చేవెళ్లలో దారి దోపిడీ కలకలం
posted on Sep 12, 2025 @ 7:58PM
దారి దోపిడీ చేయడానికి పక్కగా ప్లాన్ చేశారు... అనుకున్న పథకం ప్రకారమే కారును అడ్డగించి... నానా హల్చల్ సృష్టించి చివరకు ఓ వ్యక్తి వద్ద నుండి లక్షల రూపాయల బ్యాగును దోచుకున్నారు. ఇక తమను పోలీసులు ఎవరూ పట్టుకోలేరని.... ఈ డబ్బుతో ఎంజాయ్ చేయవచ్చునని సంతోష పడుతూ వెళ్తున్న సమయం లో విధి వక్రీంచింది. కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో దుండగులు తాము ఎక్కడ పోలీసుల చేతికి చిక్కుతా మేమో నని భయపడి కారుతో పాటు కొంత డబ్బు అక్కడే వదిలేసి పారిపో యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రంగారెడ్డి జిల్లాలో ని చేవెళ్లే మండలం లోని కొత్తపల్లి గ్రామ సమీపంలో ఒక స్టీల్ వ్యాపారి తన కారు లో వెళుతున్న సమయంలో గుర్తు తెలియని కొందరు దుండగులు స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చి వెనుక నుండి ఢీ కొట్టడమే కాకుండా ముందుకు వచ్చి వ్యాపారి కారును అడ్డగించి... కారు అద్దాలు పగల గొట్టి... హంగామా సృష్టించారు. అనంతరం కారులో ఉన్న వ్యాపారి, డ్రైవర్ కళ్ళల్లో కారంపొడి కొట్టి.... వెంటనే వ్యాపారి వద్దనున్న 40 లక్షల రూపాయల బ్యాగును తీసుకొని అక్కడి నుండి పారిపో యారు.
దొంగిలించిన డబ్బుతో ఎంజాయ్ చేయ వచ్చునంటూ తెగ సంబరపడి పోతూ.. కార్‌లో అత్యంత వేగంగా వెళుతుండగా కారు ఒక్కసారి గా అదు పుతప్పి బోర్ల పడింది. దుండ గులు కారులో చిక్కుకుపోయారు. ఎలాగైనా సరే కష్టపడి కార్‌లో నుండి దుండగులు బయటికి వచ్చారు. పోలీసుల చేతికి చిక్కుతా మేమో నన్న భయంతో కారుతో పాటు కారులో కొంత డబ్బు వదిలివేసి అక్కడి నుండి మెల్లిగా జారుకున్నారు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారణం పూర్తిగా పరిశీలించగా
కారులో బొమ్మ తుపాకి తో పాటు కత్తి, కారంపొడి ఉన్నట్లు గా పోలీసులు గుర్తించారు. దుండగులు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత కారు తో పాటు కారులో 15 లక్షల రూపాయలు కూడా వదిలివేసి వెళ్లినట్లుగా పోలీ సులు గుర్తించారు. దీంతో పోలీసులు కారుతో పాటు 15 లక్షల రూపాయల ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దుండ గులను పట్టుకు నేందుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటన కు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది