English | Telugu
విజయ్-రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్..!
Updated : Dec 29, 2025
కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. విజయ్-రష్మిక నిశ్చితార్థం ఈ ఏడాది అక్టోబర్ లో జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పుడు తాజాగా వీరి పెళ్లి ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.
విజయ్, రష్మిక వివాహం 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో జరగనుందట. ఈ విషయాన్ని విజయ్, రష్మిక త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఫ్యాన్స్ కి వారిచ్చే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదేనని అంటున్నారు.
Also Read: 'ది రాజా సాబ్' కొత్త ట్రైలర్.. మారుతి ఇలా చేస్తాడని ఊహించలేదు!
2018లో విడుదలైన గీత గోవిందం, 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలలో విజయ్, రష్మిక కలిసి నటించారు. గత కొన్నేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఇద్దరూ ఫెస్టివల్స్ కలిసి జరుపుకోవడం, సీక్రెట్ గా వెకేషన్స్ కి వెళ్ళడం వంటివి చేశారు. ఇక ఇటీవల అక్టోబర్ లో ఎంగేజ్ మెంట్ జరిగిందని, రానున్న ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగనుందని న్యూస్ వినిపిస్తోంది.