English | Telugu

యాక్సిడెంట్ కి గురైన ఆశిష్ విద్యార్థి.. భార్యకి ఎలా ఉంది

Publish Date:Jan 3, 2026

        ఆశిష్  విద్యార్థి యాక్సిడెంట్ కి గురవడానికి కారణం ఏంటి! చేసింది వాళ్లేనా! యాక్సిడెంట్ సమయంలో ఎవరెవరు ఉన్నారు భార్య రూపాలి పరిస్థితి ఎలా ఉంది! అభిమానుల ఆందోళన      పర బాషా నటుడైనా తన అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో తెలుగు వారి అభిమాన నటుడుగా మారిన వాళ్ళల్లో ఆశిష్ విద్యార్థి ఒకరు. పైగా రెండున్నర దశాబ్దాల తెలుగు సినీ ప్రస్థానం అంటే ఆశిష్ విద్యార్థికి యాక్టింగ్ కి ఉన్న క్యాపబిలిటీ ని అర్ధం చేసుకోవచ్చు. అన్ని రకాల వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ పోషించినా కూడా నెగిటివ్ షేడ్ ఉన్న వాటిల్లో ఆయన పండించే విలనిజం ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఈ రోజు ఆశిష్ విద్యార్థి యాక్సిడెంట్ కి గురయ్యారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అసలు విషయం చూద్దాం.     ఆశిష్ విద్యార్థి ఈ రోజు ఉదయం అస్సాం లోని గౌహతి లో తన భార్య రూపాలి తో కలిసి రోడ్ దాటుతున్నాడు. కానీ అకస్మాత్తుగా ఒక బైక్ వచ్చి ఆ ఇద్దర్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు కింద పడిపోయారు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఆశిష్ దంపతులని హాస్పిటల్ లో జాయిన్ చేసారు.ఇక ఈ యాక్సిడెంట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఆశిష్ విద్యార్థి ఆరోగ్యంపై ఆందోళన చెందారు. దీంతో ఆశిష్ విద్యార్థి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు అభిమానులతో పాటు ఎవరు ఆందోళన చెందవద్దు. నాకు స్వల్ప గాయాలయ్యాయి. నా భార్యని ఇంకా అబ్జర్వేషన్ లో ఉంచారని వెల్లడి చేసాడు.       Also Read:  పూరి జగన్నాధ్ పరిస్థితి ఏంటి! అసలు ఏమైంది!     పోకిరి, అదుర్స్, నాయక్, ఛత్రపతి, బాద్ షా, ఆగడు,చిరుత, జనతా గారేజ్, గోపాల గోపాల  ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు యాభైకి కి పైగా చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.2023 లో వచ్చిన రైటర్ పద్మభూషణ్ చిత్రంలో చివరగా కనిపించాడు. హిందీలో నలభై చిత్రాల వరకు, తమిళ, మలయాళ,కన్నడ, బెంగాలీ కలిపి సుమారు 60 చిత్రాల వరకు చేసాడు. స్వస్థలం ఢిల్లీ కాగా  రూపాలి రెండో భార్య. తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చి 2023 లో పెళ్లి చేసుకున్నాడు.  

Jet Lee Glimpse: Satya Shines in this dark comedy

Publish Date:Jan 3, 2026

The powerhouse duo of actor Satya and writer-director Ritesh Rana—the minds behind the cult-favorite Mathu Vadalara series—are back with a new venture titled Jet Lee. Known for redefining Telugu cinema’s comedy landscape, the pair seems set to deliver another pop-culture phenomenon. In this high-stakes "hilariocity," Satya takes center stage amidst a stressful hijack situation. The teaser introduces his character with a classic Vemana poem, cleverly highlighting his oblivious nature as he navigates a dangerous rescue mission. While Miss India Rhea Singha showcases impressive action prowess, the comedic heart of the glimpse lies in Satya’s dynamic with Vennela Kishore. The standout moment features Satya humorously labeling himself a "general compartment hero," followed by a satirical, Jet Lee-inspired nunchuck sequence. This blend of stylized action and dry, sarcastic humor is a hallmark of Rana’s sophisticated directorial approach. Produced on a grand scale by Mythri Movie Makers and Clap Entertainments, the project is currently in rapid production. With its unique core of dark humor and sharp presentation, the makers are confident that Jet Lee will provide a blockbuster cinematic experience. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

హీరోలతో సమానంగా పారితోషికం అందుకున్న ఏకైక విలన్‌ రాజనాల!

Publish Date:Jan 2, 2026

(జనవరి 3 రాజనాల శత జయంతి సందర్భంగా..) ఒక సినిమాకి కథానాయకుడు ఎంత ప్రధానమో.. ప్రతినాయకుడు కూడా అంతే ప్రధానం. బలవంతుడైన విలన్‌ని ఎదిరించి పోరాడినపుడే హీరో క్యారెక్టర్‌ బాగా ఎలివేట్‌ అవుతుంది. అలాంటి ఓ పవర్‌ఫుల్‌ విలన్‌ రాజనాల. 1950వ దశకంలోని విలన్లకు పూర్తి భిన్నంగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసిన అరుదైన నటన రాజనాల సొంతం. ఒక విధంగా ప్రతినాయకుడి పాత్రకు వన్నె తెచ్చారు రాజనాల. ఇటీవలి కాలంలో చాలా మంది పాతతరం నటుల శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ ఏడాది తెలుగు సినిమా చరిత్రలో మేటి విలన్‌గా పేరు తెచ్చుకున్న రాజనాల శతజయంతి వచ్చింది   1925 జనవరి 3న నెల్లూరు జిల్లా కావలిలో జన్మించారు రాజనాల. ఆయన పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావునాయుడు. ఇంటర్‌ పూర్తయిన తర్వాత డిగ్రీ చెయ్యాలని అనుకోలేదు. ఎంత చదివినా చివరికి ఉద్యోగమే కదా చేసేది అనే ఆలోచనతో ఇంటర్‌తోనే చదువును ఆపేశారు. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. ఆ తర్వాత పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలు రాసి రెవెన్యూ ఇన్‌సెక్టర్‌గా ప్రమోషన్‌ పొందారు. 1944 నుంచి 1951 వరకు ఆ డిపార్ట్‌మెంట్‌లోనే వర్క్‌ చేశారు. అయితే లక్నో యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందారు. సినిమాల్లోకి రాకముందే ఇంగ్లీష్‌లో మంచి పట్టు సాధించారు. ఇంగ్లీష్‌తోపాటు పలు భాషలు ఆయన మాట్లాడేవారు. ఆయన ఇంటిలోని లైబ్రరీలో లక్షల విలువ చేసే పుస్తకాలు ఉండేవి.  1948లో స్నేహితుడు లక్ష్మీకుమార్‌రెడ్డితో కలిసి ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా నాటకాలు వేశారు రాజనాల. తొలి ప్రయత్నంగా ఆత్రేయ రచించిన ఎవరు దొంగ అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండే నాటకం కావడంతో జిల్లా కలెక్టర్‌ ఆగ్రహానికి గురయ్యారు రాజనాల. ఆ తర్వాత అదే తరహాలో ప్రగతి అనే నాటకం వేశారు. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండడంతో జిల్లా కలెక్టర్‌ రాజనాలను మూడు నెలలు సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌ పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరినప్పటికీ సవ్యంగా పనిచేయలేకపోయారు.    అప్పటికే మిత్రుడు లక్ష్మీకుమార్‌రెడ్డి సినిమా ప్రయత్నాల కోసం మద్రాస్‌ వెళ్లి నిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు. 1951లో ఆయన నిర్మిస్తున్న ‘ప్రతిజ్ఞ’ చిత్రంలో విలన్‌గా అవకాశం ఇప్పించారు లక్ష్మీకుమార్‌రెడ్డి. అదే రాజనాల మొదటి సినిమా. ఈ సినిమాలో ఆయన విలన్‌గా నటించారు. వాస్తవానికి రాజనాలకు విలన్‌గా నటించడం ఇష్టం లేదు. 1953లో విడుదలైన ‘ప్రతిజ్ఞ’ అంతగా ఆడకపోయినా నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘వద్దంటే డబ్బు’ చిత్రంలో ఆయనకు మామగారిగా వృద్ధ పాత్రలో నటించారు రాజనాల. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌తో రాజనాలకు సాన్నిహిత్యం పెరిగింది. ఆ సినిమా తర్వాత నుంచి రాజనాలను మామాజీ అని పిలిచేవారు ఎన్టీఆర్‌.    చాలా తక్కువ సమయంలోనే విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు రాజనాల. అప్పట్లో ఎన్టీఆర్‌, కాంతారావు ఎక్కువగా జానపద సినిమాలు చేసేవారు. ఎవరు హీరో అయినా విలన్‌గా రాజనాల నటించేవారు. హీరోలతో సమానంగా పారితోషికం అందుకున్న ఏకైక విలన్‌ రాజనాల. దాదాపు 15 సంవత్సరాలు విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా 400కి పైగా సినిమాలు చేశారు. 1966లో వచ్చిన హాలీవుడ్‌ సినిమా ‘మాయా ది మాగ్నిఫిషెంట్‌’ చిత్రంలో ఇండియన్‌ అఫీషియల్‌గా నటించారు.   1950, 1950 దశకాల్లో విలన్‌ అంటే రాజనాల అనే పేరు తెచ్చుకున్నారు. విలన్‌లో ఉండే క్రూరత్వం రాజనాలలో కనిపించేది. వివిధ లొకేషన్లలో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్లేందుకు జనం భయపడేవారు. ముఖ్యంగా మహిళలు ఆయన దగ్గరకు వెళ్లేవారు కాదు. సినిమాల్లో విలన్‌గా ఆయన నటన, ముఖ్యంగా ఆయన నవ్వు ఎంతో పాపులర్‌ అయింది. తన కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో విలన్‌గా నటించారు రాజనాల. ఎన్టీఆర్‌, ఎం.జి.ఆర్‌, జయలలిత.. ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత దక్కించుకున్నారు.    వ్యక్తిగత విషయాలకు వస్తే.. మొదట శోభను వివాహం చేసుకున్నారు రాజనాల. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె అకాల మరణం చెందడంతో భూదేవిని పెళ్లి చేసుకున్నారు. రాజనాలకు నలుగురు సంతానం. 1970వ దశకం వచ్చే సరికి పరిశ్రమకు కొత్త విలన్స్‌ రావడం ప్రారంభమైంది. దాంతో ఆయనకు అవకాశాలు బాగా తగ్గాయి. సినిమాల ద్వారా ఎంతో సంపాదించినప్పటికీ దానధర్మాలు ఎక్కువ చేయడం, సినిమాలు తగ్గడంతో ఆస్తంతా కరిగిపోయింది. అయినప్పటికీ ఎన్టీఆర్‌ తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చి ఆదుకున్నారు. చివరి రోజుల్లో ఇ.వి.వి.సత్యనారాయణ హలోబ్రదర్‌ చిత్రంలో, ఎస్‌.వి.కృష్ణారెడ్డి నెంబర్‌వన్‌ సినిమాలో అవకాశాలు ఇచ్చారు. ఆయన పరిస్థితి తెలుసుకున్న కృష్ణ తను హీరోగా నటిస్తున్న తెలుగువీర లేవరా చిత్రంలో మంచి పాత్ర ఇచ్చారు. అరకులో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు మధుమేహం పెరగడం, దాని వల్ల ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ కావడంతో కుడికాలును తొలగించారు డాక్టర్లు. దాంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. 1998లో రాజనాలకు గుండెపోటు రావడంతో చెన్నయ్‌లోని విజయ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ 1998 మే 21న 73 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు రాజనాల.

సల్మాన్ ఖాన్ మూవీపై చైనా ఆగ్రహం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న సల్మాన్  డైలాగులు 

Publish Date:Dec 30, 2025

    -ఎందుకు అంత అక్కసు  -ఏముంది ఆ మూవీలో  -చైనా మీడియా ఏం చెప్తుంది -సల్మాన్ ఏం చెప్పాడు       సికిందర్ పరాజయంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని లక్ష్యంతో తన కట్ అవుట్ కి తగ్గ మూవీ' బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'(Battle of galwan)తో సల్మాన్ ఖాన్(Salman Khan)ముస్తాబు అవుతున్నాడు. చైనా, మన దేశానికి మధ్య గల్వాన్(Galwan)నది హద్దు విషయంలో 2020 జూన్ 16 న జరిగిన యుద్దాన్ని బేస్ చేసుకొని తెరకెక్కుతుంది. అప్పట్లో ఆ పోరాటంలో మన సైనికులు ఇరవై మంది వరకు చనిపోయారు. రీసెంట్ గా మొన్న 27 న జరిగిన సల్మాన్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' నుంచి టీజర్ రిలీజ్ చేసారు.సదరు టీజర్ లో సల్మాన్ నుంచి వచ్చిన చావుకి ఎందుకు భయపడతారు, అది అనివార్యం అనే డైలాగ్ తో పాటు మరిన్ని డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. కానీ ఇప్పుడు చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై తమ అక్కసుని ప్రదర్శిస్తుంది.       అంతర్జాతీయ సమాజాన్ని తప్పు దోవ పట్టించి చైనా పై వ్యతిరేకతని రెచ్చగొట్టేందుకు భారత్ చరిత్రని వక్రీకరిస్తుంది. గల్వాన్ లో ఘర్షణలకి భారత్ నే కారణం. భారత దళాలు అక్రమంగా చైనా భూభాగంలోకి చొరబడి దాడి చేసాయి.  బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రం జాతీయ వాదంతో కూడిన మెలోడ్రామా అని గ్లోబల్ టైమ్స్ లో  రాసుకొచ్చింది. చైనా సైనిక నిపుణుడు  సాంగ్ జాంగ్ పింగ్ కూడా మాట్లాడుతు 'చైనా సార్వభౌమ భూభాగాన్ని రక్షించుకోవాలనుకునే మా సైనికుల దృఢ సంకల్పాన్ని మా సైనికులు కోల్పోరు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది.       Also read:  కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే      గల్వాన్ నది చైనా పాలనలో ఉన్న వివాదాస్పద 'అక్సాయ్ చిన్' ప్రాంతం నుండి భారతదేశంలోని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రవహిస్తుంది . ఇది కారకోరం శ్రేణికి తూర్పు వైపున ఉన్న సామ్‌జుంగ్లింగ్ యొక్క కారవాన్ క్యాంపింగ్ గ్రౌండ్ సమీపంలో ఉద్భవించి పశ్చిమాన ప్రవహించి ష్యోక్ నదిలో కలుస్తుంది . సంగమ స్థానం దౌలత్ బేగ్ ఓల్డీకి దక్షిణంగా 102 కి.మీ దూరంలో ఉంది. ష్యోక్ నది సింధు నదికి ఉపనది , గల్వాన్‌ను సింధు నది వ్యవస్థలో భాగం చేస్తుంది. ఈ విషయంలోనే ఇరు దేశాల మధ్య ఎప్పట్నుంచో గొడవలు జరుగుతున్నాయి. ఇక బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ కి అపూర్వ లఖియా(Apoorva Lakhia)దర్శకత్వం వహిస్తుండగా సల్మాన్ ఖాన్ సొంతంగా నిర్మిస్తున్నాడు. చిత్రాంగద కధానాయిక.  

Jayam serial : పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా రుద్రని కాపాడిన గంగ!

Publish Date:Jan 3, 2026

      జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -158 లో ......రుద్ర హడావిడిగా వెళ్తాడు. గంగ గదిలో ఉండగా అప్పుడే ఇషిక వస్తుంది. ఇప్పుడు రుద్ర బావ పారు దగ్గరికి వెళ్ళాడు. తనకి ఇంకా రుద్ర బావపై ప్రేమ ఉంది. ఇప్పుడు తనవైపుకి తిప్పుకుంటుందని ఇషిక అంటుంది. దాంతో గంగలో టెన్షన్ మొదలవుతుంది. రుద్ర వెనకాలే గంగ వెళ్తుంది. రుద్ర వెళ్తుంటే మధ్యలో కార్ ఆగిపోతుంది. రుద్ర కంటే ముందే గంగ హోటల్ కి వెళ్తుంది.       అక్కడ పారు ఎక్కడుందో కనుక్కొని లోపలికి వెళ్తుంది. మరొకవైపు ప్రమీల, ప్రీతి అందరు సరదాగా మాట్లాడుకుంటుంటే శోభనం గదిలో గంగ, రుద్ర బావ లేరు.. హడావిడిగా ఒకరి తర్వాత ఒకరు బయటకి వెళ్లారని ఇషిక చెప్తుంది. మరొకవైపు గంగ లోపలికి రావడం చూసి పారు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి రుద్ర వచ్చాడు. లాక్ చేయమని చెప్తుంది. ఆల్రెడీ పారు ఉన్న గదిలో గంగ ఉంటుంది. రుద్ర వస్తున్నాడని కర్టెన్ చాటున దాక్కుంటుంది. మరొకవైపు పారు పోలీసులకి ఫోన్ చేస్తుంది. రుద్ర లోపలికి వచ్చి పారు అని పిలుస్తుంటే బయట నుండి తన ఫ్రెండ్ వచ్చి ఇందాకే పారు వెళ్ళిపోయింది. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. నేను చాలా హా్ట్ అంటూ దగ్గరికి వస్తుంటే రుద్ర తోసేస్తాడు. దాంతో బ్లౌజ్ చింపుకొని హెల్ప్ అంటూ అరుస్తుంది. డోర్ తియ్యగానే పోలీసులు ఉంటారు. నన్ను బలవంతం చెయ్యబోయడని చెప్పగానే రుద్రని అరెస్ట్ చేయమని ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. ఆగండి అని లోపల నుండి గంగ వచ్చి.. నా భర్త ఏ తప్పు చెయ్యలేదని చెప్తుంది.       ఎలా నమ్మాలని ఇన్స్‌పెక్టర్ అనగానే గంగ రూమ్ లో జరిగింది వీడియో తీసింది చూపిస్తుంది. దాంతో ఆ అమ్మాయిపై ఇన్‌స్పెక్టర్ కోప్పడి స్టేషన్ కి రమ్మంటాడు. నా భర్తకి సారీ చెప్పమని గంగ అనగానే ఆమె రుద్రకి సారీ చెప్తుంది. పారు భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. ఈ పాటికీ రుద్రని అరెస్ట్ చేసి ఉంటారని అనుకుంటారు. మరొకవైపు రుద్ర గంగ ఎక్కడికి వెళ్లారని ఇంట్లో అందరు టెన్షన్ పడుతారు. రుద్ర, గంగ ఇంటికి వస్తారు. ఇంటి బయటే ఉంటారు. జరిగింది ఏది ఇంట్లో చెప్పకండి అని గంగ అంటుంది. అసలు నువ్వు అక్కడికి ఎలా వచ్చావ్.. నేను పారుతో మాట్లాడినప్పుడు డౌట్ పడి వచ్చావా అని రుద్ర అంటుంటే.. విన్న మాట నిజమే కానీ డౌట్ తో కాదు మీకు ఏదో ప్రాబ్లమ్ వస్తుందేమోనని గంగ అంటుంది. ఇక కాసేపటికి ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.      

రామ్ చరణ్ డైరెక్టర్ తో దుల్కర్ సల్మాన్ మూవీ!

Publish Date:Dec 31, 2025

  మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)కి తెలుగునాట కూడా మంచి గుర్తింపు ఉంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ప్రస్తుతం తెలుగులో 'ఆకాశంలో ఒక తార'తో పాటు ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.   పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక ఫిల్మ్ చేయడానికి దుల్కర్ సల్మాన్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు.   ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది.. రెండో సినిమాకే రామ్ చరణ్ తో 'రచ్చ' చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సీటీమార్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత దుల్కర్ ని డైరెక్ట్ చేయనున్నాడట.   ఇప్పటికే దుల్కర్ సల్మాన్, సంపత్ నంది మధ్య కథా చర్చలు జరిగాయని.. సంపత్ చెప్పిన స్టోరీ లైన్ కి దుల్కర్ ఇంప్రెస్ అయ్యాడని వినికిడి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.  

Are Vijay and Rashmika planning wedding on this date?

Publish Date:Dec 29, 2025

Vijay Deverakonda and Rashmika Mandanna are said to be in love from the moment they have become close on the sets of Geetha Govindam. Their friendship grew further after she cancelled her engagement with Rakshit Shetty and their off-screen intimacy grew further.  They have always maintained that they are friends and become close family friends as well. Rashmika Mandanna, in recent times, started being more open about how she values Vijay's existence in her life and how she wishes him to make a huge comeback in his career as he is struggling with commercial hits.  He also wished her on every success of hers and even powered her recent film, The Girlfriend, by giving voice over for trailer. Now, the rumors have been rampant about the couple getting engaged in a private ceremony last year. The rumors have stated that both the families have agreed for their marriage and are preparing for marriage.  Today, the rumors have surfaced about the couple getting married at Udaipur Palace on 26th February 2026. The arrangements about this huge wedding are going on say the reports and both the actors' families are silent on these reports. Well, will they officially confirm or deny these reports, we have to wait and see.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969