ముర్మూజీ .. మీకే మా మద్దతు
posted on Jul 15, 2022 @ 3:17PM
రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించారు. వాస్తవానికి ఆమె తెలంగాణా కూడా పర్యటించాల్సి వుంది. కానీ సమయం అంతగా లేకపోవడంతో ఆమె తన పర్యటనను ఆంధ్రాతో ముగించి వెనుదిరిగారు. కాగా బీజేపీ నేత రాజా సింగ్, ఎమ్మెల్యేలు ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ గురువారం గోవా వెళ్లి ద్రౌపది ముర్ముతో సమావేశమై ఆమెకు మద్దతు ప్రకటించారు.
గిరిజనుల జనాభా గురిం చి ఆమె తెలుసుకోవాలనుకున్నారు. ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో గిరిజన జనా భా అధికంగా ఎక్కడున్న ది తనను కలిసిన తెలంగాణా నాయకుల నుంచి తెలుసుకున్నారు. ఆమె ఒరి స్సా గిరిజనుల తెగకు చెందిన వారు. గిరిజనులకు తాను భవిష్యత్తులో మేలు చేయాలని ఆశించి వుండ వచ్చు.
గురువారం తనను కలిసిన బిజెపి నాయకుల ద్వారా తెలంగాణ, ఏపీల్లో గిరిజనుల స్థితిగతులపై వివరా లు తెలుసుకునేందుకు ఆమె ఆసక్తి చూపి నట్లు సమాచారం. తెలంగాణాలో గిరిజనుల గురించి తెలం గాణా బిజెపి ఎమ్మె ల్యేలు వివరించి వారి సంక్షే మానికి తోడ్పడాలని కోరినట్టు తెలుస్తోంది.
దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తాను, ఈటల రాజేందర్ గెలిచిన తీరును ద్రౌపది ముర్ముకు వివ రించినట్లు ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెల్లడించారని తెలిసింది. తెలంగాణలో రాజకీయ పరిస్థి తులను ద్రౌపది ముర్ముకు ఎమ్మెల్యే రాజాసింగ్ వివరించారు. ఇదిలా వుండగా, అసలు ఆమె గతంలో ఝార్ఖండ్ గవర్నర్‌గా వున్నపుడు గిరిజనులకు ప్రత్యేకించి ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టలేదన్నది బిజెపీ యేతర పార్టీల ఆరోపణలు. ఏమయినప్పటికీ, ఇపుడు ప్రచారంలో భాగంగా వచ్చి ప్రత్యేకించి గిరిజనుల గురించి వాకబు చేయడం తప్పకుడా ఆమె భవిష్యత్తులో వారికి మేలు చేయా లన్న ఆలోచనలోనే వున్నట్టు అర్ధంచేసుకోవాలి.