ఓలీ.. నీ దుంప‌తెగ‌...ఎంత ప‌ని చేశావు

  నేపాల్ ఇంత‌గా ఎందుకు త‌గ‌ల‌బ‌డుతోంది? ఇక్క‌డి యువ‌త మోడీలాంటి ప్ర‌ధాన మంత్రి కావాల‌ని ఎందుకు కోరుకుంటున్నారు? అని చూస్తే ఓలీ నుంచి వ‌చ్చిన డైరెక్ట్ కామెంట్.. నేను మీ భార‌త దేశ ఆరాధ్య దైవం, అయోధ్య‌లో జ‌న్మించిన శ్రీరామ‌చంద్రుడి ఉనికి ప్ర‌శ్నార్ధ‌కం చేసేలా కామెంట్లు చేశాను. అదే నా  కొంప ముంచింద‌ని అన్నారు ఓలి. నిజానికి ఓలీ ఇప్ప‌టి వ‌ర‌కూ రెండు మార్లు జాన‌కీ మాత మాత్ర‌మే కాదు రాముడు సైతం మా దేశంలోనే పుట్టాడ‌ని అన్నారు. దీంతో అక్క‌డి పురావ‌స్తు శాఖ ఇది  నిరూపించ‌డానికి నానా అగ‌చాట్లు ప‌డాల్సి వ‌చ్చింది. మాములుగా అయితే అది జాన‌కీ మాత జ‌న్మించిన నేల‌. త‌న భ‌ర్త అంటే ఆమెకు అంత ప్రేమ‌. అలాంటి త‌న ప‌తిదేవుడి ఉనికి ప్ర‌శ్నార్ధ‌కం చేస్తే ఊరుకుంటుందా? ఆగ్ర‌హిస్తుంది. స‌త్యం బ‌య‌ట‌కు రావ‌డానికి తానెలా అగ్ని పునీత అయ్యిందో.. స‌రిగ్గా అలాగే తాను జ‌న్మించిన దేశాన్ని కూడా అగ్ని పునీతం చేసింది. అప్పుడుగానీ ఓలీ తాను ఆనాడు అన్న మాట‌లు నిజం కావ‌ని ఓప్పుకోలేదు. రాముడికి నిజంగానే అంత ప‌వ‌రుందా? ఆయ‌న్ను అన్న వారు ఇలా నామ‌రూపాల్లేకుండా నాశ‌న‌మై పోతారా? అంటే ప్ర‌స్తుతానికైతే అదే నిజ‌మ‌ని నిరూపిత‌మ‌వుతోంది. రామ జ‌న్మ భూమి అయోధ్య‌లో బాబ్రీ మ‌సీదు క‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు 5 ల‌క్ష‌ల మంది వ‌ర‌కూ మ‌ర‌ణించి ఉండ‌వ‌చ్చ‌ని ఒక అంచ‌నా.  మొత్తానికి రామ‌జ‌న్మ‌భూమి అన్యాక్రాంత‌మైన 500 ఏళ్ల‌కు ఇప్పుడు ఇక్క‌డ బాల‌రామ ఆల‌యం వెల‌సింది. ఎవ‌రైతే రామ‌జ‌న్మ భూమి అనే ఒకానొక ఉద్య‌మం మొద‌లు పెట్టారో.. వారు ప్ర‌స్తుతం దేశాన్ని అప్ర‌తిహ‌తంగా ఏలుతున్నారు.  అంటే రాముడు లేడ‌ని అన్న వారు ఎలా నాశ‌న‌మై పోతారో.. స‌రిగ్గా రాముడున్నాడు, ఆయ‌న పుట్టుక నిజం.. ఆయ‌న ప‌య‌నం నిజం.. అంత‌క‌న్నా మించి ఆయ‌న అయోధ్య‌లో జ‌న్మించింది నిజం.. అన్న వారిని అంద‌లం ఎక్కిస్తారు. అదే ఆయ‌న ఉనికినే ప్ర‌శ్నార్ధ‌కం చేసిన వారి అంతు చూస్తాడా శ్రీరామ‌చంద్రుడు. ఈ విష‌యం మ‌రోమారు నేపాల్ ఉదంతంతో రుజువైందని అంటున్నారు చాలా మంది.  ఈ మాట  స్వ‌యంగా కేపీశ‌ర్మ ఓలీ అన‌డంతో మ‌ళ్లీ రాముడు కేవ‌లం పౌరాణిక పాత్ర కాదు. అదొక చారిత్ర‌క పాత్ర‌. ఆయ‌న చ‌రిత్ర నిజం. ఆయ‌న అయోధ్య కేంద్రంగా  పాలించింది నిజం. ఆయ‌న పితృవాక్ పాల‌న నిజం ఆయ‌న ఏక‌ప‌త్నీ వ్ర‌తం నిజం ఆయ‌న మాట‌కోసం నిల‌బ‌డ్డం నిజం. మొత్తంగా శ్రీరాముడు ఒక ధ‌ర్మానికి ప్రతీక అన్న మాట నిజం అని మ‌రోమారు రుజువైంద‌ని అంటున్నారు శ్రీరామ భ‌క్తులు.

నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతకం

  నెల్లూరులో దారుణ ఘటన  చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ  దారుణ హత్యకు గురైంది.  ఇటీవల బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తిచేసింది మైధిలిప్రియ. ఆమెతో మాట్లాడాలని రూమ్‌కి పిలిచి, కత్తితో పొడిచి చంపేశాడు స్నేహితుడు నిఖిల్ అయితే, మైధిలిప్రియ ప్రేమకు నిరాకరించినందుకే నిందితుడు హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.  బెంగళూరులో జాబ్ చేస్తున్న మృతురాలు మైధిలి ప్రియ.. సెప్టెంబర్ 6 పుట్టినరోజు కావడంతో.. మూడో తేదీ నెల్లూరుకు వచ్చింది మృతురాలు. మాట్లాడాలి రూమ్‌కి రమ్మంటు మైదిలికి ఫోన్ చేసిన నిఖిల్.. రూమ్ కి వెళ్లిన తర్వాత మైధిలిని ప్రేమోన్మాది కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది.   మృతి చెందిన తరువాత.. మృతురాలి చెల్లి సాహితికి నిందితుడు ఫోన్ చేశాడు. సాహితీ స్పాట్ కి వెళ్ళగానే మెట్లపైనే మైథిలి ప్రియా మృతదేహం  ఉంది.గొడవ జరిగింది, చంపేశానని సాహితికి నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. యువతిని హత్యచేసిన అనంతరం పోలీసు స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయాడు. నిందితుడు రాపూరు మండలం చుట్టుపాలెం, స్వాతి బి ఫార్మసీ కాలేజీలో ఇద్దరు క్లాస్మేట్స్.  మరోవైపు మైధిలిప్రియ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కి తరలించారు పోలీసులు. మైధిలిప్రియ మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమ పేరుతో వేధించి.. తన కుమార్తెను హత్య చేశాడని బోరును మృతురాలి తల్లి లక్ష్మి విలపిస్తున్నది. నిందితుడు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని‌ కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  

శ్రీశైలం జలాశయానికి వరద... 3 గేట్లు ఎత్తివేత

  ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఈ ఉదయం శ్రీశైలం డ్యామ్‌ నుంచి 3 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,20,279 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి 1,79,,104 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.  3 స్పిల్‌వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 82,824 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.51 టీఎంసీలుగా కొనసాగుతోంది.

కూకట్‌పల్లి రేణు హత్య కేసులో నిందితుల అరెస్ట్

  కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రేణు అగర్వాల్ మహిళ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులు రోషన్, హర్షను జార్ఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలు, టెక్నికల్ సాక్ష్యాలు ఆధారంగా ప్రత్యేక బృందం నిందితులను ఆచూకి తెలుసుకోని వారిని పట్టుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను హైదారాబాద్‌కు తరలిస్తున్నారు. హత్య అనంతరం క్యాబ్‌లో విశాఖపట్టణం మీదుగా రాంచీ పారిపోయిన నిందితులు పారిపోయినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో చూసి నిందితులను గుర్తించి, పోలీసులకు క్యాబ్ డ్రైవర్  సమాచారమిచ్చారు. రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్  దంపతులకు హైదరాబాద్ ఫతేనగర్‌లో స్టీల్ సామాన్ల దుకాణం ఉంది. వారి కూతురు తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటుండగా.. కొడుకు శుభంతో కూకట్ పల్లిలోనే ఇంట్లో ఉంటున్నారు. స్వాన్ లేక్ లోనే రేణు బంధువుల ఇంటిలో రోషన్ 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అతనే జార్ఖండ్ లో తమ గ్రామానికి చెందిన హర్షను కొద్దిరోజుల క్రితం రేణు ఇంటిలో వంటమనిషిగా పెట్టించాడు. రాకేష్, శుభం తమ షాపుకు వెళ్లగా.. రేణు అగర్వాల్ ఇంట్లో ఒంటరిగా ఉంది.  ఆ రోజు సాయంత్రం 5 గంటలకు రాకేష్ ఫోన్ చేసినా తీయకపోవడంతో 7 గంటల సమయంలో ఇంటికి వెళ్లాడు. తలుపు ఎంతసేపటికీ తీయకపోవడంతో ప్లంబర్ ను పిలిపించి బ్యాక్ డోర్ ఓపెన్ చేయించారు. ఇంటి లోపలికి వెళ్లి చూడగా.. రేణు కాళ్లు, చేతులు కట్టేసి.. రక్తపు మడుగులో పడి ఉంది. శరీరంపై తీవ్రగాయాలుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ సహాయంతో రేణును హర్ష, రోషన్ లు చంపినట్లు నిర్థారించారు. ఆమెను తాళ్లతో కట్టేసి డబ్బు, నగల కోసం చిత్రహింసలు చేసినట్లుగా గుర్తించారు. ఆపై కూరగాయల కత్తులతో గొంతుగోసి, కుక్కర్ తో తలపై బలంగా కొట్టడంతో రేణు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు.

తిరుపతిలో రౌడీ షీటర్ హల్చల్

  తిరుపతిలో  ఓ రౌడీషీటర్ హల్చల్ సృష్టించారు. ఇరువురు మహిళలను కిడ్నాప్ చేసి మాట వినకపోతే చంపేస్తా.... అంటూ కత్తులతో  బెదిరించాడు దుండగుడు.  కిడ్నాప్ కు గురైన మహిళ తన భర్తకు లొకేషన్ షేర్ చేసింది. దీంతో  శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న సీఐ రామకిషోర్ బృందం రౌడీషీటర్ కోసం దర్యాప్తు చేపట్టారు.  పోలీసులు కిడ్నాపర్ ను పట్టుకునే ప్రయత్నంలో  రెండు కార్లను,ద్విచక్ర వాహనాలను ఢీ కొడుతూ భయబ్రాంతులకు గురి చేస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు.    ఎట్టకేలకు సినీ తరహాలో  వెంబడించి సీఐ బృందం పట్టుకున్నరు. తల్లి కూతుర్లను క్షేమంగా పోలీసులు ఇంటికి చేర్చారు.  నిందితుడు రౌడీషీటర్ ను అదుపులోకి....తీసుకొని ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లు అదుపులోకి తీసుకున్నారు. రౌడీ షీటర్ అజీమ్‌గా పోలీసులు గుర్తించారు. ఇతనిపై గతంలో కూడా పలు కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

  తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూలైన్లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. అలాగే టోకెన్లు ఉన్న భక్తులకు 4 గంటల్లో శ్రీవారి దర్శనం కలుగుతుందని తెలిపింది.  రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని పేర్కొంది. ఇక నిన్న శుక్రవారం 69,842 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 28,234 మంది భక్తులు స్వామివారికి తలనీలాల సమర్పించారు. శుక్రవారం స్వామివారి హుండీ ఆదాయం రూ.4.18 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

  అది సాయంత్రం సమయం.. కాలనీలో అందరూ అరగుల మీద కూర్చొని ముచ్చట పెడుతున్నారు.. ఇదే సమయంలో ఒక వ్యక్తి నడుచు కుంటూ వెళ్తున్నాడు.. అతని వెంబడిస్తూ ఒక స్కూటీ వెళ్తుంది.. ఒక్కసారిగా స్కూటీ ఆగిపోయింది. ఒకరు పొడవాటి కత్తి తీసుకొని కిందికి దిగాడు.. నడుస్తున్న వ్యక్తి పైన ఒక్కసారిగా దాడి చేశాడు.. సదరు వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి కింద పడి పోయాడు.. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో చంపేశారు. ఈ సంఘటన కుషాయిగూడలో తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది.  అయితే బైక్ పై ఉన్న మరో వ్యక్తి శ్రీకాంత్ ని చంపు తుంటే అడ్డగించే ప్రయత్నం చేశాడు. అయినప్పుటికీ  దుండగుడు వినిపించుకోకుండా కింద పడిపోయిన శ్రీకాంత్ ని విచక్షణ రహితంగా పొడిచి పొడిచి చంపేశాడు. అక్కడున్న స్థానికు లంతా వినోదం చూస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోవడమే కాకుండా తమ తమ ఫోన్లలో ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఇంతలో  బైక్ పై  ఉన్న వ్యక్తి దుండగుడిన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు.  అయితే ఆ దుండ గుడు కసితీరా శ్రీకాంత్ ని చంపిన తర్వాత నేరుగా బైక్ తీసుకొని వెళ్ళి పోయి ప్రయత్నం చేశాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అతని వెంబడించి పట్టుకుని రోడ్డు మీద కూర్చోబె ట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి శ్రీకాంత్ ని చంపిన వ్యక్తిని అప్పగించారు.. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్‌ను ఎందుకు చంపారు అనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతం పోలీసులు దుండగున్నీ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.  

తెలంగాణ రవాణా శాఖకు కాసుల వర్షం

  తెలంగాణ రవాణా శాఖకు కాసుల పంట పండింది.. ఫాన్సీ నెంబర్ల వేలంపాట ద్వారా ప్రభుత్వానికి రోజు రోజుకుపెద్ద ఎత్తున ఆదాయం వస్తూ ఉంది. ఈ ఫ్యాన్సీ నెంబర్ల కోసం చాలామంది పోటీ పడుతూ ఉంటారు...ఒకటి నుంచి తొమ్మిది లోపు గల సింగిల్ డిజిట్ నెంబర్లను కైవసం చేసుకోవ డానికి వ్యాపార వేత్తలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఒకటి, తొమ్మిది నెంబర్ల కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది.. ఈ నెంబర్ల కోసం వ్యాపారవేత్తలు లక్షల రూపాయ లను సైతం చెల్లించేందుకు సిద్ధపడుతూ ఉంటారు.   అయితే ఫ్యాన్సీ నెంబర్ల అమ్మకం ద్వారా ఏకంగా ఒక్కరోజు లోనే రూ. 63 లక్షల రూపాయల ఆదా యం తెలంగాణ రవాణా శాఖకు వచ్చి పడింది.. 9999 ఈ ఒక్క  నెంబర్ అమ్మగా ఏకంగా రూ. 25 లక్షల రూపాయల ఆదాయం రవాణా శాఖకు వచ్చింది. టీజీ 09 జీ 9999 నెంబర్ను హెటిరో డ్రగ్స్ కొనుగోలు చేసింది.. ఈ నెంబర్ కోసం చాలామంది పోటీ పడ్డారు..  ఆల్ నైన్ నెంబర్ కోసం పెద్ద ఎత్తున వేలం పాట నిర్వహిం చారు.ఈ నెంబర్కు హెట్రో  డ్రగ్స్ రూ.  25 లక్షల రూపాయలు చెల్లించి నెంబర్ను దక్కించుకుంది..అదే మాదిరిగా 0009 నెంబర్ కోసం కూడా పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.  

వైసీపీకి భయమా...బెదురా? షర్మిల సంచలన ట్వీట్

  నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు. పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే..? ఇది భయమా ? బెదురా ? వాళ్ళకే తెలియాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు రాజారెడ్డి అని నా కొడుకుకి స్వయంగా వైఎస్‌ఆర్ నామకరణం చేశారు.  నాకొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడు.  సీఎం చంద్రబాబు చెప్తే నా కొడుకు వస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  నా కొడుకుని చంద్రబాబు చెప్పాడని  తీసుకువస్తే..మరి ఎవరు చెప్పారని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్‌ఎస్ఎస్ వాదికి మద్దతు ఇచ్చారు? వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా బీజేపీ అభ్యర్థికి జగన్  మద్దతు ఇవ్వడం అవమానకరమని షర్మిల ట్వీట్ చేశారు. అదానీ, రిలయన్స్ వ్యవహారాలను ప్రస్తావిస్తూ షర్మిల విమర్శలు గుప్పించారు. “వైఎస్సార్ మరణం వెనుక రిలయన్స్ కుట్ర ఉందని జగన్ చెప్పాడు. కానీ అదే రిలయన్స్ వారికి రాజ్యసభ సీటు ఇచ్చాడు. అదానీ కోసం గంగవరం పోర్ట్‌ను త్యాగం చేశాడు.  ఐదు ఏళ్ల అధికారంలో బీజేపీ ప్రతీ బిల్లుకు జగన్ మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు ఏ ముఖంతో ఈ మద్దతు ఇస్తున్నారో జగన్ సమాధానం చెప్పాలి,” అని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నిశ్శబ్దంగా ఉండగా, వైసీపీ మాత్రం బీజేపీకి ఓటు వేసిందని ఆమె మండిపడ్డారు. టీడీపీ-జనసేన పొత్తు బహిరంగమని, కానీ జగన్ బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్నాడని షర్మిల ఆరోపించారు.

చేవెళ్లలో దారి దోపిడీ కలకలం

  దారి దోపిడీ చేయడానికి పక్కగా ప్లాన్ చేశారు... అనుకున్న పథకం ప్రకారమే కారును అడ్డగించి... నానా హల్చల్ సృష్టించి చివరకు ఓ వ్యక్తి వద్ద నుండి లక్షల రూపాయల బ్యాగును దోచుకున్నారు. ఇక తమను పోలీసులు ఎవరూ పట్టుకోలేరని.... ఈ డబ్బుతో ఎంజాయ్ చేయవచ్చునని సంతోష పడుతూ వెళ్తున్న సమయం లో విధి వక్రీంచింది. కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో దుండగులు తాము ఎక్కడ పోలీసుల చేతికి చిక్కుతా మేమో నని భయపడి కారుతో పాటు కొంత డబ్బు అక్కడే వదిలేసి పారిపో యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.  రంగారెడ్డి జిల్లాలో ని చేవెళ్లే మండలం లోని కొత్తపల్లి గ్రామ సమీపంలో ఒక స్టీల్ వ్యాపారి తన కారు లో వెళుతున్న సమయంలో గుర్తు తెలియని కొందరు దుండగులు స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చి వెనుక నుండి ఢీ కొట్టడమే కాకుండా ముందుకు వచ్చి వ్యాపారి కారును అడ్డగించి... కారు అద్దాలు పగల గొట్టి... హంగామా సృష్టించారు. అనంతరం కారులో ఉన్న వ్యాపారి, డ్రైవర్ కళ్ళల్లో కారంపొడి కొట్టి.... వెంటనే వ్యాపారి వద్దనున్న 40 లక్షల రూపాయల బ్యాగును తీసుకొని అక్కడి నుండి పారిపో యారు.  దొంగిలించిన డబ్బుతో ఎంజాయ్ చేయ వచ్చునంటూ తెగ సంబరపడి పోతూ.. కార్‌లో అత్యంత వేగంగా  వెళుతుండగా కారు ఒక్కసారి గా అదు పుతప్పి బోర్ల పడింది. దుండ గులు కారులో చిక్కుకుపోయారు. ఎలాగైనా సరే కష్టపడి కార్‌లో నుండి దుండగులు బయటికి వచ్చారు. పోలీసుల చేతికి చిక్కుతా మేమో నన్న భయంతో కారుతో పాటు కారులో కొంత డబ్బు వదిలివేసి అక్కడి నుండి మెల్లిగా జారుకున్నారు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారణం పూర్తిగా పరిశీలించగా కారులో బొమ్మ తుపాకి తో పాటు కత్తి, కారంపొడి ఉన్నట్లు గా పోలీసులు గుర్తించారు. దుండగులు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత కారు తో పాటు కారులో 15 లక్షల రూపాయలు కూడా వదిలివేసి వెళ్లినట్లుగా పోలీ సులు గుర్తించారు. దీంతో పోలీసులు కారుతో పాటు 15 లక్షల రూపాయల ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దుండ గులను పట్టుకు నేందుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటన కు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  

హైదరాబాద్ తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తాం : సీఎం చంద్రబాబు

  ఏపీ అభివృద్ధి కోసం విజన్ కల్పన చేయటంతో పాటు దాన్ని సుసాధ్యం చేసే దిశగా పనిచేయాల్సి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్ తరాల కోసమే విజన్‌ను రూపొందించి అమలు చేస్తున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది తన బాధ్యత అని స్పష్టం చేశారు.  జాతీయ స్థాయిలో వికసిత్ భారత్-2047 అమలు చేస్తుంటే రాష్ట్రంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ సిద్దం చేసి అమలు చేస్తున్నామని వెల్లడించారు. శరీరానికి పోషకాలు ఎంత అవసరమో సమాజానికి మంచి పాలసీల అవసరం అంతే ఉందని సీఎం అన్నారు.  వచ్చే 22 ఏళ్లలో మన రాష్ట్రం ఎక్కడ ఉండాలన్న అంశాన్ని నిర్దేశించేందుకే విజన్ రూపొందించి అమలు చేస్తున్నట్టు వివరించారు. అమరావతిలో శుక్రవారం ఓ మీడియా సంస్ధ కాంక్లేవ్‌కు హాజరైన ముఖ్యమంత్రి వేర్వేరు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తీకరించారు. వచ్చే దశాబ్ద కాలంలో ఏపీ ఎలా ఉండబోతోందన్న అంశాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..."రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్లను భాగస్వాములను చేస్తూ ఈ తరహా కాంక్లేవ్ నిర్వహించడం మంచి పరిణామన్నారు. 25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి అన్‌స్టాపబుల్‌గా మారిందని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం చేస్తున్నాం... అభివృద్ధికి అదే తరహాలో నిధులిస్తున్నాం. రాజకీయాలు అవసరమే కానీ...సమాజం గురించే ఆలోచించాలి. రాజకీయాలే ఆలోచించి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదు.. విద్యుత్ సంస్కరణలు వచ్చేవి కావు. సీఎంగా భావితరాల కోసం ఆలోచన చేయాలి. 1994లో చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. ఇప్పుడు సంపద సృష్టిస్తున్నాం..పేదలకు అందిస్తున్నాం. ప్రజలందరికీ ప్రయోజనం కలిగేలా మంచి పబ్లిక్ పాలసీలు తీసుకువచ్చాం" అని ముఖ్యమంత్రి అన్నారు.   మూడేళ్లలో అమరావతి ఇన్‌ఫ్రా పనులు-2027 డిసెంబర్‌కు పోలవరం పూర్తి ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశ అభివృద్ధి అన్ స్టాపబుల్ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో సంక్షోభాలు వస్తున్నాయని.. నేపాల్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్ ఇలా చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. సుస్థిరతకు, నాయకత్వానికి మారుపేరు భారతదేశమేనని అన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా సంస్కరణలు ప్రారంభించి అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించామని అన్నారు. దీనిపై మాట్లాడుతూ.. "విశాఖ, అమరావతి, విజయవాడ, తిరుపతి వంటి నగరాల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాం. సేవల రంగం ద్వారా ఎక్కువ గ్రోత్ సాధించేలా చర్యలు చేపడుతున్నాం. అమరావతిలో ప్రారంభించిన ప్రతి పని రాబోయే మూడేళ్లల్లో పూర్తి అవుతుంది. రూ.50 వేల కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు పూర్తి అవుతాయి.  ప్రధాని చేతుల మీదుగా ఇవి ప్రారంభం అవుతాయి. 2019లో గెలిచి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తి అయ్యేది. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల  డయాఫ్రం వాల్ దెబ్బతింది. అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టి పెట్టాం.  2027 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేస్తాం. కియా ఫ్యాక్టరీ కోసం గొల్లపల్లి రిజర్వాయరును ఒక్క ఏడాదిలో పూర్తి చేసి నీరిచ్చాం. హంద్రీ-నీవా ప్రాజెక్టు కాల్వల విస్తరణ పనులు కేవలం 100 రోజుల్లో పూర్తి చేసి నీరు ఇచ్చాం." అని సీఎం అన్నారు.  అమరావతి అభివృద్ధి అక్కడితో ఆగదు "అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే. హైటెక్ సిటి రాక ముందు హైదరాబాద్ లో ఎకరం రూ. 1 లక్ష ఉండేది...ఇప్పుడు రూ.100 కోట్లకు చేరింది. పరిశ్రమలు, రహదారుల లాంటి అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుంది. అమరావతి రైతుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు. అమరావతి అభివృద్ధి నిరంతరం. అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే... అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా గుంటూరు-విజయవాడ-తెనాలి తదితర ప్రాంతాలు కలిసి మహానగరంగా రూపొందుతుంది.   భూములిచ్చిన వారిని ఆదుకుంటాం. విస్తరణ విషయంలోనూ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుంది. భవిష్యత్ అవసరాల మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తాం. అమరావతిలో 2026 జనవరికి క్వాంటం వ్యాలీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్‌కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి. మరికొన్ని రాబోతున్నాయి." అని ముఖ్యమంత్రి తెలిపారు. 

వైసీపీ సీనియర్ నేత మృతి

  వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి శుక్రవారం కన్నుమూశారు. ఇవాళ మధ్యాహ్నం పొలంలో పనులు చేయిస్తూ ఆయన ఆకస్మికంగా కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన  గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మృతిపై  వైసీపీ అధ్యక్షుడు జగన్ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తమ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియర్‌ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి ఆకస్మిక మరణం దిగ్శ్రాంతికి గురి చేసిందని, క్రమ శిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని కొనియాడారు.‘ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశాస్తూ.  ఈ మేరకు ట్వీట్‌ చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి బంధువు. 

ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా? :కేటీఆర్

  తాము కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదని బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఉద్దేశించి కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.  కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినప్పటి ఫొటోలను షేర్ చేసి ప్రశ్నించారు. ప్రియమైన రాహుల్‌గాంధీ, ఫొటోల్లోని కాంగ్రెస్ కండువాలను గుర్తు పట్టగలరా? ఢిల్లీలో మీతో కలిసిన ఈ ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మీరు గుర్తించగలరా? ఇప్పుడు కారు గుర్తుపై  గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఈ ఎమ్మెల్యేలు అందరూ తాము పార్టీ మారలేదని, ఇది కాంగ్రెస్ కండువా కాదని చెబుతున్నారు.  ఇది మీరు అంగీకరిస్తున్నారా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేంటి..? అంటూ కేటీఆర్ రాహుల్ గాంధీని నిలదీశారు. కాగా, ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు కంటే.. ఎమ్మెల్యేల చోరీ కూడా చిన్న నేరం కాదని ట్విట్టర్‌లో రాహుల్‌కు కేటీఆర్ ట్యాగ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కండువా పార్టీ కప్పుతున్నప్పుడు.. తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో కండువా కప్పుతున్నారని పేర్కొన్నారు. మేము పార్టీ మారలేదని. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని ఎమ్మెల్యేలు తెలిపారు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని పేర్కొన్నారు.  3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో వీరి నుంచి వివరణ కోరుతూ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలివ్వగా.. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానాలివ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను కోరినట్లు సమాచారం  

తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు

  తెలంగాణలో  రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని వాతావరణ శాఖ పేర్కొన్నాది.  ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందనిపేర్కొంది.  

ఎకరం @రూ.800 కోట్లు

ఎకరం మహా రూ. కోట్లు పలికితే ఆశ్చర్యం లేదు. హైదరాబాద్ కోకాపేటలో గతంలో ప్రభుత్వ భూముల వేలం సందర్బంగా ఎకరం వంద కోట్ల రూపాయలు పలికితే  అందరూ గుడ్లు తేలేశారు. భూముల ధరలకు రెక్కలు అంటూ నెలల తరబడి మాట్లాడుకున్నారు. అది అంతా గతం ఇప్పుడు ఏకంగా ఎకరం 800 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది ఎక్కడో తెలుసా?  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో. ఔను ముంబైలోని ఒక ప్రాంతంలో ఎకరం దాదాపు 800 కోట్ల రూపాయల చొప్పున 4,16 ఎకరాల భూమిని అక్షరాలా 3 వేల 472 కోట్ల రూపాయలకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నామిమన్ పాయింట్ లో ఈ భూమిని రిజర్వ్ మ బ్యాంక్ ఆఫ్ ఇ     ండియా కొనుగోలు చేసింది.  ఈ లాండ్ పర్చేజ్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ముంబైలో జరిగిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీడ్ అని చెప్పవచ్చు. ఇంతకీ నారీమన్ పాయింట్ లో ఈ భూమిని ఆర్బీఐ తన కొత్త కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మించేందుకు కోనుగోలు చేసింది. ముంబైలో నారిమన్ పాయింట్ ప్రైమ్ బిజినెస్ ఏరియా. 1970ల నుంచీ ఈ ప్రాంతం బిజినెస్ హబ్ గా కొనసాగుతోంది.  

ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాలకు తోడు తీరప్రాంతాలలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.   పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, తిరుపతి జిల్లాలలో శుక్ర, శని (సెప్టెంబర్ 12, 13)వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల  ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో   అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రజలకు సూచించింది. 

ఆయేషామీరా హత్య కేసులో ట్విస్ట్

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తును పూర్తి చేసిన సీబీఐ ఆయేషామీరా  తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంది. నిర్దోషిగా విడుదలైన సత్యంబాబుపై 376, 302 సెక్షన్లు నమోదు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని పేర్కొంది.  17 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని , ఇంకా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారని, బాధితులైన తాము ఎన్నిసార్లు కోర్టుకు తిరగాలని తల్లి శంషాద్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఓ హాస్టల్‌లో 17 ఏళ్ల అయేషా మీరా అనే ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన 2007 డిసెంబర్27వ తేదీన జరిగింది. తాను ఉంటున్న హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో కత్తిపోట్లతో ఆయేషా మీరా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన సంచలనంగా మారింది. కాగా ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో సంక్షోభాలు.. అసలేం జరుగుతోంది?

ఇటీవలి  కాలంలో  భారత్ తో స్నేహ సంబంధాలకు దూరమైన ఒక్కో దేశం సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకుంటోంది.   భారత్ తో విభేదించిన దేశాలన్నీ ఇలా సంక్షోభాలలో కూరుకుపోతుండటం కాకతాళీ యమనే చెప్పాలి.  బంగ్లాదేశ్,పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, మాల్దీవులు ఇలా ఈ దేశాలన్నీ వరుసగా, ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా ఆర్ధిక,రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. భారత్ ను వ్యక్తిగతంగా ఆయా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. దౌత్యపరంగా ఆయాదేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పాలన్న భారత్ ప్రయత్నాలు ఏమంత ఫలించడం లేదు.  మాల్దీవుల విషయానికి వస్తే.. ఆ దేశాధ్యక్షుడు   ముయిజ్జూ  ఇండియా ఔట్ నినాదంతో గెలిచారు. అనంతరం చైనాతో చేతులు కలిపారు. పర్యాటక రంగంపై ఆధారపడిన ఆ దేశపు ఆర్ధిక వ్యవస్థ 2024లో తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. దాంతో కళ్లు తెరిచిన ముయిజ్జూ భారత్ తో  సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు అర్రులు చాస్తున్నారు. అయినా ఆ దేశంలో ఇప్పటికీ రాజకీయ  అస్థిరత రాజ్యమేలుతోంది. గతంలో అంటే భారత్ కు మిత్రదేశంగా ఉన్నంత కాలం మాల్దీవుల్లో సుస్థిరత చెక్కు చెదరలేదు.   ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే.. ఆ దేశంలో  హసీనా ప్రభుత్వం పతనం అనంతరం రాజకీయ అస్ధిరత మొదలైంది.హిందువులపై దాడులు వారి ఆస్తుల ధ్వంసం జరిగాయి. ఆదేశంలో ఇప్పుడున్న స్రభుత్వం ఆర్మీ చేతిలో కీలుబొమ్మ.  పాకిస్థాన్, చైనాతో సన్నిహిత సంబంధాలు కోసం వెంపర్లాడుతోంది. బంగ్లాదేశ్ ఆవిర్భావమే భారత్ జోక్యంతో ఏర్పడింది. ఆ విషయాన్ని మరచి భారత్ ను శత్రుదేశంగా చూడటం ప్రారంభించడంతోనే ఆ దేశం సంక్షోభ, కల్లోలాల నిలయంగా మారిపోయింది.  భారత అనుకూల విధానాలను అవలంబిచిన హసీనా అధికారంలో ఉన్నంత కాలం ఆ దేశం సుస్థిరంగా ఉంది. ప్రజాస్వామ్యదేశంగా సగర్వంగా నిలబడింది. ఆ తరువాతనే దేశంలో రాజకీయ అస్థిరత, అంతర్గత సంక్షోభం తలెత్తి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక శ్రీలంక విషయానికి వస్తే..  ఆ దేశం కూడా అకారణంగా భారత్ పట్ల శత్రుత్వ వైఖరిని అవలంబించి చైనాకు దగ్గర కావడం కోసం ప్రయత్నాలు చేసి సంక్షోభంలో కూరుకుపోయింది. పాకిస్థాన్ విషయం చెప్పనే అక్కర్లేదు. దాయాది దేశానికి బారత్ తో ఎన్నడూ సయోధ్య, సత్సంబంధాలూ లేవు. ఆ దేశం ఆవిర్భావం నుంచీ సంక్షోభాలతో సహవాసం చేస్తున్నదని చెప్పడం అతి శయోక్తి కాదు.  అలాగే మయన్మార్.. 2021లో సైనిక తిరుగుబాటు తరువాత ఆ దేశం సంక్షోభాల వలయంలో కూరుకుపోయి ఉంది.  తాజాగా భారత్ పై సుంకాల యుద్ధం ప్రారంభించిన అమెరికా కూడా పెను ఆర్థిక మాంద్యం ముప్పు ముంగిట నిలిచింది. భారత్ పై ఆంక్షలు విధించాలన్న ట్రంప్ ఆదేశాలను యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఇది అమెరికాకు నిజంగా తట్టుకోలేని దెబ్బ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా రష్యా, చైనాలు భారత్ కు స్నేహహస్తం చాచడంతో అమెరికా పెద్దన్న పాత్రకే ఎసరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పుట్టిమునగక ముందే భారత్ తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ట్రంప్ తహతహలాడుతున్నారు. ఇరుదేశాల మధ్యా వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ప్రధాని మోడీతో చర్చలకు ట్రంప్ వెంపర్లాడుతున్నారు. ఇక అలాగే సంక్షోభాలలో కూరుకుపోయిన ఇరుగుపొరుగుదేశాలు కూడా తమ భారత్ తో వైరానికి ఫుల్ స్టాప్ పెట్టి స్నేహ మార్గంలో పయనిస్తే..  ఆర్థిక, రాజకీయ ఆస్థిరత నుంచి సుస్ధిరత దిశగా వాటి అడుగులు పడే అవకాశం ఉంటుంది. 

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందో... లేదో : మంత్రి జూపల్లి

  మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తాను చెప్పలేనని మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అందుకే తాను ప్రజలకు హామీలు ఇవ్వనని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో జూపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే, మంత్రి  చేసిన ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని చూడాలి మరి. అధికార పార్టీలో మంత్రి మాటల విన్న అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మంత్రి జూపల్లి రెండు రోజులపాటు నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పర్యటించారు. నిర్మల్‌ జిల్లా ఆర్జీయూకేటీలో, గురువారం ఆదిలాబాద్‌ జిల్లాలోని గురుకుల పాఠశాల కళాశాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. విద్యతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని.. ఆటలు బాగా ఆడాలని ప్రోత్సహించారు.  శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాలోని ‘‘ఒకటే జననం.. ఒకటే మరణం.. ఒకటే గమనం.. ఒకటే గమ్యం.. గెలుపు పొందే వరకు అలుపులేదు మనకు’’ పాటను తన సెల్‌ఫోన్‌ నుంచి ప్రత్యక్షంగా మంత్రి విద్యార్ధులకు  వినిపించారు.  ఆత్మహత్య చేసుకునేకంటే.. ఎదురుతిరిగి జీవితంలో గెలవాలని ప్రేరణ నింపారు. విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది.