హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
posted on Sep 12, 2025 @ 9:14PM
అది సాయంత్రం సమయం.. కాలనీలో అందరూ అరగుల మీద కూర్చొని ముచ్చట పెడుతున్నారు.. ఇదే సమయంలో ఒక వ్యక్తి నడుచు కుంటూ వెళ్తున్నాడు.. అతని వెంబడిస్తూ ఒక స్కూటీ వెళ్తుంది.. ఒక్కసారిగా స్కూటీ ఆగిపోయింది. ఒకరు పొడవాటి కత్తి తీసుకొని కిందికి దిగాడు.. నడుస్తున్న వ్యక్తి పైన ఒక్కసారిగా దాడి చేశాడు.. సదరు వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి కింద పడి పోయాడు.. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో చంపేశారు. ఈ సంఘటన కుషాయిగూడలో తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది.
అయితే బైక్ పై ఉన్న మరో వ్యక్తి శ్రీకాంత్ ని చంపు తుంటే అడ్డగించే ప్రయత్నం చేశాడు. అయినప్పుటికీ దుండగుడు వినిపించుకోకుండా కింద పడిపోయిన శ్రీకాంత్ ని విచక్షణ రహితంగా పొడిచి పొడిచి చంపేశాడు. అక్కడున్న స్థానికు లంతా వినోదం చూస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోవడమే కాకుండా తమ తమ ఫోన్లలో ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఇంతలో బైక్ పై ఉన్న వ్యక్తి దుండగుడిన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు.
అయితే ఆ దుండ గుడు కసితీరా శ్రీకాంత్ ని చంపిన తర్వాత నేరుగా బైక్ తీసుకొని వెళ్ళి పోయి ప్రయత్నం చేశాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అతని వెంబడించి పట్టుకుని రోడ్డు మీద కూర్చోబె ట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి శ్రీకాంత్ ని చంపిన వ్యక్తిని అప్పగించారు.. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్‌ను ఎందుకు చంపారు అనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతం పోలీసులు దుండగున్నీ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.