అరాచక రాజ్యం .. ఖాకీ వనం
posted on Jul 15, 2022 @ 4:17PM
పోలీసు, ఆర్మీ జవాను అనగానే ఎందుకో అపారగౌరవ భావనే కలుగుతుంది. ఇటీవల సినిమాల్లోనూ పోలీస్ అధికారి అనగానే ఆయన్ను దేవుడితో సమానంగా చూపిస్తున్నారు. పోలీస్ అధికారి అమలాపురం నుంచి అమెరికా, నైజీరియా కూడా వెళ్లి డ్రగ్‌పెడ్లర్‌ను పట్టుకురావడం ఎంతో భక్తిభావనతో చూసి తరిం చాం. ఇక్కడిదాకా బాగానే వుంది. కానీ ఆ డిపార్ట్‌మెంట్‌కి మరక తెచ్చేవారూ తయారవుతున్నారు. రక్షకుడే భక్షకుడైతే వంటి కథనాలు అపుడపుడూ వింటున్నాం. మరీ దారుణమేమంటే ఇటీవల ఆ శాఖలోనూ రేపిస్టులు తయారయారు. ఇది ఎవరికీ మింగుడు పడని సంగతి. ఎవరికయినా అన్యాయం జరిగితే ముందు గుర్తొచ్చేదే పోలీసులు. ఇపుడు ఓ పోలీసాయనే అరాచకాలకు పాల్పడుతుంటే జనం ఏం కావాలి. పోలీస్ స్టేషన్ మీద నమ్మకం తగ్గితే శాఖమే పరువు నష్టం. తమ శాఖలో అలాంటి కీచకులను వారే గట్టిగా శిక్షించాలన్న నినాదాలు వినపడుతున్నాయి. చట్టాల అమలులో సామాన్య జనానికి, పోలీసులకు వేరు వేరు విధానాలు వుంటే అసలు పోలీసు శాఖను దేవుడు కూడా నమ్మడు.
రాష్ట్రంలో ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక లావా దేవీలు, స్థిరాస్తి వ్యాపారాలు, కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాలు పెరుగుతుండటంతో వాటి ద్వారా లబ్ధి పొందేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా తెలంగాణా లో జరిగిన ఉదంతాలే ఉదాహ రణ. పోలీసలు ముఖ్యంగా భూ లావాదేవీలకు సంబంధించి పోలీసులపై ఎక్కువగా ఆరోపణలు వస్తున్నా యి. అలాగే ఏదో ఓ అవసరం మీద స్టేషన్‌కు వచ్చే మహిళలను ఆకట్టుకునో, బెదిరించో లోబరుచుకుం టున్న కేసులూ పెరుగుతున్నాయి తెలంగాణలో. మొన్న నాగేశ్వరరావు, నిన్న విజయ్.. ఇప్పుడు భవానీ సేన్. ఈ మూడు కేసులూ వివాహేతర సంబంధాలకు సంబంధించినవే కావడం గమనార్హం. కానీ పోలీసు లే వేధింపులకు పాల్పడుతుండటం, వివాహేతర సంబంధాలకు పాల్పడటం అధికారులకు మింగుడు పడటంలేదు.
ఇటీవల నగర పోలీసు అధికారుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు అత్యాచారం కేసులో ఇరుక్కోగా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లపాటు సహజీవనం చేసి ఓ యువతిని మోసం చేసిన ఘటనలో మల్కాజ్‌గిరిలో సీసీఎస్ ఎస్‌ఐ విజయ్ పై కేసు నమోదైంది. అలాంటి అదికారులని కేవలం తాత్కాలికంగా సస్పెండ్ చేయడంగాకుండా విధుల నుంచి తొలగించా లని, మళ్ళీ విధు ల్లో చేరకుండా చేయాలనీ ప్రజల ఆకాంక్ష. ప్రజా సంఘాలు, మానవహక్కుల సంఘా లు, మహిళా సంఘాలు, కోర్టులు వెంటనే కేసు ని సుమోటో గా స్వీకరించి నిందితులని సత్వరమే విచా రించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ని నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి కరుడు కట్టిన నేరస్తుల విషయం లో ఉన్న చట్టాల కన్నా కొత్త చట్టాలు రూపొందించి నేరం నిరూపితమైతే, కఠిన శిక్షలు అమలు చేస్తే తప్ప అరాచకాలు ఆగ బోవని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.