English | Telugu

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.


హారిక ఫోన్ మహాకి తీసుకొని వచ్చి ఇస్తుంది. బలవంతంగా మాట్లాడి ఫోన్ కట్ చేసి పడుకుంటుంది మహా. భూషణ్ ఇగో హర్ట్ అయి వరుసగా ఫోన్ చేస్తునే ఉంటాడు. మహా ఉదయం నిద్ర లేచేసరికి చూసేసరికి రెండు వందల నాలుగు మిస్డ్ కాల్స్ ఉంటాయి. హారిక ఫోన్ కి నూట ముప్పై నాలుగు మిస్డ్ కాల్స్ ఉంటాయి. అవి చూసి హరిక, మహా షాక్ అవుతారు. భూషణ్ ఉదయం కాగానే కోపంగా ప్రతాప్ దగ్గరికి వచ్చి విషయం చెప్తాడు. దాంతో మహా వాళ్ళ అమ్మ మహా దగ్గరికి వెళ్లి అల్లుడు గారు వచ్చారని కిందకి రమ్మని చెప్తుంది. చాలాసేపు అయిన మహా కిందకి రాకపోయేసరికి భూషణ్ నేరుగా మహా దగ్గరికి వెళ్తాడు. సెన్స్ లేదా ఇలా సరాసరి వస్తున్నావ్.. నీకు ఏం రైట్ ఉందని.. ఇలా వస్తున్నావ్ రా అని మహా అనగానే భూషణ్ షాక్ అవుతాడు. హారిక భయపడుతుంది.


అప్పుడే ప్రతాప్ వస్తాడు. మహా అన్నమాటలు ప్రతాప్ కి భూషణ్ చెప్పగానే మహా చెంప చెల్లుమనిపిస్తాడు. మహా చేత భూషణ్ కి సారీ చెప్పిస్తాడు. మా అమ్మాయికి నీతో ఎలా ఉండాలో నేర్పిస్తానని భూషణ్ తో ప్రతాప్ అంటాడు. నేను చెప్పేది వినకుండా తను చెప్పేది విని తనని కొట్టాడని మహా బాగా ఏడుస్తుంది. తరువాయి భాగంలో చక్రి దగ్గరికి మహా వెళ్లి.. నేను ఈ ఇంట్లో నుండి వెళ్లిపోవాలి.. నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది‌. సరేనని చక్రి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.