English | Telugu

వ‌రుణ్ తేజ్‌కు అంత స్టామినా ఉందా?

టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో విభిన్న‌మైన క‌థాంశాల‌తో సినిమాలు వ‌స్తున్నాయి. హీరోల‌ను కొత్త‌గా చూపిస్తూనే భారీ బ‌డ్జెట్‌ల‌తో సినిమాలు చేయ‌టానికి మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు రెడీ అయిపోతున్నారు. అయితే దీని కార‌ణంగా ఒక్కోసారి బ‌డ్జెట్ ప‌రిమితులు దాటి పోతుంది. స‌రే ఇప్పుడు ఓటీటీ మార్కెట్ బావుంది. మ‌న మేక‌ర్స్‌కు మంచి అమౌంటే వ‌స్తుంది. మ‌రి మిగిలిన అమౌంట్ థియేట్రిక‌ల్ ర‌న్ రూపంలో రావాల్సిందే. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ గుర్తు పెట్టుకుని సినిమా చేస్తే మంచిదే. ఏ మాత్రం తేడా కొట్టినా నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ న‌ష్టాల‌ను చ‌వి చూడాల్సిందే. అఖిల్.. ఏజెంట్, చిరంజీవి.. భోళా శంక‌ర్ సినిమాల విష‌యంలో ఈ విష‌యం స్పష్ట‌మైంది.

అయితే కూడా సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ రిస్క్ చేసిన వ‌రుణ్ తేజ్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో x అనే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెర‌కెక్కించారు. ఆగ‌స్ట్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాను ఎక్కువ భాగం యూర‌ప్‌, అమెరికా వంటి విదేశాల్లో చిత్రీక‌రించారు. ఈ సినిమా నిర్మాణానికి ఏకంగా రూ.55 కోట్లు ఖ‌ర్చు అయ్యింద‌ని టాక్‌. నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కుల రూపంలో ఈ సినిమాకు రూ.26 కోట్ల రూపాయ‌లు వ‌చ్చాయి. ఇక నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కుల రూపంలో గాండీవ‌ధారి అర్జున్ దాదాపు రూ.30 కోట్లు రాబ‌ట్టాల్సి ఉంటుంది. మ‌రి వ‌రుణ్ తేజ్‌కు ఆ రేంజ్ స్టామినా ఉందా అనేది ఆలోచించాల్సిన విష‌యం.

ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. నాజ‌ర్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించ‌బోతున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో మెగా ప్రిన్స్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు.