ప్రతీ చినుకూ కాయితప్పడవల జ్ఞాపకం!
posted on Jul 15, 2022 @ 2:02PM
వర్షాకాలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో! పిల్లలందరూ ఒక్కచోట చేరి గోలగోలగా ఆడతారు. చిందులేస్తారు, డ్యాన్సులూ చేస్తారు.. తడవడంలో ఆనందానికి అంతే ఉండదు.
మన చిన్ననాటి రోజులను తిరిగి పొందేందుకు అవకాశం దొరికినప్పుడల్లా వదులుకోవడానికి ప్రయత్నిం చాలి. వర్షాకాలం బడికి వెళ్లక్కర్లేదు, తడవచ్చు, స్నేహితులతో కలిసి చిందులు వేయవచ్చు. అన్నింటి కంటే ముఖ్యం రోడ్డుమీదో, ఇంటి ఆవరణలోనో నిలిచిన నీళ్లలో కాయితం పడవల పోటీ పెట్టుకోవచ్చు. ఇదో గొప్పసరదా! వీలయినన్ని పాత నోట్‌బుక్స్ అన్నీ పడవలయిపోతాయి, ఆ పడవల్లో ఆనందపు చిను కులు మోసికెళుతూ పిల్లలని ఒక్కటి చేస్తుంటాయి ఆ చిన్నపడవలు. ఇందులోనూ ఫస్టు, సెకెండూ వుం టాయి!
తల తడుస్తుంది, బట్టలు తడుస్తాయి వెరసి ముద్దవుతారు.. దగ్గుతుంటారు, తమ్ములూ పట్టి వదలవు. కానీ ఆ చిందులు మాత్రం మానరు. చినుకుల్లో చిందులు వర్ణించలేని అనుభూతినిస్తాయి. ప్రతీ ఏడూ.. ఎన్నాళ్లయినా.. వయసు పెరిగినా.. వాటి జ్ఞాపకాల ఉపశమనానికి విలువ కట్టలేం.
మీరుచూస్తున్న ఫోటోలో ఒకే గొడుగులోకి ఆరుగురు పిల్లలు చేరి ఆడుతున్నారు. ఇలాంటి దృశ్యాలు గతం లో చూసేవుంటారు, మీరూ ఇలా చేసే వుంటారు. కానీ ఆ జ్ఞాపకాల దొంతర్లలో గడచిన బాల్యాన్ని ఒక్కసారి మనోఫలకం మీద తరచి చూసుకోవడంలో పెద్దవారికి వారి బాల్యం, స్నేహాలు, బంధుత్వాలన్నీ గుర్తొ స్తా యి. గుండె బరువెక్కుతుంది. ఆ రోజులు మళ్లీ రావని ఒక్క మాట మనసులోనే అనేసుకుంటారు. ఒక్క సారి దూరంగా వున్నవారిని పలకరించాలనిపిస్తుంది. బాల్యం ఎవరికైనా ఎప్పటికీ బంగారమే.
వర్షంలో తడవడానికి, కుసింత ఆడేందుకు వయసుతో సంబంధం లేదు. పిల్లల్ని, కుర్రాళ్లని చూసిన పెద్ద వయసువారూ ఓ క్షణం ఎవ్వరూ చూడకుండా తడవాలనో, రెండు గెంతులు గెంతాలనో అనిపిస్తుం ది. ప్రకృతి మహిమ! గ్రామాల్లో ఇప్పటికీ గొడుగుల కంటే పెద్ద పెద్ద అరిటాకుల్ని గొడుగులుగా చేసుకుని తిరుగుతూంటారు. వాటినే నెత్తిన పెట్టుకుని పరుగులు తీస్తుంటారు. గొడుగుల కంటే వాటితో పరిగెట్ట డంలో ఆనందమేమిటంటే వాస్తవానికి వారూ చెప్పలేరు. కానీ ఆ అనుభవాన్నే ఆస్వాదిస్తారు, అదే కోరు కుంటారు.