English | Telugu

Illu illalu pillalu : ప్రేమని క్షమించేసిన అత్తమామలు.. విశ్వపై అమూల్య ఫైర్!

స్టార్ట్ మా టీవీ లో ప్రసారమవుతున్నా సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -358 లో..... తను చేసిన తప్పు తెలుసుకొని ఇంట్లో వాళ్ళని క్షమించమని అడుగుతుంది ప్రేమ. మా అన్నయ్య మాటలు నమ్మి అంత పెద్ద గొడవ అవ్వడానికి కారణం అయ్యానని రామరాజుతో ప్రేమ అనగానే రామరాజు క్షమిస్తాడు. సారీ అత్తయ్య అని వేదవతితో ప్రేమ అనగానే తను దగ్గరికి తీసుకుంటుంది. అమ్మో వీళ్ళు మళ్ళీ కలిసిపోయారని శ్రీవల్లి అనుకుంటుంది.. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమించమంటే ఎలా ప్రేమ.. మావయ్య గారి పరువుపోయింది. ఇంకొకసారి మావయ్య చొక్కా చింపరని గ్యారంటీ ఏంటని శ్రీవల్లి అంటుంది.

ప్రేమ ఏదో తెలియక తప్పు చేసింది.. మావయ్య గారు క్షమిస్తుంటే నీకెంటి ప్రాబ్లమ్.. నువ్వు తప్పు చెయ్యలేదా ఎవరైనా తప్పు చేస్తారని నర్మద అంటుంది. మావయ్య గారు క్షమించారు అత్తయ్య కూడా క్షమిస్తుందని నర్మద అనగానే ఇంతటితో ఈ విషయం వదిలెయ్యండి అని రామరాజు అంటాడు. ప్రేమ, నర్మద హ్యాపీగా ఫీల్ అవుతూ వేదవతిని హగ్ చేసుకుంటే శ్రీవల్లి కుళ్ళుకుంటుంది. మరొకవైపు ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి.. సారీ చెప్తుంటే నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. ఇక్కడ నుండి వెళ్ళిపోమని ధీరజ్ అంటాడు. దాంతో రూమ్ లో నుండి వెళ్లిపోతుంటే నువ్వు పిలిచే వరకు రానని ప్రేమ బయట చలిలో కూర్చొని ఉంటుంది.


మరొకవైపు అమూల్యని విశ్వ పిలుస్తాడు. నువ్వు ఏదో సిన్సియర్ గా లవ్ చేసావనుకున్నాను కానీ నీ చెల్లిని మీ ఇంటికి రప్పించుకోవడానికి ట్రాప్ చేసావని అనుకోలేదని విశ్వపై అమూల్య కోప్పడుతుంది. అదేం లేదు అమూల్య.. నేను నిన్ను నిజంగా ప్రేమించాను.. నువ్వు లేకపోతే ఎప్పటికి ఇలాగే ఉంటానని ఎమోషనల్ గా మాట్లాడి విశ్వ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాసేపటికి ధీరజ్ వెళ్లి వెచ్చగా ఉండడానికి మంటపెడతాడు. ప్రేమ పక్కన ధీరజ్ కూర్చొని తనపై శాలువా కప్పినట్లు ఉహించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.