English | Telugu

పూరి జగన్నాధ్ పరిస్థితి ఏంటి! అసలు ఏమైంది!


-పూరి జగన్నాధ్ సృష్టించిన ప్రభంజనం కళ్ళ ముందే ఉంది
-విజయ్ సేతుపతి చిత్రం గురించి ఎందుకు అప్ డేట్ ఇవ్వడం లేదు
-ఆ విషయంలో పూరి వెనకపడ్డాడా!
-ఫ్యాన్స్ సూటిగా ఏం అడుగుతున్నారు


దర్శక రచయితల్లో తనకంటు ఒక స్టైల్ ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళల్లో 'పూరిజగన్నాధ్(Puri jagannadh)కూడా ఒకరు. ప్రతి సన్నివేశంలోను, డైలాగ్స్ లోను నటీనటుల బాడీ లాంగ్వేజ్ లోను, ఎంటర్ టైన్ మెంట్ లోను పూరి మార్క్ స్పష్టంగా కనపడుతుంది.గత రెండు చిత్రాలు లైగర్, డబుల్ ఇస్మార్ట్ తో పరాజయాలని అందుకోవడంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని విజయ్ సేతుపతి(VIjay Sethupathi)తో ఒక మూవీని చేస్తున్నాడు. ఊహించని కాంబో కావడంతో సదరు చిత్రంపై అంచనాలు హై రేంజ్ లో ఏర్పడ్డాయి.


ఇక ఈ చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. పక్కా బౌండ్ స్క్రిప్ట్ తో షూటింగ్ ని త్వరగా పూర్తి చెయ్యడం పూరి స్టైల్. ఆ కోవలోనే విజయ్ సేతుపతి మూవీని కూడా పూర్తి చేసినట్టుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రం గురించి ఎలాంటి విషయాల్ని పూరి వెల్లడి చేయడంలేదు. న్యూ ఇయర్ సందర్భంగా ఏమైనా అప్ డేట్ వస్తుందేమో అని అభిమానులు అనుకున్నారు. కానీ నో అప్ డేట్. దీంతో వాళ్ళు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు మూవీ గురించి అప్ డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.


Also read:బెనిఫిట్ షో కి దారేది

సినీ సర్కిల్స్ లో మాత్రం మూవీకి బిజినెస్ చేసే విషయంలో పూరి వెనకపడ్డాడని, ఓటిటి డీల్ కూడా ఇంకా పూర్తి కాలేదనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి 'స్లమ్ డాగ్' అనే టైటిల్ ప్రచారంలో ఉండగా విజయ్ సేతుపతి సరసన సంయుక్త మీనన్(Samyuktha Menon)హీరోయిన్ కాగా టబు(Tabu)మరో ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపిస్తుంది. ఛార్మి తో కలిసి పూరి నే నిర్మిస్తున్నాడు. ఛార్మి తో కలిసి పూరి నే నిర్మిస్తున్నాడు.