English | Telugu

సినిమా పేరు:ఛాంపియన్
బ్యానర్:వైజయంతి మూవీస్
Rating:2.75
విడుదలయిన తేది:Dec 25, 2025

సినిమా పేరు: ఛాంపియన్
న‌టీన‌టులు: రోషన్, అనశ్వర రాజన్, దుల్కర్ సల్మాన్, కల్యాణ చక్రవర్తి, సంతోష్ ప్రతాప్,అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: మది
ఎడిట‌ర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 
సంగీతం: మిక్కీ జె మేయర్ 
సమర్పణ:  సి.అశ్వినీదత్ 
బ్యానర్స్: స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఐడియాస్  
నిర్మాత‌లు: ప్రియాంక దత్, స్వప్న దత్, జెమినీ కిరణ్, జి.కె మోహన్   
రచన, ద‌ర్శ‌క‌త్వం: ప్రదీప్ అద్వైతం  
రిలీజ్ డేట్ : డిసెంబర్ 25 ,2025 


శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan) ఈరోజు 'ఛాంపియన్'(Champion)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో అడుగుపెట్టాడు. తెలంగాణ ఏరియాలోని సిద్ధిపేట జిల్లాలో ఉన్న బైరాన్ పల్లి గ్రామస్థులు రజాకార్ల తో చేసిన పోరాటం నేపథ్యంలో తెరకెక్కడంతో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.


కథ

మైఖేల్ విలియమ్స్(రోషన్) ఫుట్ బాల్ ఆటలో మంచి నైపుణ్యం కలిగిన హుషారైన యువకుడు. ఇంగ్లాండ్ దేశం వెళ్లి ఆ దేశానికీ చెందిన క్లబ్ తరువున ఆడి అక్కడే సెటిల్ అవ్వాలనేది జీవిత లక్ష్యం. యుద్దాలు, పోరాటాలు అనేవి ఇష్టపడే వాళ్ళని దూరం చేస్తాయనే ఫిలాసఫీ తో కూడా ఉంటాడు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న విధ్వంసకారుడు రజ్వి మాత్రం పాకిస్థాన్ లాగా హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ఉండాలని అనుకుంటాడు. బైరాన్ పల్లి గ్రామస్థులు మాత్రం రజ్వికి ఎదురుతిరుగుతారు. మైఖేల్ కూడా బైరాన్ పల్లి గ్రామస్థులతో కలిసి రజ్వి సైన్యంతో పోరాడతాడు. మైఖేల్ బైరాన పల్లి ఎందుకు వెళ్ళాడు?  అతని ఇంగ్లాండ్ లక్ష్యం ఏమైంది?  . అసలు యుద్దాలు, పోరాటాలు అనేవి ఇష్టపడే వాళ్ళని దూరం చేస్తాయని నమ్మే మైఖేల్ ఎందుకు యుద్ధం చేసాడు? ఆ పోరాటంలో ఎవరు గెలిచారు? మైఖేల్ కుటుంబ నేపధ్యం ఏంటి?  బైరాన్ పల్లి గ్రామస్థుల పోరాటం ఎందుకు? ఆ ఊరి కథ ఏంటి? అనేదే ఈ చిత్ర కథ.


ఎనాలసిస్ :

ముమ్మాటికి ఛాంపియన్ గొప్ప కథే. తన జీవితంపై ఒక నమ్మకం, గోల్ పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం ఉన్న ఒక చలాకి యువకుడు, తనకి సంబంధం లేని ప్రపంచంలోకి వచ్చి, జీవితం యొక్క అర్దాన్ని తెలుసుకొని వీరుడులా మారడం అంటే చాలా మంచి కథే. పైగా రజాకార్లకి ఎదురొడ్డి పోరాడుతున్న బైరాన్ పల్లి నేపధ్యం అంటే ఏ స్థాయిలో తెరకెక్కించవచ్చో అర్ధం చేసుకోవచ్చు. కానీ సన్నివేశాలుగా మలచడంలో మేకర్స్ తడబడ్డారు.

తెలంగాణ సాయుధ రైతు పోరాటంతో పాటు మైకేల్,చంద్ర కళ ప్రేమని ఎక్కువగా చూపించలేదు. కథ యొక్క లక్ష్యానికి ఈ రెండు అంశాలకి సంబంధించి పకడ్బందీ స్క్రీన్ ప్లే ని సృష్టించుకుంటే ఛాంపియన్ ఇంకాస్త బాగుండేది. మూవీ మొత్తంపై రోషన్ పెర్ఫార్మెన్సు మాత్రం హైలెట్. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే సినిమా ప్రారంభమే సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రు సీన్స్ తో ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఆ తర్వాత రోషన్ ఎంట్రీ, తన లక్ష్య సాధన కోసం వచ్చే సీన్స్, పారలాల్ గా రజాకార్ల దాడులు, బైరాన్ పల్లి వీరుల ధైర్య సాహసాలు ఎస్టాబ్లిష్ చెయ్యడంతో సినిమాపై ఆసక్తి పెరగడంతో పాటు నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఏర్పడింది.

అందుకు తగ్గట్టే సీన్స్ వచ్చాయి.  మైకేల్, బైరాన్ పల్లి లో ఉన్నప్పుడు సీన్స్ కూడా బాగున్నాయి. కానీ చంద్ర కళ, మైఖేల్  ప్రేమని మరింతగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. దీంతో కథ పరిధి మరింత పెరిగేది. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో కథనంలో వేగాన్ని పెంచుతు రోషన్ ని పోరాటం వైపు ప్రారంభం నుంచే మళ్ళించాల్సింది. ఎందుకంటే మైఖేల్ చివరికైనా భైరాన్ పల్లి తరుపు పోరాటం చేస్తాడని మనకి ముందుగానే తెలుస్తుంది.

కాబట్టి మైఖేల్ రజాకార్ల పై పోరాటం చేసి తన లక్ష్యమైన ఫుట్ బాల్ ఆడటం కోసం ప్రేమించిన చంద్రకళ తో ఇంగ్లాండ్ వెళ్లిపోవాల్సింది.  కాకపోతే సెకండ్ హాఫ్ లో వచ్చిన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి ప్రీ క్లైమాక్స్ లో  మైఖేల్ తో  దుల్కర్ సల్మాన్ చెప్పే డైలాగ్ ఎక్స్ లెంట్. ఆ ఒక్క డైలాగ్ సినిమా ఆత్మ ఆత్మ మొత్తాన్ని చెప్పింది. బలమైన విలన్ లేకపోవడం కొంచం మైనస్.అసలు ఆ దిశగా ఎక్కువగా దృష్టి పెట్టలేదు.

నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు

భిన్నమైన షేడ్స్ ఉన్న మైకేల్ క్యారక్టర్ లో రోషన్ విజృంభించి చేసాడు. సెకండ్ సినిమాకే ఆ స్థాయి పెర్ ఫార్మెన్స్ ఇచ్చాడంటే ఫ్యూచర్ లో తెలుగు స్టార్ హీరోలలో ఒకడిగా మారడానికి కర్చీఫ్ వేసినట్టే. అంతలా రోషన్ పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసాడు.నూతన కధానాయిక అనశ్వర రాజన్ కూడా తన క్యారక్టర్ పరిధి మేరకు చక్కగా చేసి మెప్పించింది. మిగతా క్యారెక్టర్స్ లో చేసిన కల్యాణ చక్రవర్తి, సంతోష్ ప్రతాప్,అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, రచ్చ రవితో పాటు బైరాన్ పల్లి గ్రామస్థులగా చేసిన అందరు తమ క్యారెక్టర్స్ కి జీవం పోశారు. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఛాంపియన్ కి మంచి భూస్టప్ ని ఇచ్చింది. సాంగ్స్ కూడా కథకి తగట్టుగా ఉన్నాయి.నిర్మాణ విలువలు హై రేంజ్ లో ఉన్నాయి. ప్రదీప్ అద్వైతం(Pradeep Advaitham)దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు కానీ రచయితగా ఫెయిల్ అయ్యాడు. మది అందించిన ఫొటోగ్రఫీ ఛాంపియన్ కి అతి పెద్ద బలంగా నిలిచింది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఫైనల్ గా చెప్పాలంటే కథ చాలా మంచింది. కానీ ప్రాపర్ గా ఎలివేట్ చేయలేకపోయారు. రోషన్ పెర్ ఫార్మెన్స్ మాత్రం ఆయువుపట్టుగా నిలిచింది. క్లైమాక్స్ లో రోషన్ ని చంపాల్సిన అవసరం లేదు. వేరేగా ప్లాన్ చేసుంటే ఛాంపియన్ ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండేది.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 2.75