English | Telugu

Brahmamudi: కావ్యకి పొంచి ఉన్న ప్రమాదం.. రుద్రాణి ప్లాన్ నెరవేరేనా!


స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -920 లో..... ఇంట్లో ఎంటర్‌టైన్మెంట్ ఉండాలని చీటీలు రాసి అందులో ఎవరికి ఏది వస్తుందో.. అది పర్ఫామ్ చెయ్యాలని రాజ్ చెప్తాడు. మొదటగా సీతారామయ్య ఒక పద్యం చెప్తాడు. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, ప్రకాష్ ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. తర్వాత స్వప్న, రాహుల్ చీటీలో వచ్చిన సినిమా పేరు యాక్టింగ్ చేసి చూపిస్తే.. అది చెప్పాలి.. అలా రాహుల్ యాక్టింగ్ చేస్తుంటే స్వప్న చేస్తుంది.

ఆ తర్వాత రుద్రాణి డైలాగ్ చెప్తుంది. అప్పు , కళ్యాణ్ వంతు వస్తుంది. అలా అందరు ఏదో ఒక పర్ ఫామెన్స్ ఇస్తూ ఎంటర్‌టైన్మెంట్ చేస్తున్నారు. ఈ రోజు నువ్వు ఆయుర్వేద మందు తాగలేదని కావ్యకి రాజ్ గుర్తుచేస్తాడు. తను మర్చిపోతే నువ్వు గుర్తు చేయాలి కదా వెళ్లి తీసుకొనిరా అని ఇందిరాదేవి అనగానే రాజ్ వెళ్లి తీసుకొని వచ్చి కావ్యకి ఇస్తాడు కావ్య అది తాగుతుంది. ఆ తర్వాత ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు ఒక పర్ ఫామెన్స్ చేస్తారు. సుభాష్ డైలాగ్ చెప్తాడు. ఇక మిగిలింది రేఖ. తనని అందరు డ్యాన్స్ చేయమంటారు. తనేమో బావతో చేస్తానని అంటుంది.


కావ్య వంక చూస్తాడు రాజ్. రేఖ ఆల్రెడీ రాజ్ తో డ్యాన్స్ చెయ్యాలని ఫిక్స్ అవుతుంది. రాజ్ ఇబ్బంది పడుతూ డ్యాన్స్ చేస్తాడు. వాళ్లిద్దరు డ్యాన్స్ చేస్తుంటే రుద్రాణి మురిసిపోతుంది. తరువాయి భాగంలో కనకం తన ఇద్దరు కూతుళ్ళకి శ్రీమంతం చెయ్యడానికి తమ ఇంటికి తీసుకొని వెళ్ళడానికి వస్తుంది. శ్రీమంతం ఇక్కడే అని అపర్ణ, ఇందిరాదేవి అనగానే కనకం సరే అంటుంది. ఆ తర్వాత పసరు మందు ఇది బాగా పని చేస్తుందని మళ్ళీ ఒకతను వచ్చి రుద్రాణికి ఇస్తాడు. పసరు మందు కలిపిన భోజనం కావ్య తింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.