తెలంగాణ రవాణా శాఖకు కాసుల వర్షం
posted on Sep 12, 2025 @ 8:53PM
తెలంగాణ రవాణా శాఖకు కాసుల పంట పండింది.. ఫాన్సీ నెంబర్ల వేలంపాట ద్వారా ప్రభుత్వానికి రోజు రోజుకుపెద్ద ఎత్తున ఆదాయం వస్తూ ఉంది. ఈ ఫ్యాన్సీ నెంబర్ల కోసం చాలామంది పోటీ పడుతూ ఉంటారు...ఒకటి నుంచి తొమ్మిది లోపు గల సింగిల్ డిజిట్ నెంబర్లను కైవసం చేసుకోవ డానికి వ్యాపార వేత్తలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఒకటి, తొమ్మిది నెంబర్ల కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది.. ఈ నెంబర్ల కోసం వ్యాపారవేత్తలు లక్షల రూపాయ లను సైతం చెల్లించేందుకు సిద్ధపడుతూ ఉంటారు.
అయితే ఫ్యాన్సీ నెంబర్ల అమ్మకం ద్వారా ఏకంగా ఒక్కరోజు లోనే రూ. 63 లక్షల రూపాయల ఆదా యం తెలంగాణ రవాణా శాఖకు వచ్చి పడింది.. 9999 ఈ ఒక్క నెంబర్ అమ్మగా ఏకంగా రూ. 25 లక్షల రూపాయల ఆదాయం రవాణా శాఖకు వచ్చింది. టీజీ 09 జీ 9999 నెంబర్ను హెటిరో డ్రగ్స్ కొనుగోలు చేసింది.. ఈ నెంబర్ కోసం చాలామంది పోటీ పడ్డారు.. ఆల్ నైన్ నెంబర్ కోసం పెద్ద ఎత్తున వేలం పాట నిర్వహిం చారు.ఈ నెంబర్కు హెట్రో డ్రగ్స్ రూ. 25 లక్షల రూపాయలు చెల్లించి నెంబర్ను దక్కించుకుంది..అదే మాదిరిగా 0009 నెంబర్ కోసం కూడా పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.