కొందరు అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కొందరు మాత్రం ఆయన చర్యను సమర్థిస్తున్నారు. రజినీకి మొదటి నుంచి భక్తి ఎక్కువ. అందుకే ముఖ్యమంత్రా? తనకంటే చిన్నవాడా? అనేది చూడకుండా.. యోగి ఆదిత్యనాథ్ ని గోరఖ్‌నాథ్ మఠాధిపతి గానే భావించి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏది ఏమైనా అప్పుడు మెగాస్టార్, ఇప్పుడు సూపర్ స్టార్ తమకు తెలియకుండానే అభిమానులు నొచ్చుకునేలా చేశారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.