బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ

  మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏడాది కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు బీజేపీతో తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు. ఏడాది క్రితం వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సునీత ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో పోతుల సునీత తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2017లో టీడీపీ తరఫున ఆమె తొలిసారిగా శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ టికెట్  ప్రయత్నించినా  దక్కలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2020 నవంబరులో ఆమె టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై సేవలందించారు.పోతుల సునీత రాజకీయ ప్రస్థానంలో ఇది మూడో మలుపు. 

ఇక హైడ్రాకు సూప‌ర్ ప‌వ‌ర్స్

  హైడ్రాకు సూప‌ర్ ప‌వ‌ర్స్ రానున్నాయా? అంటే మున్సిప‌ల్ శాఖ అదే నిజ‌మ‌ని అంటోంది. కార‌ణ‌మేంటంటే జీహెచ్ఎంసీలో చాలా మంది కాంట్రాక్ట‌ర్లు చేయ‌ని ప‌నుల‌కు కూడా బిల్లులు తీస్కుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. వీట‌న్నిటినీ క‌ట్ట‌డి చేయ‌డానికి హైడ్రా ఒక క్రాస్ చెక్ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. కాంట్రాక్ట‌ర్లు ఎక్క‌డెక్క‌డ ఏయే ప‌నులు చేస్తున్నారు? ఎంత శాతం మేర చేస్తుంటే.. ఎంత శాతం చేసిన‌ట్టు చెబుతున్నారు? వారికి ఎంత మేర బిల్లులు ఇస్తే బావుంటుంది? వంటి అంశాల‌తో కూడిన నియ‌మావ‌ళిని రూపొందిస్తున్నారు. వీట‌న్నిటిపై హైడ్రా అధికార గ‌ణం ఒక రిపోర్ట్ త‌యారు చేయాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ ద్వారా.. జీహెచ్ఎంసీ నిధులు చెల్లించేలా ఒక ఏర్పాటు చేస్తోంది మున్సిప‌ల్ శాఖ‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక లెక్క ఇప్ప‌టి  నుంచి మ‌రోలెక్క‌గా జ‌ర‌గ‌నుంది. ఇక‌పై హైడ్రా నివేదిక‌ల్లేకుండా జీహెచ్ఎంసీ ఎలాంటి బిల్లులూ చెల్లించ‌రాదు. ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఏంటంటే.. హైడ్రా మీద కూడా ఒక విజిలెన్స్ టీం ప‌ని చేస్తుంది. వీరు హైడ్రా ఇస్తున్న రిపోర్ట్స్ క‌రెక్టా కాదా? అని చూస్తారు. ఒక వేళ హైడ్రా గానీ త‌ప్పుడు లెక్క‌లు చెప్పి ఉంటే.. సంబంధిత అధికారుల‌ను సైతం బాధ్యుల‌ను చేస్తారు. అంటే డ‌బుల్ చెక్ మోడ‌ల్ అన్న‌మాట‌.మ‌రి ఈ మొత్తం క్రాస్ చెక్ లోంచి ఇక కాంట్రాక్ట‌ర్లు త‌ప్పించోలేరా? వారి  త‌ప్పుడు బిల్లుల బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు అయిన‌ట్టేనా?? అన్న‌ది తేలాల్సి ఉంది.  

ఏదో లక్కీగా ఎమ్మెల్యే అయ్యారు...మంత్రి కీలక వ్యాఖ్యలు

  వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పైన  మంత్రి కొండ సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా ఓ సిటీలో గ్యాస్  ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి కొండ సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అదృష్ట కలిసి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచాడు అని అన్నారు. ఆయన నాకంటే చిన్నవాడు నాకంటే ముందు నుంచి ఎమ్మెల్యే కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు అని వాఖ్యనించాడు.  ఇప్పుడు అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యే అయ్యాడని మాట్లాడారూ. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నేను భద్రకాళి గుడిలో ధర్మకర్తలను నియమించుకునే అధికారం లేదా అని అన్నారు. అధిష్టానం చెప్పిన వారికి భద్రకాళి దేవాలయం ధర్మకర్తగా నియమించామని అన్నారు. నాపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మాట్లాడారు. భద్రకాళి ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది అని మంత్రి కొండ సురేఖ మాట్లాడారు.  మంత్రి కొండ సురేఖ వాక్యాల పైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. పుటోకో పార్టీ మారితే ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యే వాడిని అని ఘాటుగా విమర్శించారు. కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాను కాబట్టి ప్రజలు గెలిపించాలని అన్నారు. పుటకో పార్టీ తిరిగే ఉంటే ఎమ్మెల్యే అయ్యేవాడిని కాదని అన్నారు..మంత్రి కొండ సురేఖకు ఇస్తున్న గౌరవంని కాపాడుకోవాలని అన్నారు. ఆమె మహిళా కాబట్టి ఎక్కువ మాట్లాడకపోతున్నాను అని విమర్శించారు.  నా నియోజకవర్గంలో మంత్రి  పెత్తనం ఏంటని తీవ్రంగా మండి పడ్డారు. 15 ఏళ్లుగా వరంగల్ ఈస్ట్ కు రెండు డైరెక్టర్లు పదవులు ఇచ్చి మిగతావి వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ఇచ్చారు. అలాగే నేను కూడా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి రెండు వెస్ట్ నియోజకవర్గానికి 5 పరకాల,వర్ధన్నపేట, హుస్నాబాద్ కు ఒక్కొక్క డైరెక్టర్ల చొప్పున ఇవ్వాలని సూచించాను తప్ప అని అన్నారు. నా నియోజకవర్గంలో మంత్రి కొండ సురేఖ జోక్యంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.  

బడిలో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన కీచక టీచర్

  నేటి సమాజంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా అయిపో యింది. కామాంధు లకు కళ్ళు మూసు కుపోయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆడపిల్ల కనిపిస్తే చాలు లైంగిక వేధిం పులకు గురి చేస్తు న్నారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని బయటకి పంపించాలంటేనే భయంతో వణికి పోతున్నారు. అయితే దేవాలయం లాంటి బడిలో కూడా కామాంధులు అభం శుభం తెలియని చిన్నారు లను కాటు వేసేం దుకు సిద్ధమవుతు న్నారు. అక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది.  సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామంలో ఓ కీచక టీచర్ కన్ను ఓ విద్యార్థిని పై పడింది. దీంతో ఆ విద్యార్థిని పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లి దండ్రులు పోలీసు లను ఆశ్రయించడం తో ఈ ఘటన వెలు గులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలంలో ఉన్న లక్ష్మక్క పల్లి గ్రామంలోని వెరీటాస్ సైనిక్ స్కూల్లో ప్రణయ్ అనే వ్యక్తి తెలుగు టీచర్ గా పని చేస్తున్నాడు.  అదే స్కూల్లో బాధిత బాలిక 8వ తరగతి చదువుతున్నది. సెప్టెంబర్ 4వ తేదీన టీచర్స్ డే సెలబ్రే షన్స్ ప్రోగ్రాం జరిగిన అనంతరం తెలుగు టీచర్ ప్రణయ్ క్లాస్ రూమ్ కి వచ్చాడు.  బాధిత బాలికను మాత్రమే క్లాస్ రూమ్ లో ఉండాలని ఆదేశించాడు. క్లాస్ రూమ్ లో ఉన్న మిగతా విద్యార్థులం దరినీ బయటకు పంపించాడు. అనంతరం క్లాస్ రూమ్ డోర్ మూసి వేసి సదరు బాలికపై అత్యా చారం యత్నానికి పాల్పడ్డాడు.  దీంతో బాలిక గట్టి గట్టిగా అరవడంతో ఎవరైనా వస్తారే మోనని... భయపడి పోయిన తెలుగు టీచర్ ప్రణయ్ అక్కడి నుండి పారిపోయాడు. అనంతరం బాలిక ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేసింది. అయినా కూడా స్కూల్ యజమా న్యం ఈ విషయాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే స్కూల్లో ప్రిన్సిపల్ ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది... దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కీచక టీచర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు...

కన్న తండ్రే కాలయముడు... బాలుడిని హత్య చేసిన తండ్రి

  అమ్మ ప్రేమ..... అయితే నాన్నా బాధ్యత..... అమ్మ తన ప్రేమ నంత రంగడించి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. కానీ పైపైకి కఠినంగా కనిపించే నాన్నా బాధ్యతతో వ్యవహరిస్తాడు. తన పిల్లలు మంచి ఉద్యోగంలో చేరి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాం క్షిస్తూ అందుకొరకు పగలు, రాత్రి అనే తేడా లేకుండా అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాడు. తన పిల్లలు  బాగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి వచ్చాక ఆ తండ్రి లోలోపల పడే ఆనందం అంతా ఇంతా కాదు.  ప్రతి పిల్లలకి తండ్రి ఒక హీరో.... అలాంటి తండ్రి తన పిల్లలకి ఏదైనా రోగం వచ్చిందంటే తన ప్రాణాలను సైతం లెక్కచేయ కుండా తన పిల్లల్ని రక్షించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అయితే డబ్బు లేకపోతే దాతలను అర్ధించి మరి తన పిల్లల్ని రక్షించుకుం టున్న ఘటనలు ఎన్నో జరుగుతు న్నాయి. కానీ పాతబస్తీ పరిధిలో జరిగిన ఓ ఘటన మాత్రం పలువురిని కంటతడి పెట్టిం చింది. ఓ తండ్రి తన కొడుకును  హత్య చేసి మూసి నదిలో పడేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపు తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ పాతబస్తీ బండ్ల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూరి నగర్ లో మహ మ్మద్ అక్బర్(35), సనా బేగం దంపతులు... వీరికి పెద్దబాబు (07), చిన్నబాబు మహమ్మద్ అనాస్(03) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. మహమ్మద్ అక్బర్ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండగా... సనా బేగం నీలోఫర్ కేర్ టేకర్ గా పనిచేస్తుంది. కొడుకు గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నాడు.  ఎన్నెన్నో హాస్పిటల్ లో చూపించాడు. అయినా కూడా కొడుకు అనారోగ్య సమస్య పరిష్కారం కాలేదు. అయితే దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరుగుతూ ఉండేది. దీంతో మహమ్మద్ అక్బర్ అనారోగ్య సమ స్యతో బాధపడు తున్న తన కొడుకు ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.. ఈ నేపథ్యంలోనే తన భార్య సనా బేగం శుక్రవారం రాత్రి డ్యూటీ కి వెళ్ళిన తర్వాత శనివారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చిన్న కొడుకు తలపై దిండితో ఊపిరాడకుండా చేసి చంపాడు.  అనంతరం బాలుడి మృతదేహాన్ని సంచిలో పెట్టుకొని బైక్ పై తీసుకెళ్లి నయాపూల్ బ్రిడ్జి పై నుంచి మూసిలో పడేసాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి తన కొడుకు కనిపించడం లేదంటూ... బంధువులు తీసుకువెళ్లి బిడ్డను తిరిగి ఇంటి దగ్గర దింపినట్లు ఫోన్ చేశారని... కానీ తన కొడుకు అప్పటి నుండి కనిపించడం లేదని బోరున విలపిస్తూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో తండ్రి అక్బర్ ఫోన్ ని చెక్ చేయడంతో ఎటువంటి కాల్ రాలేదని పోలీసు లకు అర్థమైంది.  అంతేకాకుండా అతను చేసే ఓవర్ యాక్షన్ చూసి పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా తెల్లవారుజామున బైక్ పై ఏదో పెద్ద సంచి పెట్టుకొని తీసుకువెళ్లినట్లుగా దృశ్యాలు కనిపించాయి. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో అసలు నిజం బయటికి వచ్చింది. తన కొడుకుని తానే హత్య చేశానని తర్వాత మృతదే హాన్ని తీసుకువెళ్లి మూసిలో పడేసా నని మహమ్మద్ అక్బర్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. దీంతో బండ్లగూడ పోలీ సులతో పాటు హైడ్రా ఎన్డీఆర్ఎఫ్ అధికారులు మూసి లో బాలుడి మృత దేహం కోసం జల్లెడ పడుతున్నారు.

మహిళా శక్తి కారణంగానే భారత్‌కు గుర్తింపు : స్పీకర్‌ ఓంబిర్లా

  భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్ధాలకు ముందే ప్రారంభమైందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో జరుగుతున్న మహిళ సాధికరత సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సంప్రదాయమని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ మహిళలు కీలకపాత్ర పోషించారు. సామాజిక బంధనాలు తెంచుకొని అనేక ఉద్యమాలు చేశారు. మహిళా శక్తి కారణంగానే ప్రపంచంలోనే ముఖ్య దేశంగా భారత్ అవతరించిందని చెప్పారు.  మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే భారత్‌ ముఖ్యదేశంగా అవతరించింది. రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, సైన్యంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆదివాసీ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్నారు. మహిళా సాధికారత ఒక్కరోజులో సాధ్యం కాదు. అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటే సాధ్యమవుతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశామని సభాపతి వెల్లడించారు.  

అసెంబ్లీకి రాకపోయిన జీతం తీసుకుంటున్నారు : అయ్యన్నపాత్రుడు

  తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు ప్రారంభమైంది. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా నేతృత్వంలో వికసిత్‌ భారత్‌కు మహిళల నాయకత్వం అనే నినాదంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ముఖ్యఅతిథిగా ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పాల్గొన్నారు. ఈ సదస్సుకు హాజరైన ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతు  కొందరు ఎమ్మెల్యేలు శాసన సభకు రాకపోయినా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ అన్నారు.  ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యలు పరిష్కరించడానికే ఉద్యోగాలకు రాకపోతే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. చిరుద్యోగులు సైతం ‘నో వర్క్‌ - నో పే’ విధానం అనుసరిస్తున్నారు. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్పీకర్‌ మార్గదర్శకాలు ఇవ్వాలి. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులు.. వాటికి కూడా రాకపోతే ఎలా?’’ అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

డ్రగ్స్ తయారీ కేసులో సంచలన విషయాలు

  ఒకపక్క స్కూలు.. మరోపక్క మత్తు మందు తయారీ.. స్కూల్ బిజినెస్ లో లాభాలు లేవు అనుకున్న కరస్పాండెంట్..  ఏకంగా మత్తు మందు తయారు చేయడం మొదలుపెట్టాడు.. ఒకవైపు విద్యార్థు లకు పాఠాలు చెబుతూనే ..మరో రూంలో మత్తు పదార్థులు  తయారుచేసి అమ్మేస్తున్నాడు ..అత్యంత ప్రమాదకర మైన ఆల్ఫా జోలం డ్రగ్ ను  తయారు చేసి మార్కెట్లో ఏదేచ్ఛగా విక్రయిస్తున్నాడు..  ఏపీ, తెలంగాణ, తమిళనాడు తో పాటు హైదరాబాదు లోని కల్లు కాంపౌండ్లకి ఈ ఆల్ఫా జోలం అమ్మేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.. సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి  పరిధిలో ఉన్న మేధా హై స్కూల్ క్యాంపస్ ల మాదక ద్రవ్యాలు తయారు చేస్తు న్నట్లు అధికారుకు సమాచారం రావడంతో వెంటనే సోదాలు నిర్వహించారు.  ఈ సోదాల్లో ఆల్ఫా జోలం డ్రగ్  తయారీకి కావల సిన ముడిసరకు లభ్యమయింది ..మరోవైపు దాదాపు 10 కిలోల ఆల్ఫా జోలంను ఈగల్ అధికారులు పట్టుకున్నారు.. ఆల్ఫా జోలం ను బయటికి తీసుకువెళ్లి అమ్మే సమయంలో ఈగల్ టీం దాడి చేసి నలుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్నారు. అంతేకాకుండా ఈగల్ టీం స్కూల్ నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు. బోయిన్పల్లి లోని అస్మత్ పేటలో మెగా హై స్కూల్ ని జయప్రకాష్ గౌడ్ నడుస్తున్నాడు. ఈ స్కూల్లో ఉదయం సమయంలో విద్యార్థులకు క్లాసులు... సాయంత్రం ట్యూషన్ లు జరుగుతూనే ఉన్నాయి.  అంతేకాకుండా దేవాలయం లాంటి ఈ స్కూల్లో గుట్టు చప్పుడు కాకుండా రెండవ అంతస్తులో ఏకంగా మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ పెట్టాడు.. మాదక ద్రవ్యాలు తయారు చేయా లంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుంది. ఇందుకు సంబం ధించి  .6 రియాక్టర్ల ఏర్పాటుచేసి డ్రగ్ను తయారు చేస్తు న్నాడు.. ప్రతి నెలకు దాదాపు 20 నుంచి 30 కిలోల ఆల్ఫా జోలం తయారుచేసి కల్లు కాంపౌండ్లకి సరఫరా చేస్తున్నా రని ఈగల్ టీం ప్రతినిధులు చెప్పారు..  స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేదాని కంటే  అమ్మకాల ద్వారే పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయని జయప్రకాష్ గౌడ్ అధికారులకు తెలిపాడు.. స్కూల్లోని ఈ చిన్నపాటి కంపెనీలో సోదాలు చేసినప్పుడు మొత్తం కలిపి పది కిలోల ఆల్ఫా జోలం డ్రగ్‌ను స్వాధీన పరుచుకున్నారు.. దీనికి తోడు పెద్ద ఎత్తున రా మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకున్నారు.. ఈ డ్రగ్ మొత్తాన్ని కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్న బ్రోకర్స్ కి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.. సికింద్రాబాద్ బోయినపల్లి పరిధిలో ఉన్న మేధా హై స్కూల్ లో ఈగిల్ స్వాధీనం చేసు కున్న ఆల్ప్రా జోలామ్ తయారీ యూనిట్‌పై ప్రాథమిక నివేదిక ఇచ్చింది.మహబూబ్‌నగర్ కు చెందిన మలేలా జయప్రకాశ్ గౌడ్ బోవెనపల్లి, హైదరాబాద్‌లోని మెధా స్కూల్ నిర్వహిస్తున్నాడు. కానీ స్కూల్ పెట్టి నష్టపోయాడు. అయితే జయప్ర కాష్ గౌడ్ కి దాదాపు సంవత్సరం క్రితం శేఖర్‌ ద్వారా గురువారెడ్డి అనే వ్యక్తిని కలిశాడు. డబ్బు దాహంతో, గురువారెడ్డి అతనికి ఆల్ప్రాజోలామ్ తయారీ విధానం మరియు ఫార్ము లాను అందించాడు. దీంతో జయప్రకాశ్ స్కూల్ ప్రాంగణం వెనుకభాగంలో ఆల్ప్రాజోలామ్ తయారీ యూనిట్‌ ను ఏర్పాటు చేశాడు. అనంతరం, బూత్‌పూర్, మహబూబ్‌నగర్ జిల్లా బూత్ పూర్ పరిసర గ్రామాల లోని తాటి కల్లు లకు ఆల్ప్రాజో లామ్ సరఫరా చేయడం ప్రారంభించాడు.విశ్వసనీయమైన సమాచారం రావడంతో ఈగిల్ టీమ్ దాడి నిర్వహించి, నిందితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి... వారి వద్ద నుండి 3.5 కేజీల ఆల్ప్రాజోలామ్. 4.3 కేజీల అర్థసిద్ధమైన ఆల్ప్రాజోలామ్,రూ. 21 లక్షల నగదు తో పాటు భారీ స్థాయిలో ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ రాకెట్ లో మిగిలిన నిందితుల వ్యవహారంపై ఈగల్ టీం దర్యాప్తు కొనసాగించారు..

చెవిరెడ్డి లీల...చెబితే చాంతాడంత!

  మానాన్న 15 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన పేరు. ఉన్నది ఉన్నట్టురాయండి. ఆయనకు చెడ్డపేరు తేవద్దంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మొన్న సిట్ తన ఇంటి విచారణ సందర్భంగా అన్నమాట. నిజంగానే ఉన్నది ఉన్నట్టు రాయడం మొదలు పెట్టినా.. ఆ పదిహేను ఏళ్ల పేరెలాగూ రిపేరయ్యేలాగే ఉంది చూస్తుంటే.. ఎందుకంటే సిట్ విచారణలో బయటపడ్డ, చెవిరెడ్డి చుట్టూ అల్లిన ఓ నకిలీ వ్యాపార ప్రపంచం దాని పూర్వాపరాలేంటని చూస్తే.. డ్రైవర్లే డైరెక్టర్లుగా, బంధువులే బినామీలుగా.. 8 డొల్ల కంపెనీలు, అందులో 16 మంది బినామీలతో.. మద్యం ముడుపుల బ్లాక్ మనీ, వైట్ లోకి మార్చడానికి చెవిరెడ్డి మరో లోకాన్ని సృష్టించినట్టు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ఒకరన్నవి కావు సిట్ స్వయానా అన్న మాటలు.  తిరుచానూరులో 35 కోట్ల విలువైన భూమిని సుమారు 3 కోట్లకే సొంతం చేసుకున్న వైనం, అమ్మిన వ్యక్తికి 24 లక్షలు మాత్రమే ఇచ్చి.. మిగిలిన సొమ్ము ఆమెను బినామీగా తమ డొల్ల కంపెనీలోకి చేర్చుకుని.. ఆపై అప్పు తీస్కున్నట్టు సృష్టించడం.. ఇలాంటి ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. నేను వేద పాఠశాల నడుపుతున్నా అంటోన్న చెవిరెడ్డి ఏకంగా పూజారికే పంగనామాలు పెట్టడం మరో గుడిలో.. గూడుపుఠాణీ లాంటి కథనం. తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడి భార్య రేణుక పేరిట తిరుచానూరులో ఒక చోట 2. 98 ఎకరాల భూమి ఉంది. ఇది మార్కెట్ వాల్యూ కన్నా తక్కువకు తన పరం చేసుకున్న ఘనాపాటి ఈ చెవిరెడ్డిగా గుర్తించారు సిట్ అధికారులు. ఇది కూడా మద్యం సొమ్ములోంచి కాజేసిన దాన్లోంచి ఇచ్చినట్టు సమాచారం. అసలు చెవిరెడ్డి ఆయన బంధుమిత్ర సపరివారం మొత్తం ఇదే పనిగా ఉంటారట. తిరుపతి పాస్ పోర్ట్ ఆఫీసు దగ్గర ఒక ఛానెల్ కి సరిపడా ఆఫీసు నడుపుతూ.. సర్వే నిర్వహిస్తామన్న కలరింగ్ ఇచ్చే చెవిరెడ్డి. తన చుట్టూ ఏర్పరిచిన అతి పెద్ద అక్రమ అవినీతి సామ్రాజ్యం గుట్టు తెలుసుకునే కొద్దీ విస్తు పోతున్నారట సిట్ అధికారులు.  పైకి ఒకటి చూపిస్తూ లోలోన.. మాత్రం భూములను చౌకగా కొనడం, అమ్మడం. ఎవరైనా కాదంటే వారిని మభ్య పెట్టడం లేదా బెదిరించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటారట. పెద్ద కొడుకును తన తరఫున చెవిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయించిన చెవిరెడ్డి. చిన్నకొడుకు హర్షిత్ రెడ్డి ద్వారా ఈ భూలావాదేవీలను ఎక్కువగా చేస్తుంటారట.  ఇలా చెప్పుకుంటూ పోతే సిట్ వెలుగులోకి తీస్కొస్తున్న చెవిరెడ్డి లీలలు చాంతాడంత అంటున్నారు అధికారులు. ఇంతోటిదానికి చెవిరెడ్డి నాకు మద్యం అంటే పడదు. నేను శుద్ధపూసను. పులుగడిగిన ముత్యాన్ని, మేలిమి బంగారాన్ని అని చెప్పుకు తిరడం చూస్తుంటే.. ఏమనాలో అర్ధం కావడం లేదంటున్నారు స్థానికులు.  ఇక కొడుకు అంతకన్నా మించి.. మానాన్న మంచి పేరు చెడగొట్టకండీ.. అదీ ఇదని పెద్ద పెద్ద మాటలంటుంటే పుసుక్కుమని నవ్వుతున్నారట ఆయన బైట్ తీస్కుంటున్న మీడియా వర్గాల వారు. మరి చూడాలి ఈ చెవిరెడ్డి లీలలు ఇంకెన్ని మన చెవిన పడతాయో తేలాల్సి ఉంది.

అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ వంతెనపై సీఎం సమీక్ష

  తెలుగువారి ఆత్మగౌరవం- ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ స్మృతివనం  ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, ప్రాచీన చరిత్ర తదితర అంశాలకు పెద్దపీట వేస్తూ దీనిని చేపట్టాలని సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై సీఎం సమీక్షించారు.  అమరావతిలోని నీరుకొండ వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్టులోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు.  ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రాచీన తెలుగు చరిత్రతో పాటు ప్రజల మనస్సుల్లో నిలిచిపోయిన అల్లూరి, పొట్టిశ్రీరాములు లాంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు, సంస్కృతీ సంప్రదాయాలు, భాష, లిపికి చెందిన వివరాలను కూడా తెలియచెప్పేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలుగు ప్రజల ప్రతీకగా ప్రజా రాజధాని అమరావతిని కూడా ప్రతిబింబించేలా ప్రాజెక్టు చేపట్టాలన్నారు.  182 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహ స్మృతి వనం ప్రాజెక్టుకు అనుబంధంగా నీరుకొండ రిజర్వాయర్ ను తీర్చిదిద్దాలన్నారు.  ప్రత్యేకించి పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించేందుకు అనువుగా ఆకర్షణల్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గుజరాత్ లో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును కూడా పరిశీలించాలని సీఎం పేర్కొన్నారు. అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై చేపట్టనున్న ఐకానిక్ వంతెన డిజైన్లను కూడా సీఎం పరిశీలించారు.  అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంతకముందు ఎన్టీఆర్ విగ్రహ నమూనాలను పరిశీలించారు.  

తిరుమలలో వీఐపీల సందడి... కొనసాగుతున్న భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం వరకు సాధారణంగా ఉన్న రద్దీ.. శని, ఆదివారం వరుస సెలవులు రావడంతో.. ఒక్కసారిగా తాకిడి పెరిగిపోయింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ప్రస్తుతం తిరుమల కొండపై ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి.. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా.. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.   తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌, ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్‌, అనిత, సవిత, సంధ్యారాణి, ఎంపీ పురందేశ్వరి, మాజీ మంత్రి పరిటాల సునీత, మహారాష్ట్ర ఎంపీ రోహిణి,ఎంపీ సుధా నారాయణమూర్తి, మాజీ గవర్నర్ తమిళ సై, ఎంపీ పురందేశ్వరి, తమిళనాడు మంత్రి గాంధీ శ్రీవారి దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే శనివారం తిరుమల శ్రీవారిని 82149 భక్తులు దర్శించుకోగా.. 3.85 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.  

సికింద్రాబాద్లో మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ గుట్టురట్టు

  సికింద్రాబాద్‌లో తెలంగాణ పోలీస్‌ శాఖకు చెందిన ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్ టీం అధికారులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఈగల్ టీం అధికారులు పాఠశాలలో అల్ఫాజోలం తయారు చేసే యంత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.  పాత స్కూల్‌ భవనంలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం అధికారుల బృందం వారిని విచారిస్తోంది. గత కొంతకాలంగా మూతపడిన పాఠశాలలోనే అక్రమంగా మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించినట్టు సమాచారం. మత్తు మందును తరలిస్తున్న సమయంలో ఈగల్ టీమ్ పట్టుకుంది. వారి వద్ద నుండి కోటి రూపాయల విలువైన మత్తు మందు సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు : పవన్

  తనపై దుప్ప్రచారం చేసేవారిని ప్రజాస్వామ్యయుతంగా చట్టప్రకారమే తిప్పికొట్టాలని జనసైనికులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. గొడవలు పడటం ద్వారా సమస్య మరింత జటిలమవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి అశాంతిని కలిగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని పవన్ తెలిపారు. రెచ్చగొట్టే ప్రకటనలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారి ఉచ్చులో పడకుండా, చట్టపరమైన మార్గాల్లోనే ముందుకు వెళ్లాలని ఆయన స్పష్టమైన పిలుపునిచ్చారు.  సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ చానెళ్ల ముసుగులో కొందరు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇలాంటి కుయుక్తులతో సమాజంలో అభద్రతను సృష్టించే వారి నైజాన్ని గత పదేళ్లుగా చూస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. ఆవేశాలకు లోనై ఘర్షణలకు దిగితే కుట్రదారుల లక్ష్యం నెరవేరుతుందని, కాబట్టి సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని పవన్ పేర్కొన్నారు.  ఓ యూట్యూబ్ చానెల్ లో ఒక వ్యక్తితో ఉద్దేశపూర్వకంగా అభ్యంతరకర భాషలో మాట్లాడించి, దానిని ప్రచారం చేయడం వెనుక ఉన్న దుష్ట ఆలోచనను గ్రహించాలన్నారు. దీనిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి ముందుకెళ్లాలే తప్ప, తొందరపడి ఘర్షణలకు దిగితే సమస్య మరింత జటిలమవుతుందని ఆయన విశ్లేషించారు. ఇలాంటి పరిస్థితులను ఆసరాగా చేసుకుని నాయకులు బయటకు వచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  ఈ నేపథ్యంలో మచిలీపట్నం వివాదంపై అంతర్గత విచారణ జరపాలని పార్టీ నాయకులను ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని స్పష్టం చేశామన్నారు. విశ్లేషకులు, సోషల్ మీడియా ముసుగులో రెచ్చగొట్టే వారితో పాటు, వారి వెనుక ఉండి వ్యవస్థీకృతంగా కుట్రలు చేసే వారిపై కూడా భారత న్యాయ సంహిత ప్రకారం ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయించాలని జనసేన, కూటమి నాయకులకు, కార్యకర్తలకు పవన్  కల్యాణ్ కోరారు.

మేము అధికారంలోకి వ‌స్తే... అమ‌రావ‌తి నుంచే : స‌జ్జల

  సకల విభాగాల మాజీ మంత్రి, తాజా వైసీపీ స్టేట్ కో ఆర్డినేట‌ర్ లేడూ.. స‌జ్జ‌ల‌నీ.. అంటార్లెండి. ఇపుడీ స‌జ్జాల దేవ‌ ఏమంటాడంటే.. మేము మళ్లీ అధికారంలోకి వ‌స్తే అమ‌రావ‌తి నుంచే పాల‌నంటాడు. మ‌రీ మాట న‌మ్మొచ్చా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌ కాగా.. మ‌న‌మిపుడు అర్జంటుగా ఫ్లాష్ రీల్ ఒక‌టి తిప్పాల్సి ఉంటుంది మ‌రి.. అదెలాంటిదంటే.. గ‌తంలో ఇదే అమ‌రావ‌తి విష‌యంలో.. జ‌గ‌న్ అన్న మాట‌ల‌ను బ‌ట్టీ చూస్తే.. ఇక్క‌డే రాజ‌ధాని ఏర్పాటు చేయ‌డం అనే అంశం మీద త‌న‌కెలాంటి వ్య‌తిరేక‌త లేదంటూనే మూడు రాజ‌ధానుల ముచ్చ‌ట స‌డెన్ గా వెలుగులోకి తెచ్చాడు.. ఆపై ప్రాంతీయ విబేధాల‌కు ఆజ్యం పోశాడు.. అమ‌రావ‌తిని కావాలంటూనే దాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించాడు. ఇక క‌ర్నూలు, విశాఖ‌ను కూడా ఎగ‌దోశాడు. ద‌క్షిణాఫ్రికా మోడ‌ల్ అంటూ మూడు రాజధానుల మంట పెట్టాడు. క‌ట్ చేస్తే విశాఖ నుంచే త‌న పాల‌న అంటూ రుషి కొండ ప్యాలెస్ నిర్మించి మ‌రీ చాటింపు వేయించాడు. అన్ని వేదిక‌ల నుంచి అంద‌రికీ అదే చెప్పాడు. విశాఖ‌లో త‌న రెండో ప్ర‌మాణ స్వీకారోత్స‌వం అంటూ ఫ‌లితాల ముందే నానా హంగామా న‌డిపించాడు. ఆంధ్రుల అదృష్టం బాగుండి.. ఎలాగో ఆ ప్రమాదం త‌ప్పింది.  ఇక త‌న జ‌మానాలో.. రాజ‌ధాని రైతుల‌ను అట్టుడికించిన సంగ‌తి స‌రే స‌రి. ఆ మాట‌కొస్తే.. ఇదే రాజ‌ధాని రైతుల‌కు ఆశ్ర‌యం ఇచ్చినందుకు కోటంరెడ్డి వంటి వారు ఏకంగా పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌ల్సి వ‌చ్చింది. అది వేరే సంగ‌తి. ఇప్పుడేదో ప‌ర‌దా అనే సినిమా వ‌చ్చింది కానీ ఈ సినిమాను జ‌గ‌న్ ఎప్పుడో తీసేశాడు. ఒక స‌మ‌యంలో అమ‌రావ‌తిలో ఆయ‌న తిర‌గ‌డానికి అధికారులు అన్నేసి ప‌ర‌దాలు క‌ట్టాల్సి వ‌చ్చింది మ‌రి.  స‌రే ఇప్పుడేమైనా మ‌న‌సు మారిందా? అంటే ఏకంగా అధికారిక మీడియా వేదిక పైనుంచి అమ‌రావ‌తి దేవ‌త‌ల రాజ‌ధాని కాదు వేశ్య‌ల రాజ‌ధాని అన్న కామెంట్లు గుప్పించారు. స‌రే అదేదో ఒక ఔట్ సోర్సింగ్ జ‌ర్న‌లిస్టు అన్నాడు లెమ్మ‌ని లైట్ తీస్కుందామ‌నుకుంటే ఆయ‌న పార్టీకి చెందిన కేతిరెడ్డి వంటి ఎమ్మెల్యేలు చేప‌ల రాజ‌ధానిగా అభివ‌ర్ణించారు. కొన్నాళ్లు పోతే గోదాట్లో దొరికే పుల‌స ఇక్క‌డే దొర‌కొచ్చ‌న్న వ్యంగ్యాస్త్రాలు ఇందుకు అద‌నం. ఇదస‌లు క్వాంటం వాలీ కావ‌డం క‌న్నా ఆక్వా వాలీ కావ‌చ్చొనిపిస్తిరి. మొన్న‌టి వర్షాలకు వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఈ ప్రాంతం మీద క‌క్ష క‌ట్టిన‌ట్టు దాన్ని ఒక‌టే ట్రోలింగ్ చేస్తిరి. అదేమ‌న్నా చంద్ర‌బాబు అబ్బ సొత్తా??? ఒక రాజ‌ధాని లేని రాష్ట్రానికి రాజ‌ధాని కావ‌ల్సిన ప్రాంతం. వీళ్ల పుణ్య‌మాని.. ఇప్ప‌టికీ అది పురిటి నొప్పులు అనుభ‌విస్తూనే ఉంది.  2024 ఎన్నిక‌ల్లో అమ‌రావ‌తే రాజ‌ధానిగా ముందుకెళ్తాం అన్న కూట‌మి గెలుపుతో ఒక విష‌యం  అయితే ప‌బ్లిక్ నుంచి రెఫ‌రండం గా వెలుగులోకి వ‌చ్చింది. అలాగ‌ని దాన్ని గుర్తించ‌కుండా.. త‌న మీడియా చేత‌, మ‌నుషుల చేత‌, సోష‌ల్ మీడియా ద్వారా చేయించాల్సిన కామెంట్ల‌న్నీ చేయించి.. ఇప్పుడు త‌న నీడ‌లాంటి స‌జ్జ‌ల చేత‌.. ఈ సారి మేం గెలిస్తే అమ‌రావ‌తి నుంచే పాల‌న అంటే న‌మ్మ‌డానికి ఎవ‌రి చెవుల్లో పూలు పెడుతున్న‌ట్టు??? గ‌తంలో ఏకంగా అధినేత అన్న మాట‌ల‌కే దిక్కు లేదు.. అలాంటిది ఆయ‌న నీడ ద్వారా చెప్పిస్తే మాత్రం అబ‌ద్ధం నిజ‌మై  పోతుందా? మారిన మూడు రాజధానుల మూడ్ అన్న‌ది ఎస్టాబ్లిష్మెంటు అవుద్దా!!! అంటారు స‌గ‌టు అమ‌రావ‌తి వాసులు. ఏతా వాతా దీనంత‌టినీ బ‌ట్టి  చూస్తుంటే.. ఏదో ఒక‌టి చెప్పి అధికారంలోకి వ‌చ్చేద్దామ‌ని ఫీల‌వుతున్న‌ట్టుందీ మ‌డ‌మ తిప్ప‌ని బ్యాచీ. తిప్పాల్సిన‌వ‌న్నీ తిప్పేసి ఎట్ట‌కేల‌కు తిరిగి అధికారంలోకి వ‌చ్చాక ఎడం కాలితో త‌న్న‌డం ఎలాగూ అల‌వాటైందిగా అన్న గ‌ట్టి న‌మ్మ‌కంతోనే ఇలా మాట్లాడుతున్న‌ట్టు కొడుతోంది..   ఒక‌సారి జ‌రిగిన శాస్తి చాల‌ద‌ని.. రెండో సారి కూడా తిరిగి దొంగ చేతికే తాళాలివ్వ‌డ‌మా!? ఎంత మాట.. ఎంత మాట.. అన్న కామెంట్లు అమ‌రావ‌తి మాత్ర‌మే కాదు హోల్ ఆంధ్రా అంత‌టా  వినిపిస్తూనే ఉన్నాయ్. అందుకే అనేది నీళ్ల‌లో ఉన్న ముస‌లితో, అధికారంలో లేని జ‌గ‌నుతో అస్స‌లు పెట్టుకోవ‌ద్ద‌నేద‌ని డైరెక్టుగానే అనేస్తున్నారు చాలా మంది.  

జూన్‌‌లో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం : రామ్మోహన్‌నాయుడు

  విజయనగరం భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 86 శాతం పూర్తియ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. విమానాశ్రయ నిర్మాణ పనులను ఇవాళ ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకూ జరిగిన నిర్మాణ పనులు, పూర్తి కావాల్సిన పనులు, పురోగతిపై అధికారులతో చర్చించారు. వర్షాలు కురుస్తున్నా జీఎం‌ఆర్ సంస్థ పనులు ఆపడం లేదన్నారు. వచ్చే ఏప్రిల్‌లోగా విశాఖ నుంచి  రోడ్డు కనెక్టివిటీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.   వచ్చే ఏప్రిల్ నాటికి ఈ రహదారి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే వైజాగ్ బీచ్‌ కారిడార్‌ నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే. తొలి దశలో రూ.4,592 కోట్లతో 22 ఏరో బ్రిడ్జ్‌లు, టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మిస్తున్నారు. మొత్తం 2,203 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించనున్నారు. మరోవైపు ఎయిర్‌పోర్టు ఇతరత్రా అవసరాల కోసం ఇటీవల ఏపీ ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయానికి మరో 500 ఎకరాల భూమిని అదనంగా కేటాయించింది.  

ఏపీలో 14 జిల్లాలకు నూతన ఎస్పీలు

  ఆంధ్రప్రదేశ్‌లో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలకు నూతన అధికారులను నియమించగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.  బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ రాహుల్‌ మీనా బాపట్ల- ఉమామహేశ్వర్‌ కృష్ణా- విద్యాసాగర్‌ నాయుడు నెల్లూరు- అజితా వేజెండ్ల తిరుపతి- సుబ్బరాయుడు అన్నమయ్య- ధీరజ్‌ కునుగిలి కడప- నచికేత్‌ గుంటూరు- వకుల్‌ జిందాల్‌ నంద్యాల- సునీల్‌ షెరాన్‌ విజయనగరం- ఏఆర్‌ దామోదర్‌ పల్నాడు- డి.కృష్ణారావు ప్రకాశం- హర్షవర్ధన్‌ రాజు  ప్రకాశం– హర్షవర్థన్ రాజు  చిత్తూరు – తుషార్ డూడి శ్రీ సత్యసాయి – సతీష్ కుమార్  

ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకోవాలి : ప్రధాని

    మణిపూర్ పర్యటలో భాగంగా అల్లర్ల బాధితులను  ప్రధాని మోదీ పరామర్శించారు. భారీ వర్షం కారణంగా హెలికాప్టర్ అనుమతి లభించకపోవడంతో ప్రధాని ఇంఫాల్ నుంచి 65 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణించి చురచంద్‌పూర్‌కు చేరుకున్నారు. అక్కడ పురావాస కేంద్రాలను సందర్మించి బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నారు.  బైరబీ-సైరాంగ్ కొత్త రైల్వే లైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 8,070 కోట్ల వ్యయం అయ్యింది. సవాళ్లతో కూడి కొండ ప్రాంతాల మీదుగా ఈ రైల్వే లైన్‌ను నిర్మించారు. ఈ రైల్వే లైన్‌ కింద 45 టన్నెల్స్, 55 ప్రధాన వంతెనలు, 88 చిన్న వంతెనలను కూడా నిర్మించారు. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని  దేశ ప్రగతికి మణిపూర్‌ కీలక స్తంభమని, ధైర్యవంతులు, దృఢసంకల్పానికి ప్రతీక ఈనేల అని ప్రధాని అన్నారు. ఇక్కడి కొండలు వెలకట్టలేని ప్రకృతి వరప్రసాదమని, ప్రజల కఠోర పరిశ్రమకు సంకేతాలని కొనియాడారు. మణిపూర్ ప్రజల స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. మణిపూర్‌లో నూతన ఉషోదయం ప్రారంభం కానుందని, ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకున్నారని, వారికి కేంద్రం బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. 2023లో ఘర్షణల తర్వాత రెండేళ్లకు ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు సుజాతక్క సరెండర్

  మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్​ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పశ్చిమ బెంగాల్‌లో 2011లో మృతి చెందిన అగ్రనేత కిషన్‌జీ భార్య సుజాతక్క, ఛత్తీస్‌గఢ్‌ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌ఛార్జ్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెపై 106 కేసులు నమోదు కాగా, రూ.1 కోటి రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్​జీ భార్యనే సుజాతక్క. 1984లో కిషన్‌జీని ఆమె పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఛత్తీస్​గఢ్​ సౌత్​ సబ్​ జోనల్​ బ్యూరో ఇన్​ఛార్జిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సుజాతక్క 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. ఆమె లొంగుబాటు గురించి మధ్యాహ్నం డీజీపీ జితేందర్​ మీడియాకు వివరాలను వెల్లడించనున్నారు. ఆమెతో పాటు మరికొందరు మావోయిస్టులు లొంగిపోయినట్లు సమాచారం.