తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరులు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు. మంగళవారం (సెప్టెంబర్ 16) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండి ఉన్నాయి. భక్తుల క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  24 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం(సెప్టెంబర్ 16) శ్రీవారిని మొత్తం 63 వేల 607 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 856 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 87 లక్షల  రూపాయలు వచ్చింది.

హైదరాబాద్‌లో మహిళల మృతదేహాలు కలకలం

  హైదరాబాద్ నగరంలో రెండు వేరువేరు ప్రాంతాల్లో మహిళ మృతదే హాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి... ఓ మహిళ మృతదేహాన్ని బ్రిడ్జి కింద పడేయగా మరో మహిళ మృతదేహాన్ని సంచిలో పెట్టుకొచ్చి రైల్వేస్టేషన్ వద్ద వదిలి వేసి వెళ్లారు. ఈ రెండు ఘటనలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.రాజేంద్రనగర్ కిస్మత్పూర్ లో ఓ మహిళ డెడ్ బాడీ తీవ్ర కలకలం రేపింది... డెడ్ బాడీని చూసిన స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.  హుటా హుటిన పోలీసులు క్లూస్టింగ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగులు యువతిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. కిస్మత్పూర్ బ్రిడ్జి కింద కి మహిళను తీసుకువెళ్లి హత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.. ఈ యువతి వయసు 20 నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసుల అంచనా... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు... ఈ నేపథ్యంలోని పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ.... దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు... మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కిస్మత్ పురా డెడ్ బాడీని చూసిన స్థానికులు సమాచారం అందించారని రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు.... వెంటనే ఘటనాస్థ లానికి చేరుకుని డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం తరలించాము. డెడ్ బాడీని మహిళా డెడ్ బాడీగా గుర్తించాం.. ఎక్కడో హత్య చేసి కిస్మత్ పురలో పడవేసినట్టుగా అనుమానిస్తున్నామని ఇన్స్పెక్టర్ అన్నారు. డెడ్ బాడీ కుళ్ళిన స్థితిలో ఉంది.. మర్డర్ జరిగి రెండు మూడు రోజులు అయి ఉండవచ్చునని ఇన్స్పెక్టర్ అన్నారు. మృతురాలి వయసు 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.  డెడ్ బాడీ దొరికిన ప్రాంతానికి సమీపంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటన్నిటినీ పరిశీలిస్తున్నాం. మహిళపై అత్యాచారం చేసి... అనంతరం హత్య చేసినట్టు అనుమా నిస్తున్నాం. అంతేకాకుండా మేము స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్లలో ఏవైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అని కూడా విచారిస్తాం. క్లూజ్ టీం ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్, అలానే  ఫింగర్ ప్రింట్స్ సేకరించారు.అసలు మృతురాలు ఎవరు.. ఆమెను ఎవరు హత్య చేశారు...? అనే కోణంలో దర్యాప్తు కొనసాగించామని ఇన్స్పెక్టర్ వెల్లడించారు... ఇదిలా ఉండగా మరోవైపు చరపల్లి పోలీస్టేషన్ పరిధిలో ని రైల్వే స్టేషన్ సమీపంలో గోనే సంచిలో మహిళా మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. చర్లపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. గుర్తుతెలియని కొందరు దుండగులు చర్లపల్లి రైల్వే స్టేషన్ గొడ వద్ద మహిళ మృతదేహం పడేసి వెళ్ళిపోయారు. సంచిలో మృతదేహం కనిపించడంతో భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ దుండగుల కోసం వేట కొనసాగించారు.  

డెలివరీ బాయ్స్ వీరంగం... కస్టమర్‌పై మూకుమ్మడిగా దాడి

  హైదరాబాద్ నగరంలో కొంత మంది యువకులు గంజాయి సేవించి... ఆ మత్తులో రోడ్ల మీద నానా హల్చల్ సృష్టిస్తున్న ఘట నలు ఎన్నో జరు గుతున్నాయి. ఇటువంటి ఘటనే మరొకటి చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మీరు ఏదైనా వస్తువు కోసం ఆర్డర్ చేస్తున్నారా తస్మా జాగ్రత్త.... ఇదేంటబ్బా అని ఆలోచిస్తున్నారా? పూర్తిగా వివరాలు చదవండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ బస్తీలో నివాసం ఉంటున్న సందీప్ అనే వ్యక్తి పెన్సిల్ కిట్ మరియు పెరుగు ప్యాకెట్ కోసం జిప్టోలో ఆర్డర్ చేశాడు... ఆన్లైన్ పేమెంట్ కూడా చేశాడు. అయితే సందీప్ ఆర్డర్ చేసిన వస్తువులు రాలేదు. దీంతో సందీప్ డెలివరీ బాయ్ కి ఫోన్ చేసి తన వస్తువులు ఇంకా ఎందుకు రాలేదని ప్రశ్నించాడు... అందుకు ఆ జిప్టో  బాయ్ విఎస్టి ఎస్పీ గార్డెన్స్ వద్ద ఉన్న జిప్టో హబ్‌కు వచ్చి మాట్లాడమని చెప్పాడు. దీంతో సందీప్ వెంటనే విఎస్టీ వద్ద ఉన్న జిప్టో హబ్ వద్దకు వెళ్లాడు.  సందీప్ అడిగిన ప్రశ్నకు జిప్టో సిబ్బందితో పాటు డెలివరీ బాయ్స్ సరైన సమాధానం ఇవ్వకపోగా ఒక్కసారిగా సందీప్ పై దాడికి పాల్ప డ్డారు.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడు , ఎనిమిది మంది గంజాయి మత్తులో రోడ్డుమీద వీరంగం సృష్టిస్తూ సందీప్ ను చితకబాదారు.. ఈ దాడిలో సందీప్ కు తీవ్ర గాయాల య్యాయి. అయితే ఈ దాడికి సంబం ధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకట్, రాజు తో పాటు ఇంకొందరు  తనపై దాడి చేశారని... సందీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.  

టీటీడీ ప్రతిష్టను భూమన కరుణాకర్ రెడ్డి దెబ్బతీస్తున్నారు : భానుప్రకాష్ రెడ్డి

  వైసీసీ మాజీ ఎమ్మెల్యేే భూమన కరుణాకర్ రెడ్డి  తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌ భూమన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అలిపిరి దగ్గర గతంలో ఒక ప్రైవేట్‌ శిల్పా క్వార్టర్స్ ఉండేది. పట్టు కన్నయ్య అనే శిల్పి నిర్వహించేవాడు. బెంగళూరుకి చెందిన ఓ భక్తుడు శనీశ్వరుడి విగ్రహం ఆర్డర్ ఇచ్చాడు. శిల్పం తయారీలో లోపం రావడంతో.. ఆ రాతి విగ్రహాన్ని అక్కడే ఉంచారు. గత పదేళ్లుగా ఆ విగ్రహం ఆ ప్రాంతంలోనే ఉంది. నేడు కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహమని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.  గతంలో తిరుమల ఆలయంలోని  రాములవారి ఉత్సవ విగ్రహానికి వేలు విరిగిపోయింది. మూడున్నర సంవత్సరాలు పట్టించుకున్న పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాములవారి విగ్రహానికి ఆగమశాస్త్రం ప్రకారం మరమ్మతు చేశాం’’ అని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అసత్య ప్రచారాలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని బోర్డు సభ్యుడు ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు హెచ్చరించారు.  భూమన మాటలను, ఆరోపణలను నమ్మవద్దని ఆయన భక్తులను విన్నవించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక...అసత్య ప్రచారాలతో హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే పనిగట్టుకున్నాడు  బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మీ అన్నారు. మహావిష్ణువు విగ్రహానికి‌.... అసంపూర్ణమైన శనిభగవానుడి విగ్రహానికి తేడా తెలీదని ఆమె ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసం, మీడియాలో కనిపించాలనే ఉద్దేశంతో....భూమన కరుణాకర్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని  మరో బోర్డు సభ్యుడు దివాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడం చాలా దారుణమని భూమన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తిరుమల అలిపిరి వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పష్టం చేసింది. అది అసలు విష్ణుమూర్తి విగ్రహమే కాదని, శిల్పి మధ్యలో వదిలేసిన అసంపూర్తి శనీశ్వరుడి విగ్రహమని తేల్చిచెప్పింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్యాలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి నియామకం

  తెలంగాణలో నాలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.  ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ప్రభుత్వ  పట్టణ రవాణా సలహాదారుగా రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌ను  అదనపు బాధ్యతలు అప్పగించింది. మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా శృతి ఓజా, ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, హెచ్‌ఎండీఏ కార్యదర్శిగా కోట శ్రీవాత్సవకు అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌ చీఫ్ రేషనింగ్‌ అధికారిగా ఎం.రాజారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా రాజేశ్వర్‌  నియమితులయ్యారు.  

రూ.11.50 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

  రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్‌లోని మాధ‌వా హిల్స్ ఫేజ్‌-2లో పార్కు స్థ‌లాన్ని హైడ్రా మంగ‌ళ‌వారం కాపాడింది. వెయ్యి గ‌జాల పార్కు స్థ‌లంలో స్థానికంగా ఉన్న వాళ్లు గోడ‌లు క‌ట్టి.. షెడ్డులు వేశారంటూ హైడ్రా ప్ర‌జావాణిలో మాధ‌వాహిల్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులో ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదుల‌ను స్థానిక అధికారుల‌తో క‌ల‌సి క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి... పార్కు స్థ‌లంగా నిర్ధారించుకున్న హైడ్రా.. వెంట‌నే ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. ఈ భూమి విలువ దాదాపు రూ.11.50 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా.  పార్కును కాపాడిన‌ట్టు పేర్కొంటూ హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది.

మంత్రి నారాయణ చొరవతో 18 మంది యువకులకు పునర్జీవం

    మంత్రి పొంగూరు నారాయణ చూపిన చొరవ 18 మంది యువకుల ప్రాణాలకు పునర్జీవం ప్రసాదించింది. మంత్రి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో సురక్షితంగా ఆపదలో ఉన్న వారిని అధికారులు బయటకి తీసేందుకు తెల్లవారుజాము వరకు కృషి చేసి ఫలితం రాబట్టారు. అసలేం జరిగిందంటే. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీకి చెందిన 18 మంది యువకులు సమీపంలోని పెన్నా నదిలోకి సోమవారం సాయంత్రం వెళ్లారు. వారు వెళ్లిన సందర్భం ఏదైనాప్పటికీ ఊహించని పరిణామానికి గురయ్యారు. సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో పెన్నా నది ఉద్ధృతి పెరిగింది. ఈ క్రమంలో రెండు వైపులా నీరు రావడంతో యువకులు పెన్నా నదిలో మధ్యలో చిక్కుకున్నారు. దిక్కుతోచని స్థితిలో సహాయం చేయమని బంధువులకు ఫోన్లు చేసి ఆర్తనాదాలు పెట్టారు.  అయితే ఈ విషయాన్ని యువకుల తల్లిదండ్రులు స్థానిక డివిజన్‌లో టీడీపీ ఇన్చార్జిలకు తెలియజేశారు. వెంటనే వారు పెన్నా నదిలో 18 మంది యువకులు చిక్కుకున్నారన్న విషయాన్ని నారాయణకు తెలియజేశారు. వెనువెంటనే అప్రమత్తమైన మంత్రి ఆ యువకులను రక్షించేలా సహాయ చర్యలు చేపట్టాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు. అలాగే అన్ని శాఖల అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు నిరంతరం టైం టు టైం అప్డేట్ కనుక్కుంటూ మంత్రి నారాయణ అధికారులకు పలు సూచనలు చేస్తూ వచ్చారు.  ఈ క్రమంలో నెల్లూరు ఆర్డీవో, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది స్పందించి రెస్క్యూ టీమ్ ద్వారా మంగళవారం తెల్లవారుజాము సమయానికి 18 మందిని సురక్షితంగా కాపాడగలిగారు. ఈ విషయాన్ని టిడిపి శ్రేణులు, ఆయా శాఖల అధికారులు మంత్రి నారాయణ కు తెలియజేశారు. అనుకోని పరిస్థితుల్లో పెన్నా నదిలో చిక్కుకున్న యువకులను చాకచక్యంగా కాపాడిన ఆయా శాఖల అధికారులను, ప్రమాదం అని తెలిస్తే వెంటనే స్పందించిన టీడీపీ శ్రేణులను మంత్రి నారాయణ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే తమ బిడ్డలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు నిరంతరం అధికారులను అప్రమత్తం చేస్తూ తమకు భరోసా ఇచ్చిన మంత్రి నారాయణ కు యువకుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతేనేం తన నియోజకవర్గ ప్రజల మన్నలలో పొందిన నారాయణ ప్రజా సంక్షేమమే ద్యేయంగా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రశంసలు పొందుతున్నారు.

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ వేడి... పార్టీల ఫోకస్

  రాష్ట్రంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక వేడి మొదలైంది. జూబ్లీ బైపోల్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బరిలో దిగనున్నారు. బీసీ నినాదానంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇక జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ పేరును పార్టీ దాదాపు ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.   నియోజకవర్గంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ పోస్టర్లు వెలిశాయి. ‘కావాలి అంజన్న.. రావాలి అంజన్న.. ఇది నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష’ అంటూ జూబ్లీహిల్స్‌లో అంజన్‌కుమార్ బ్యానర్లు అంచించారు. మరోవైపు.. తాను టికెట్ ఆశిస్తున్నట్టు ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు. అలాగే మినిస్టర్ పదవి కూడా కావాలని బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జూబ్లిహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌  మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉపఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపినాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆమె కుటుంబంతో సహా ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు.   జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కమలం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ.. ఈ సీటునూ సొంతం చేసుకుని బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం పక్కా వ్యూహంతో ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నా.. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో  అధిష్ఠానం నిమగ్నమైనట్టు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలోనే ఈ స్థానం ఉంది. దీంతో తమకే గెలిచే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది

రామ్ గోపాల్ వర్మపై మరో కేసు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తాజాగా మరో కేసు నమోదైంది. ఈ సారి ఈ కేసు మాజీ ఐపీఎస్ అధికారిని అంజనాసిన్హా ఫిర్యాదు మేరకు నమోదైంది అంజనా సిన్హా తన ఫిర్యాదులో దహనం అనే వెబ్‌సిరీస్‌లో తన అనుమతి లేకుండా తన ఫ్రొఫెషనల్‌ ఐడెంటిటీని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని   పేర్కొన్నారు.  దహనం వెబ్‌సిరిస్‌కు రామ్‌గోపాల్‌వర్మ  నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.  2022లో దహనం వెబ్ సీరిస్ వచ్చింది. మొదట ఎంఎక్స్ ప్లేయర్ ‌లో విడుదలైంది. అయితే తరువాత తొలగించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్, ఒక కమ్యూనిస్ట్ కార్మికుడి హత్య అనంతర ప్రతికార నేపథ్యంలో రూపొందింది.  1990 బ్యాచ్‌కు చెందిన అంజనా సిన్హా   రాయలసీమలో ఎస్పీగా, డీఐజీగా పనిచేశారు అంజనా సిన్హా వృత్తిపరమైన ఐడెంటిటీని దహనం వెబ్‌సిరీస్‌లో ఉపయోగించారన్నది ఆమె అభియోగం. అంజనా సిన్హాప్రస్తుతం నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడెమీ డైరక్టర్ గా ఉన్నారు. తన అనుమతి లేకుండా తన పేరు, ప్రొఫెషనల్ ఐడెంటిటీని దహనం వెబ్ సిరీస్ లో వినియోగించారని అంజనా సిన్హా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దహనం సిరీస్ మొత్ం హింసాత్మక దృశ్యాలతో, సెక్సువల్ కంటెంట్ తో కూడుకుని ఉందన్న అంజనా సిన్హా  ఆ సినిమాలో తన పేరు, ప్రొఫెషనల్ ఐడెంటిటీని ఉపయోగించడం ద్వారా  గౌరవ ప్రతిష్టలకు తీవ్ర నష్టం కలిగిందనీ, తన వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. మాజీ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఫిర్యాదు మేరకు రాదుర్గం పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు.   ఇప్పటికే రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ లో పలు కేసులు ఉన్న సంగతి తెలిసిందే. 

వివేకా హత్య కేసు.. బెయిల్ రద్దు పిటిషన్లు మళ్లీ ట్రయల్ కోర్టుకు!

వివేకానందరెడ్డి హత్య కేసులో  విచారణ ఓ అంతులేని కథలా సాగుతోంది. ఈ కేసులో నిందితుల బెయిలు రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత దాఖలు చేసిన బెయిలు పిటిషన్ పై ఈ దశలో నిర్ణయం తీసుకోజాలమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. బెయిలు రద్దు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సునీతకు సుప్రీం కోర్టు సూచించింది. దీంతో వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు కోరుతూ డాక్టర్ సునీత మళ్లీ ట్రయల్ కోర్టును ఆశ్రయించనున్నారు. డాక్టర్ సునీత దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టు మంగళవారం (సెప్టెంబర్ 16) విచారించింది. గత విచారణ సందర్రభంగా సుప్రీం కోర్టు ఎంత మంది బెయిల్స్ రద్దు చేయాలి అని ప్రశ్నించడమే కాకుండా గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వివేకా హత్య కేసు దర్యాప్తును ప్రభావితం చేసిందనీ, అధికార దుర్వినియోగానికి పాల్పడిందనీ వ్యాఖ్యనించడంతో పాటు డాక్టర్ సునీత, ఆమె భర్త, అలాగే సీబీఐ ఎస్పీ రాం సింగ్ లపై పెట్టిన కేసులను క్వాష్ చేసింది. దీంతో సుప్రీం కోర్టు తదుపరి విచారణలో కీలక నిర్ణయం వెలువరించే అవకాశాలున్నాయని అంతా భావించారు.   

సెప్టెంబర్ 24 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు

    మత మార్పిడుల నివారణకు దళిత వాడల్లో 1,000 ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం  టీటీడీ చైర్మన్  చైర్మన్  మాట్లాడుతూ..తిరుమల దేవస్థానంపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారిపై క్రిమినల్ కేసులు పెడతామని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశామన్నారు. బ్రహ్మోత్సవాల వేళ.. వాహన సేవను తిలకించెందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ పాలక మండలి నియమించిన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు.   సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామి  వారికీ పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అదే రోజు.. 2026 క్యాలెండరు, డైరీలను సీఎం ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు. ఇక సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం యాత్రి సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.  బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజులు..వీఐపీ సిపార్సు లేఖలను అనుమతించబోమన్నారు. ఆ రోజుల్లో ఈ లేఖలను రద్దు చేశామని చెప్పారు.  శ్రీవాణి ట్రస్టు నిధులతో కర్ణాటకలో 7ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. అనంతవరంలోని స్వామి వారి ఆలయంలో రూ. 7.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.  సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు దళిత వాడల్లో రూ.10 నుంచి రూ. 20 లక్షల నిధులతో 1000 ఆలయాలు నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు బీఆర్ నాయడు తెలిపారు. తిరుమల  బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ఆక్టోబర్ 2 వరకు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమం కోసం 8 లక్షల లడ్డూలు తయారు చేసి అందుబాటులో ఉంచనున్నామని వివరించారు. భక్తుల భద్రత కోసం 4500 మంది పోలీసులు, 3500 మంది వాలంటీర్లు సేవలు అందిస్తామని చెప్పారు. భక్తుల రద్దీని పర్యవేక్షించడానికి ఇస్రో సాంకేతిక సహాయం తీసుకోనున్నగట్లు వెల్లడించారు.  

యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పలకు ఈడీ నోటీసులు

బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినందుకు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు సినీ నటుడు సోనూ సూద్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.   యువరాజ్ సింగ్ తరచుగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో అతడిని ఈనెల 22న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ ేసింది. అలాగే  ఇదే విషయంలో మరో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పను సెప్టెంబర్ 23న విచారణకు రావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది.  బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. పలువురు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు విచారణలో నిర్ధారించుకున్న ఈడీ ఇప్పటికే మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ లను విచారించిన సంగతి తెలిసిందే.  అలాగు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నటులను కూడా ఈడీ ఇప్పటికే బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో విచారించింది. 

టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్

  భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌ని బీసీసీఐ ప్రకటించింది. ఈ ఒప్పందం 2027 వరకు కొనసాగనుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో, ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11తో భారత క్రికెట్ నియంత్రణ మండలి  తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో అపోలో టైర్స్ ముందుకు వచ్చింది. ఈ కొత్త ఒప్పందం ద్వారా అపోలో టైర్స్ ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐకి రూ. 4.5 కోట్లు చెల్లించనుంది.  గతంలో డ్రీమ్11 ఒక్కో మ్యాచ్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది. దానితో పోలిస్తే బీసీసీఐకి ఈ ఒప్పందం ద్వారా అదనపు ఆదాయం రానుంది. టీమిండియాకు రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ఎన్నో మ్యాచ్‌లు ఉన్నందున, ఈ స్పాన్సర్‌షిప్ ద్వారా అపోలో టైర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రచారం లభించనుంది. ఇటీవలి కాలంలో భారత క్రికెట్‌లో కుదిరిన అత్యంత విలువైన స్పాన్సర్‌షిప్ ఒప్పందాలలో ఒకటిగా ఇది నిలుస్తుంది.

ఏపీ మండలి చైర్మన్ న్యాయవాదికి హైకోర్టు అక్షింతలు!?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ తరఫు న్యాయవాదికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదం విషయంలో పదే పదే వాయిదాలు కోరుతున్న మండలి చైర్మన్ న్యాయవాదికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ విచారణకు మరింత సమయం కావాలంటే ఖర్చుల కింద పదివేల రూపాయలు చెల్లించాలని స్పష్టం చేసింది.  ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదం విషయంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ పిటిషన్ విచారణ చేపట్టిన జస్టిస్ రామకృష్ణ  మండలి చైర్మన్ మెషేన్ రాజు న్యాయవాది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విషయమేంటంటే.. జయమంగళ వెంకటరమణ గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన ఆ పార్టీలో చేరారు. అనంతరం వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అయితే, పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదనే కారణంతో 2024 నవంబర్‌లో ఆయన తన ఎమ్మెల్సీ పదవితో పాటు, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ కె. మోషేన్ రాజుకు స్వయంగా అందజేశారు. నెలలు గడుస్తున్నా, తన రాజీనామాను చైర్మన్ ఆమోదించకపోవడంతో  జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. తన రాజీనామా ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణను ఇప్పటికే చైర్మన్ న్యాయవాది కోరిక మేరకు పలుమార్లు వాయిదా వేసినా  కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యం చేయడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  బుధవారం సాయంత్రం 5 గంటలలోపు లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.10 వేలు చెల్లించాలని ఛైర్మన్ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. 

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

    తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ధార్మిక సంస్థ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇకపై అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశామన్నారు.

ప్రభుత్వ శాఖల సేవలకు రేటింగ్స్.. ఏపీ సీఎం నారా చంద్రబాబు

ప్రభుత్వ శాఖలు అందించే సేవలకు ఇకపై రేటింగ్స్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజు మంగళవారం (సెప్టెంబర్ 16) క్వాంటం వ్యాలీ, వాట్సప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 తదితర అంశాలపై సమీక్షించిన చంద్రబాబు.. పాలనలో టెక్నాలజీ వినియోగంపై   దిశానిర్దేశం చేశారు.  కొన్ని ప్రభుత్వ శాఖల పనితీరు మరింతగా మెరుగు పడాల్సి అవసరం ఉందని చెప్పిన చంద్రబాబు గతంతో పోల్చుకుంటే కొన్ని శాఖల పనితీరు మెరుగు పడినప్పటికీ,  రెవెన్యూ లాంటి శాఖల పనితీరు మరింత మెరుగుపడాలన్నారు.   రెవెన్యూ శాఖ   సంతృప్తికర స్థాయిలో  సేవలు అందించడం లేదని చంద్రబాబు అన్నారు. అందుకే ప్రభుత్వ సేవలకూ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.  సీనియర్ అధికారులు కూడా తమ పని విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై తమ తమ శాఖలకు సంబంధించిన క్షేత్ర స్థాయి సమాచారం కోసం పదే పదే కలెక్టర్లను నివేదికలు అడిగే పరిస్థితి రాకూదని అన్నారు. ఆర్టీజీఎస్ నుంచి అవసరమైన మేరకు నివేదికలు తీసుకుని అందుకు అనుగుణంగా  పని చేయించాలన్నారు.  అన్ని ఫైళ్లూ వంద శాతం ఆన్ లైన్ లో ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకోసం రెండు నెలలు గడువు ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్టీజీఎస్ ద్వారా అవేర్ వ్యవస్థను ఏర్పాటు చేశామనీ,  దీని ద్వారా 42 రకాల సమాచారం కలెక్టర్లకు అందుతోంది.  వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి ఏయే జిల్లాలు ఎక్కడెక్కడ తమ పనితీరు మెరుగుపరుచుకోవాలో కూడా రియల్ టైమ్ లో చెప్పేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.  కలెక్టర్ల కాన్ఫరెన్సులో క్వాంటం వ్యాలీ భవనాల డిజైన్లను ప్రదర్శించారు. ఆ భవనాలపై కలెక్టర్ల అభిప్రాయాలను సీఎం కోరారు. భవిష్యత్తులో 3 వేల క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా కార్యాలయ స్థలం అందుబాటులోకి రానున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. 80 వేలమంది పని చేసేలా క్వాంటం వ్యాలీ భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

జనవరి నాటికి రెండు క్వాంటం కంప్యూటర్లు!

అమ‌రావ‌తిలో క్వాంటం వ్యాలీ పనులు అనూహ్య వేగంతో జరుగుతున్నాయి. క్వాంటం వ్యాలీ నిర్మాణం కోసం సీఆర్డీయే 50 ఎకరాల స్థలం కేటాయించింది. ఇలా ఉండగా  క్వాంటం వ్యాలీలో ఐబీఎం సంస్థ వ‌చ్చే జ‌న‌వ‌రి క‌ల్లా రెండు క్వాంటం కంప్యూట‌ర్లు ఏర్పాటు చేయ‌నుంది.  2027 నాటికి మ‌రో మూడు కంప్యూట‌ర్లు ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఐటీ, ఆర్టీజీ శాఖల కార్యదర్శి   భాస్క‌ర్ కాటంనేని మంగళవారం (సెప్టెంబర్ 16) వెల్ల‌డించారు. స‌చివాలయంలో జ‌రుగుతున్న జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు రెండ‌వ రోజు ఆయ‌న అమ‌రావ‌తి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.  గ్లోబ‌ల్ క్వాంటం డెస్టినేష‌న్‌గా ఏపీని మార్చాల‌నే దిశ‌గా ప‌నులు చేప‌డుతున్నామ‌న్న ఆయన  ఇందుకోసం రెండు ద‌శ‌లుగా రోడ్ మ్యాప్ రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.  2030 క‌ల్లా అమ‌రావ‌తి క్వాంటం వ్యాలీ నుంచి ఏటా 5వేల కోట్ల మేర క్వాంటం హ‌ర్డ్‌వేర్ ఎగుమ‌తుల‌ను సాధించాల‌న్నలక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా  ఏటా 5 వేల మందికి క్వాంటం కంప్యూటింగ్‌లో నైపుణ్య శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌న్నామన్నారు.  వెయ్యి కోట్ల రూపాయల ప్రోత్స‌హ‌కాల‌తో క్వాంటం వ్యాలీలో క‌నీసం 100  స్టార్ట‌ప్‌లు  ఏర్పాటు చేయాన్న సంకల్పం పెట్టుకున్నట్లు తెలిపారు. క్వాంటం వ్యాలీ రాక‌తో రాష్ట్రంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తాయ‌న్నారు.  వైద్య ఆరోగ్యం, బీమా, ఫైనాన్స్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ అండ్ మిష‌న్ లెర్నింగ్‌, మెటీరియ‌ల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ, ఆప్టిమైజేష‌న్ అండ్ లాజిస్టిక్స్‌, క్లైమేట్, ఎన‌ర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట స‌హా మొత్తం 14 రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ లాగ‌ర్థ‌మ్స్‌తో అద్భుత ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని తెలిపారు.    జిల్లా స్థాయిలో ప్రజలు, విద్యార్థుల్లో క్వాంటం రంగంపై అవగాహన కల్పించడానికి జిల్లాల్లో రాయబారులుగా వ్యవహరించాల్సింది జిల్లా కలెక్టర్లేనని భాస్కర్ కాటంనేని చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయా జిల్లాల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.   రాజధాని అమరావతిలో నిర్మించనున్న అమరావతి క్వాంటం వ్యాలీ భవన సముదాయ నమూనాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంత్రుప్తి వ్యక్తం చేశారు. నమూనా బాగుందని, అనేక కసరత్తులు చేసిన తర్వాత తక్కువ సమయంలోనే మంచి నమూనా రూపొందించారని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేనిని అభినందించారు.

విద్యుత్ ఏడీఈ ఇంటిపై ఏసీబీ దాడి... రూ.2 కోట్ల నగదు సీజ్

  హైదరాబాద్ నగరంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించడంతో తీవ్ర కలకలం రేపు తుంది. హైదరాబాద్ నగరంతోపాటు పలు చోట్ల ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు... మొత్తం  పదిహేను బృందాలు సోదాలు చేస్తున్నట్లు సమాచారం....హైదరాబాద్ నగరం లోని గచ్చిబౌలీ మణికొండలో ఏసీబీ రైడ్స్ కొనసాగించారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఏడిఈ గా పని చేస్తున్న అంబేద్కర్ అనే వ్యక్తి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు.భారీగా అక్రమాలకు పాల్పడి కోట్లు కూడబెడుతున్నట్లు కొన్నేళ్లుగా అంబే ద్కర్ పై ఆరోపణలు వస్తున్నాయి.. చాలామంది బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం...ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు... ఇంకా సోదాలు కొనసాగుతునే ఉన్నాయి.అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో రెండు కోట్ల రూపాయల నగదును  అధికారులు పట్టుకున్నారు. అంబేద్కర్ బంధువులు, బినామీల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు.ఏడిఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంబేద్కర్ ఇల్లు తో పాటు బినామీ ఇండ్లు మొత్తం కలిపి 18 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల పైచిలుకు ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.అంబేద్కర్ పెద్ద ఎత్తున ఆస్తులతో పాటు వ్యవసాయ భూములు కొన్నాడు.ఆ భూముల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ ఏ చిన్న పని చేసినా కూడా లంచం డిమాండ్ చేసేవాడు. లంచం తీసుకోకుండా పనిచేసేవాడు కాదు ఇలా ప్రతి ఒక్కరి దగ్గర లంచం తీసుకునేవాడు.ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

వివేకా హత్య కేసులో కీలక మలుపు

  మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్లామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.మా వివేకానందరెడ్డి 2019 మార్చి 15న రాత్రి తన ఇంట్లో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యపై అనేక ఆరోపణలు చేశారు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిలపై ఆరోపణలు చేశారు. అంతేకాదు సీబీఐ డిమాండ్ సైతం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు టీడీపీ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు బృందాన్ని మార్చేసింది వైసీపీ ప్రభుత్వం. సీబీఐ దర్యాప్తుపై వైఎస్ జగన్ వెనక్కి తగ్గారు. పోలీసు అధికారులను సైతం బదిలీ చేశారు. దీంతో వైఎస్ సునీతారెడ్డి కోర్టులలోపోరాడి చివరకు సీబీఐ విచారణ సాధించారు. దీంతో ఈ కేసు విచారణను సీబీఐ దర్యాప్తు చేపట్టింది.