జూబ్లీ హిల్స్ బరిలో తెలంగాణ జాగృతి అభ్యర్థి?

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనడానికి రెడీ అయిపోరాయా? ఇప్పటి వరకూ విమర్శలు, ఆరోపణలకే పరిమితమైన కల్వకుంట్ల కవిత.. ఇక నేరుగా కదన రంగంలోకి దిగడానికి సిద్ధమైపోయారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. త్వరలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థిని రంగంలోని దించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆమె ఈ విషయంలో ఒక కార్యాచరణ ప్రణాళిక రచించినట్లు చెబుతున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ విషయంలో ఆమె కీలక నేతలతో చర్చించారని అంటున్నారు.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో సోమవారం (సెప్టెంబర్ 15) భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి మధ్యా దాదాపు అరగంట పాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ జాగృతి తరఫున కల్వకుంట్ల కవిత విష్ణువర్ధన్ రెడ్డిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థిగా రంగంలోకి దింపనున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి.  కవితతో భేటీ తరువాత విష్ణువర్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను తెలంగాణ జాగృతి అధినేత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు చెప్పారు. ఈ భేటీలో తాను కవితను పెద్దమ్మ గుడిలో దసరా ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించినట్లుచెప్పారు. తమ మధ్య రాజకీయ చర్చలేవీ జరగ లేదని పేర్కొన్నారు.  ఇలా ఉండగా త్వరలో జరగనున్న బతుకమ్మ పండుగ సందర్భంగా కవిత కొత్త పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కవిత బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తరువాత తెలంగాణ జాగృతిలో అంతర్గత విభేదాలు తలెత్తాయన్న వార్తల నేపథ్యంలో కవిత కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జాగృతి తరఫున అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీఆర్ఎస్ కు గట్టి ఝలక్ ఇవ్వాలన్నపట్టుదలతో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు.  

కలెక్టర్ల పనితీరు బాగలేకపోతే వేటే : సీఎం చంద్రబాబు

  కలెక్టర్ల పనితీరు బాగుంటేనే కొనసాగిస్తానని లేదంటే, కలెక్టర్లు అయిన సరే వేటు తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతు జిల్లా రూపు రేఖలు మార్చే అవకాశం కలెక్టర్లకు ఉంది. పాలసీ ఇవ్వడమే కాదు అమలు చేయడం ముఖ్యం పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతకు ముందు హార్డ్ వర్క్ ఉండేది. ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి. పాత కలెక్టర్లు కూడా తమ పని తీరును నిరూపించుకోవాలి అని పేర్కొన్నారు.   సర్వర్ణాంధ్ర విజన్-2047 పత్రమే అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని హూకుం జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలంటే క్షేత్రస్థాయి అనుభవమే కీలకమని ఆయన నొక్కి చెప్పారు. అధికారులకు తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇస్తూనే, పనితీరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “పనితీరు చక్కగా ఉన్న అధికారులను నేను ఎప్పుడూ మార్చలేదు.  గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు రిజర్వ్ బ్యాంక్ వంటి ఉన్నత సంస్థలకు వెళ్లారు. మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. కానీ, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడను. ప్రభుత్వం అందించే ప్రతి సేవలోనూ ప్రజల సంతృప్తే మనకు కొలమానం కావాలి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి,” అని ఆయన హెచ్చరించారు. ఈ కలెక్టర్ల సదస్సు రాష్ట్ర పాలనలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉందని చంద్రబాబు గుర్తుచేశారు.

వైసీపీలో సజ్జల సినిమా అయిపోయినట్లేనా?

సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాయిస్ సజ్జల రామకృష్షారెడ్డే. వైసీపీ అధికారంలో ఉండగా సజ్జల డిఫాక్టో సీఎంగా వ్యవహరించారు. సకల శాఖల మంత్రిగా పేరు గడించారు. ఏ శాఖకు సంబంధించైనా సరే ఆ శాఖ మంత్రికి సంబంధం లేకుండా, కనీస సమాచారం కూడా లేకుండా సజ్జల నిర్ణయాలు తీసుకునే వారు. మీడియా సమావేశాలు నిర్వహించే వారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కొంత కాలం సజ్జల మౌనం వహించినా.. ఆ తరువాత షరా మామూలే. జగన్ కుడి భుజంగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. పార్టీలో జగన్ తరువాత స్థానం సజ్జలదే అని పార్టీ శ్రేణులు కూడా చెబుతాయి. అయితే తాజాగా జగన్ దగ్గర సజ్జల సీన్ అయిపోయిందని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. ఇంత హఠాత్తుగా సజ్జలకు అంతటి మర్యాద? ఎందుకయ్యా అంటే.. పార్టీ వర్గాలు చెబుతున్నదానిని పట్టి.. ఇటీవల అమరావతి రాజధాని విషయంలో వైఎస్ జమన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అంటున్నారు పరిశీలకులు, ఐను ఇటీవల జస్జల చేసిన ప్రకటన,వ్యాఖ్యలు వైసీపీకి తీరని డ్యామేజీ చేశాయని అంటున్నారు.  ఇంతకీ ఆయన ఏమన్నారంటే..మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా  ఇక మూడు రాజధానుల మాటే ఎత్తదు? అమరావతే రాజధాని, విశాఖ కానే కాదు. జగన్ తాడేపల్లిలోనే ఉంటారు. గుంటూరు, విజయవాడల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధానికి అభివృద్ధి చేస్తారు. అని ఆయన మీడియా సమావేశంలో కుండబద్దలు కొట్టేశారు.  జగన్ అమరావతి రాజధానిక సానుకూలంగా ఉన్నారనీ, విశాఖ ఊసే ఎత్తరు అని చెప్పడం ద్వారా జగన్ హయాంలో మూడు రాజధానుల విధానం తప్పు అని ఒప్పుకోవడమే కాకుండా.. ఎలాంటి ప్రణాళికా, వ్యూహం లేకుండా కేవలం చంద్రబాబుపై కక్షతోనే ఇప్పుడు జగన్ అమరావతికి జై కొడుతున్నారన్న ప్రచారం ప్రజలలో బలంగా వెళ్లిపోయింది. అంతే కాకుండా అధికారంలో ఉన్నంత కాలం మూడు రాజధానులంటూ జగన్ కాలక్షేపం చేయడం కక్ష సాధింపుతోనే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోపం కాదని సజ్జల తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేసినట్లైంది. దీంతో జగన్ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయింది.  ఈ కారణంగానే జగన్ సజ్జలను పూర్తిగా పక్కన పెట్టేశారని అంటున్నారు. అంతే కాదు సొంత మీడియాలో కానీ, పార్టీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా సజ్జల పేరు, ఫొటో కనిపించడానికి వీల్లేదన్న ఆదేశాలు కూడా జారీ చేసినట్ల చెబుతున్నారు. అందుకే గత కొన్ని రోజులుగా జగన సొంత మీడియాతో పాటు సామాజిక మాధ్యమంలో కూడా సజ్జల నిపించడం లేదు. వినిపించడం లేదు.  

కమలం గూటికి పోతుల సునీత

మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత కమలం గూటికి చేరారు. ఆమెకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.  దాదాపు ఏడాది కిందట ఆమె వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో పోతుల సునీత తెలుగుదేశంలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో జనసేన గూటికైనా చేరుదామని ప్రయత్నించారు. అయితే ఆ పార్టీ కూడా ఆమెకు తలుపులు మూసేసింది. దీంతో గత ఏడాది కాలంలో పోతులసునీత ఏ పార్టీలోనూ లేరు.  వాస్తవానికి పోతుల సునీత తన రాజకీయ ప్రస్తానాన్ని తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభించారు. 2017లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడమే కాకుండా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలయ్యాయి.  ఆ తరువాత ఆమె వైసీపీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆమె బీజేపీలో చేరారు. తన భర్త పోతుల సురేష్ తో కలిసి కమలం కండువా కప్పుకున్నారు.   అయితే బీజేపీ వారిని పార్టీలో చేర్చుకోవడం పట్ల పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం, బీజేపీలు రాష్ట్రస్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ కూడా పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే వైసీపీలో ఉన్న సమయంలో పోతుల సునీత చంద్రబా బునాయుడు, లోకేష్, ఇతర తెలుగుదేశం నాయకులపై చేసిన విమర్శల కారణంగా ఆమెకు తెలుగుదేశం తలుపులు మూసేసింది. దీంతో ఆమె జనసేనలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే తెలుగుదేశంతో ఉన్న పొత్తు ధర్మాన్ని పాటించిన జనసేన ఆమె చేరికకు అంగీకరించలేదు. దీంతో ఇంత కాలం ఏ పార్టీలోనూ లేకుండా రాజకీయాలకు ఒకింత దూరంగా మెలిగిన పోతుల సునీత ఇప్పుడు కమలం కండువా కప్పుకుంది. రాష్ట్రంలో పొత్తులో ఉన్న రెండు పార్టీలూ కాదన్న వ్యక్తిని బీజేపీ ఎలా చేర్చుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   

రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

    తెలంగాణలో మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. మంగళవారం రాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్  ప్రకటించింది. రూ.1400 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియలో జాప్యంపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హెల్త్ మినిస్టర్ దామోదరకు లేఖలు ఇచ్చారు. గత 20 రోజులుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలపై ప్రభుత్వంతో అంతర్గత చర్చలు జరిపింది.  ఇప్పటికే చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని, ఈ పరిస్థితుల్లో సేవలు కొనసాగించడం అసాధ్యమైందని ఆసోసియేషన్ తెలిపింది. గత జనవరిలో 10 రోజుల పాటు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోగా, ఆందోళనల అనంతరం అప్పటి ఆరోగ్య మంత్రి “బకాయిలను నాలుగు నెలల్లో క్లియర్ చేస్తాం, క్రమం తప్పకుండా చెల్లింపుల కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం” అని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలు అమల్లోకి రాకపోవడంతో మరోసారి సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామని అసోసియేషన్ స్పష్టం చేసింది.  

టీటీడీకి విరాళాలు

తిరుమల తిరుపతి దేవస్థానంకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాణదానం ట్రస్ట్ కు మంగళగిరికి చెందిన మన్యం శ్రీనివాసరావు దంపతులు 20 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి ఈ విరాళం అంద చేశారు. తమ కుమార్తె మన్యం హరిత పేరున ఎస్వీ ప్రాణదాణ ట్రస్ట్ కు 10లక్షల 116 రూపాయలు, మరో కుమార్తె  మన్యం హారిక పేరు పై ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 10,00,116లు విరాళంగా అందజేశారు.  విరాళాన్ని అంద చేశారు. టీటీడీ బోర్డు సభ్యురాలు జానకీ దేవి సమక్షంలో ఈ విరాళం అందజేశారు. అన్నదాన, ప్రాణదాన ట్రస్ట్ లకు  విరాళం అందజేసిన దాతలను టీటీటీ చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. ఇలా ఉండగా బెంగళూరుకు చెందిన  టివోల్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తిరుమల శ్రీవారికి విద్యుత్ వాహనాన్ని విరాళంగా అందజేసింది. సోమవారం (సెప్టెంబర్ 15) మొంట్రా ఎలక్ట్రిక్ ఏవియేటర్ వాహనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం  అధికారులకు కంపెనీ ప్రతినిధులు అందజేశారు.  15 లక్షల 94 వేల 962 రూపాయల విలువైన ఈ వాహనానికి సోమవారం శ్రీవారి ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు వాహనం తాళాలను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో  లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు   భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

ఆక్వారైతుల రుణాలపై మారటోరియం.. కేంద్రానికి చంద్రబాబు లేఖ

  అమెరికా టారిఫ్ ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆక్వారైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సహా వాణ్యజ్య, మత్స్య శాఖ మంత్రులకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. అమెరికా టారిఫ్ ల కారణంగా ఆక్వారంగానికి పాతిక వేల కోట్ల రూపాయమల నష్టం వాటిల్లిందన్నారు. దాదాపు 50 శాతం ఎగుమతుల ఆర్డర్లు నిలిచిపోయాయన్నారు.  కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆక్వా రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని చంద్రబాబు  ఆ లేఖలలో కోరారు. ఆక్వారైతులు నష్టపోకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్రం స్పష్టమైన విధానాన్ని అవలంబించాలన్నారు. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలని కోరారు. అలాగే ఆక్వారైతుల రుణాలపై మారటోరియం విధించాలని చంద్రబాబు కేంద్ర మంత్రులను కోరారు.  

దేవాన్ష్ కు ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ పురస్కారం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్  వరల్డ్ రికార్డ్ సాధించారు. అది అలాంటిలాండ్ అంశంలో కాదు. మేధస్సుకు పదును పెట్టి ఎత్తులకు పై ఎత్తులువేసే ఛెస్ గేమ్ లో.  చెస్‌లో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను అత్యంత వేగంగా వేగంగా పరిష్కరించి మరీ ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్ గా వరల్డ్ రికార్డ్ సాధించి.. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ రికార్డు అందుకున్నాడు దేవాన్ష్.  మెదడుకు పదును పెట్టి మేథస్సును పెంచే   ఛెస్ లో  దేవాన్ష్ పిన్న వయస్సులోనే సత్తా చాటాడు.  చాటు తున్నాడు.    లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో  లోకేష్ ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ పురస్కారాన్ని అందుకున్నాడు. దేవాన్ష్ తల్లిదండ్రులు లోకేష్, బ్రహ్మణిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   దేవాన్ష్ గతంలోనే చెస్‌లో రెండు ప్రపంచ రికార్డులు సాధించారు. 7-డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1.43 సెకన్లలో పూర్తి చేశారు. అంతేకాదు, 9 చెస్ బోర్డులపై 32 పావులను 5 నిమిషాల్లో సరిగ్గా అమర్చారు.   దేవాన్ష్ 'ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్'గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు-2025 గెలుచుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మనవడికి అభినందనలు తెలిపారు. దేవాన్ష్ అతి తక్కువ సమయంలో 175 చెక్‌మేట్ పజిల్స్‌ను పరిష్కరించి  లండన్‌లో పురస్కారం అందుకున్నందుకు గర్విస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఇక నాయనమ్మ నారా భువనేశ్వరి కూడా దేవాన్ష్ ను  అభినందించి ఆశీర్వదిస్తూ ట్వీట్ చేశారు. నారా లోకేష్  అయితే దేవాన్ష్ ను అభినందిస్తూ తన లిటిల్ చాంపియన్ గా అభివర్షించారు. తల్లి బ్రహ్మణి కూడా దేవాన్ష్ పట్ల గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు.  ఇది ప్రారంభం మాత్రమే.. పెద్ద కలలు కంటూ ఉండు అంటూ పేర్కొన్నారు. 

షర్మిలతో బొత్స మాటా మంతీ.. మతలబేంటి?

విశాఖ స్టీల్ ప్లాంట్ పై విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణల భేటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందుకు ప్రధాన కారణంగా ఈ ఇరువురూ ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పక్కపక్కనే కూర్చోవడమే కాకుండా.. స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.   అన్నిటి కంటే అందరి దృష్టినీ ఆకర్షించిన విషయమేంటంటే.. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ముందుగా బొత్స సత్యనారాయణ వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికి షర్మిల వచ్చారు. సమావేశం హాల్ లోకి షర్మిల ప్రవేశించడం గమనించగానే బొత్స సత్యనారాయణ తన స్థానం నుంచి లేచి నిలబడి ఆమెను పలకరించి.. తన పక్కన ఉన్న స్థానంలో కూర్చోమని కోరారు.  దీంతో షర్మిల బొత్స పక్కనే ఉన్న స్థానంలో   కూర్చున్నారు. బొత్సతో మాట్లాడిన తరువాత.. ఆ పక్కనే ఉన్న సీపీఐ నేత రామకృష్ణను పలకరించారు.  సమావేశం ముగిసిన తర్వాత, షర్మిల బొత్సకు అన్నా వెళ్లొస్తా అని చెప్పి మరీ వెళ్లారు. ఇరువురి మధ్యా  సంభాషణ కొద్ది సేపే జరిగి ఉండొచ్చు కానీ.. ఆ కొద్ది సేపు జరిగిన భేటీయే వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో పలు ఊహాగాన సభలు జరగడానికి కారణమైంది. అందుకు కారణం లేకపోలేదు. వైసీపీ ఎకో సిస్టమ్ లో ప్రత్యర్థి పార్టీలు ఉండవు. శత్రు పార్టీలు మాత్రమే ఉంటాయి. అందులోనూ షర్మిల వైసీపీ అధినేత, స్వయానా తన సోదరుడు అయిన జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తుండటమే కాకుండా..  వైఎస్ జగన్  వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడు ఎంత మాత్రం కాదని విస్ఫష్టంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ షర్మిలతో మాటా మంతీ కలపడం కచ్చితంగా జగన్ కు నచ్చదు. ఆ సంగతి తెలిసీ బొత్స సత్యనారాయణ షర్మిలను లేచి నిలబడి మరీ పలకరించడమే కాకుండా.. స్వయంగా తన పక్కన ఉన్న స్థానంలో కూర్చోమని ఆహ్వానించి మరీ మంతనాలు పరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరిం చుకోవడమే కాకుండా, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.    

మత్స్యకారుల వలకు చిక్కిన పులిమచ్చల టేకు చేప

సముద్రం అంటేనే మత్స్య సంపదకు నిలయం. నిత్యం మత్స్యకారుల వలలకు ఎన్నో రకాల చేపలు  చిక్కుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అత్యంత అరుదైన, భారీ చేపలు కూడా మత్స్యకారుల వలలో పడుతుంటాయి. అలాంటి అరుదైన భారీ చేప కోససీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రంలో మత్స్యకారులకు చిక్కింది. ఈ చేప రూపంలోనే కాదు.. సైజులోనూ భారీయే. ఈ చేప పేరు పులి మచ్చల టేకు చేప అని మత్స్యకారులు తెలిపారు. దీని ఒంటిపై పులిమచ్చలు ఉంటాయి. దీని బరులు పది కిలోకలకు పైనే.  ఈ చేప పొట్టభాగంలోని బ్లాడర్ లో అత్యంత అరుదైన ఔషధ గుణాలు ఉండటంతో దీనిని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ చేపలు  నిత్యం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరిస్తూనే ఉంటాయి. అందుకే ఇది అప్పుడప్పుడు మత్స్యకారుల వలలకు చిక్కి వారికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంటాయి.  

న్యూయార్క్ లో145 కోట్ల రూపాయలతో భవంతిని కొనుగోలు చేసిన అపరకుబేరుడు

అపర కుబేరుడు, దేశంలోనే అత్యంత ధనవంతుడు అయిన రియలయ్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ విదేశాలలో అత్యంత  ఖరీదైన ఆస్తుల కొనుగోలులో భాగంగా తాజాగా అమెరికాలో విలాలవంతమైన భవంతిని కొనుగోలు చేశారు.  న్యూయార్క్ నగరంలోని ట్రైబెకా ప్రాంతంలో ఉన్న భవంతిని దాదాపు 17.4 మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేశారు. భారత కరెన్సీ ప్రకారం ఆ విలువ దాదాపు 145 కోట్ల రూపాయలు ఉంటుంది.  'ద రియల్ డీల్' నివేదిక ప్రకారం ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  అమెరికా విభాగం కొనుగోలుచేసింది. ఈ భవంతిని టెక్ బిలియనీర్ రాబర్ట్ పెరా 2018లో దాదాపు 20 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి, లగ్జరీ హోమ్‌గా అభివృద్ధి చేయాలని భావించారు. కానీ ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చకపోవడంతో 2021లో ఆయన దాన్ని   విక్రయానికి పెట్టారు. తాజాగా, ముకేశ్ అంబానీ కుటుంబం ఈ భవంతిని సొంతం చేసుకుంది.   బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం. ప్రస్తుతం ముకేశ్ అంబానీ  సుమారు రూ.8.2 లక్షల కోట్ల నికర ఆస్తులతో దేశంలోని అత్యంత సంపన్నుడిగా, ప్రపంచంలో సంపన్నులు జాబితాలో 18వ స్థానంలో ఉన్నారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరులు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు. సోమవారం (సెప్టెంబర్ 15) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  15 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 77 వేల 893 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 604 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కాన ుకల ఆదాయం 3 కోట్ల 53 లక్షల  రూపాయలు వచ్చింది. 

అస్సాంలో భారీ భూకంపం

   అస్సాంలో భూకంపనలు కలకలం రేపాయి. సోనిత్‌పుర్‌ జిల్లాలో రిక్టర్‌ స్కేల్‌పై 5.8 తీవ్రతగా నమోదైంది. 5.కి.మీ లోతులో ఇది సంభవించిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు స్వల్పంగా ఊగినట్టు సమాచారం.  అయితే, ఇప్పటివరకు ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, చైనాలోనూ భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిసింది. అస్సాంలోని ఇదే ప్రాంతంలో వారం క్రితం 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రధాని మోదీ ప్రస్తుతం అస్సాం పర్యటనలోనే ఉన్న విషయం తెలిసిందే.  

యోగా గురువుపై హానీ ట్రాప్...50 లక్షలు స్వాహా

  గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రంగారెడ్డి అనే వ్యక్తి యోగాశ్రమంలో యోగా గురువుగా పనిచేస్తున్నాడు. అయితే ఓ ఇద్దరు మహిళలు అనా రోగ్య సమస్యల పేరుతో రంగారెడ్డి యోగాశ్రమంలో చేరారు... అలా చేరిన ఆ ఇద్దరు మహిళలు యోగా గురువు రంగా రెడ్డితో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టారు. అయితే ఈ ఇద్దరు మహిళలు రంగా రెడ్డి తో సన్నిహితం గా ఉన్న సమయం లో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసుకు న్నారు... ఇంకేముంది మాస్టారు కాస్త హనీ ట్రాప్ లో చిక్కుకుపోయాడు. దీంతో అమర్ గ్యాంగ్ రంగంలోకి దిగి ఇద్దరు మహిళలతో యోగా గురువు రంగారెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడి యోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొద లుపెట్టారు. మేము అడిగినన్నిడబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోటోలు, వీడి యోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేశారు.  వారి బెది రింపులకు భయ పడి పోయిన యోగా గురువు రంగారెడ్డి వెంటనే వారికి 50 లక్షల రూపాయల చెక్కును ఇచ్చాడు. కొద్ది రోజులు గడి చిన అనంతరం మళ్లీ అమర్ గ్యాంగ్ యోగ గురువు రంగారెడ్డి కి ఫోన్ చేసి రెండు కోట్లు కావాలని డిమాండ్ చేశారు.... డబ్బులు త్వరగా ఇవ్వా లంటూ ప్రతిరోజు యోగా గురువుకు ఫోన్ చేసి వేధిం పులకు గురి చేస్తూ ఉన్నారు.  రోజు రోజుకీ వారి వేధింపులు మితి మీరిపోవడంతో భరించలేక యోగా గురువు రంగారెడ్డి గోల్కొండ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించిన అనంతరం అమర్ గ్యాంగ్ కీ చెందిన ఇద్దరు మహిళల తోపాటు ముగ్గురు పురుషులను... మొత్తం ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి చెక్కులు మరియు ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  

వైసీపీ ఐదేళ్ల అవినీతి పాలనకు చరమగీతం : జేపీ నడ్డా

  గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో అవినీతి రాజ్యమేలిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. వైసీపీ అవినీతి పాలనకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చరమగీతం పాడారని జేపీ నడ్డా అన్నారు. విశాఖపట్నంలో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేపట్టిన 'సారథ్యం' యాత్ర ముగింపు సభకు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2014కు ముందు దేశంలో వారసత్వ, అవినీతి రాజకీయాలు రాజ్యమేలాయి. అదే తరహాలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైంది. రాష్ట్ర ప్రజలను గత పాలకులు దారుణంగా మోసం చేశారని విమర్శించారు.  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు" అని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఏపీ మళ్లీ పునరుజ్జీవనం పొందుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' అనే నినాదంతో దేశం ముందుకు సాగుతోందని నడ్డా గుర్తుచేశారు. దశాబ్దాల నాటి అయోధ్య రామమందిర కలను సాకారం చేయడం, ట్రిపుల్ తలాక్ రద్దు, జీఎస్టీ వంటి చారిత్రక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనని ఆయన కొనియాడారు.  ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన నడ్డా, రాష్ట్రానికి కేటాయించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రస్తావించారు. సాగర్ మాల పథకం కింద 14 పోర్టుల నిర్మాణం, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం, జాతీయ రహదారుల విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తోందన్నారు. భోగాపురం విమానాశ్రయానికి రూ.625 కోట్ల నిధులు విడుదల చేశామని, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు, అమృత్ భారత్, వందే భారత్ వంటి ఆధునిక రైల్వే సేవలతో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు.ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు, మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనలతో కలిసికట్టుగా పనిచేస్తామని నడ్డ తెలిపారు.

చెస్‌లో దేవాన్ష్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ అవార్డు

  ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ అరుదైన ఘనత సాధించారు. వరల్డ్ స్థాయి అవార్డును అందుకున్నారు. ఫాస్టెస్ట్ చెక్‌మెట్ సాల్వర్‌గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను  దేవాన్ష్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లండన్‌‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో ప్రముఖుల చేతుల మీదుగా దేవాన్ష్‌ అవార్డు స్వీకరించారు. అవార్డ్ ప్రదానోత్సవానికి మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి హాజరయ్యారు .ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును దేవాన్ష్ అందుకోవడం చాలా గర్వంగా ఉందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  ఇదో ప్రత్యేకమైన ఘనతని వ్యాఖ్యానించారు. ఒక తండ్రిగా పుత్రోత్సాహం పొందుతున్నానని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అటు దేవాన్ష్ అవార్డ్ సాధించడంపై టీడీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వరల్డ్ లీడర్, ఆయన మనవడు వరల్డ్ రికార్డ్ హోల్డర్ అంటూ టీడీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. గతేడాది డిసెంబర్ నెలలో దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన విషయం తెలిసిందే. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా కేవలం తొమ్మిదేళ్ల వయస్సులోనే ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నారు. వ్యూహాత్మకమైన ఆటతీరుతో 11 నిమిషాల 59 సెకన్లలో చెక్‌మేట్ పజిల్స్‌ను దేవాన్ష్ పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.   

యూరియా కోసం క్యూ లైన్‌లో మాజీ మంత్రి

  తెలంగాణలో యూరియా కోసం రైతులు అరిగోస ప‌డుతున్నారు. నెల‌ల త‌ర‌బ‌డి కేంద్రాల చుట్టూ తిరిగిన‌ప్ప‌టికీ ఒక్క బ‌స్తా కూడా దొర‌క‌డం లేదు. దీంతో యూరియా ఇస్తార‌నే స‌మాచారం తెలిసిన వెంట‌నే కేంద్రాల‌కు వెళ్లి అర్ధ‌రాత్రి నుంచే ప‌డిగాపులు కాస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌కు కూడా యూరియా తిప్ప‌లు త‌ప్ప‌లేదు. ఆమె కూడా యూరియా కోసం క్యూలైన్‌లో గంట‌ల త‌ర‌బ‌డి వేచివున్నారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా కుర‌వి మండ‌లం పెద్ద‌తండాలో స‌త్య‌వ‌తి రాథోడ్‌కు ఐదున్న‌ర ఎక‌రాల భూమి ఉంది.  దానికోసం యూరియా బ‌స్తాల కోసం ఆమె గుండ్రాతిమ‌డుగు రైతు వేదిక వ‌ద్ద‌కు ఆదివారం నాడు వ‌చ్చారు. యూరియా బ‌స్తాల కోసం క్యూలైన్‌లో నిల్చున్నారు. తీరా ఆమె లైన్ వ‌చ్చేస‌రికి ఒక్క బ‌స్తా మాత్రమే అధికారులు ఇచ్చారు. దీనిపై మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఐదున్న‌ర ఎక‌రాల భూమికి ఒక్క బ‌స్తా మాత్ర‌మే ఎలా స‌రిపోతుంద‌ని ప్ర‌శ్నించారు.  రైతులు నాట్లు వేసి నెల దాటినా ఒక యూరియ బస్తా కోసం వారాలు తరబడి క్యూ లైన్లో ఎదురు చూడటం సిగ్గు చేటని అన్నారు. పది ఎకరాలు, ఐదు ఎకరాలు భూమి ఉన్న రైతులకు ఒక యూరియ బస్తా ఇవ్వడం దుర్మార్గమని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడ యూరియ సరఫరా చేయాలని ప్రభుత్వన్ని ఆమె డిమాండ్ చేశారు.