ఇది రామసేతు రాయి!
posted on Aug 2, 2022 @ 9:58AM
పిల్లాడికి పోయిందనుకున్న కొత్త పెన్సిల్ అలమార్లో దొరికింది, మరో పిల్లాడికి ఊహించనివిధంగా లెక్క ల్లో 100కి 80 వచ్చాయి, చంటిపిల్లాడిని ఏనుగు రక్షించడం, చాలా ఎత్తునుంచి ఒక వ్యక్తి పువ్వులు తీసి కెళ్తున ట్రక్కులో పడటం, చిన్నవయసులోనే అపార జ్ఞాపకశక్తి కలిగి ఉండటం. మొన్నామధ్య ఉత్తర ప్రదేశ్ అహిమాల్‌పూర్‌లో ఈతకెళ్లిన పిల్లలకి నీళ్లతో తేలుతూ ఓ రాయి కనిపించింది!
నీళ్లమీద అలా తేలుతూ కనిపించిన రాయి పిల్లల్ని భయపెట్టిన మాట వాస్తవం. ఎందుకంటే రాయి నీటిమీద అలా కాయితం పడవలా తిరగుతూ పోదుగదా! పైగా అంతా యింతా కాదు అది సుమారు ఆరు కిలోల బరువుందిట. మరో చిత్రమే మంటే దాని మీద రామ్ అని హిందీలో పెద్ద అక్షరాలు చెక్కినట్టు ఉండడం! ఇది మెయిన్‌పురి జిల్లాలోని థానా బెవార్ ప్రాంతంలోని అహి మల్‌పూర్ గ్రామస్తులే కాదు, ఈ రాయి వీడియో చూసిన నెట్‌జన్లు కూడా ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు. ఇదెలా సాధ్యం? ఎప్పుడో రామాయణ కాలంలో రామసేతు నిర్మాణం గురించి విన్నాం, చదువుతున్నాం. అది అప్పటి మాట. కానీ ఇంత అత్యా ధునిక కాలంలో ఇలా ఒక రాయి అదీ రామ్ అనే పేరు రాసి ఉన్నది తేలుతూ కనిపించడం ఊహించని వాస్తవం.
పిల్లలు ఆ రాయిని గ్రామ పెద్దల వద్దకు తీసుకెళ్లారు. రామాయణ ఇతిహాసంలో రాముడు రావణుడితో యుద్ధానికి వెళుతున్నప్పుడు నిర్మించిన వంతెన - 'రామసేతు'తో ఈ రాయి ముడిపడి ఉందని స్థానికు లు కొందరు అంటున్నారు. అవును, ఇది ఎంతో పవిత్రమైనది. ఇంట్లో పెట్టుకున్నాం. ఇది రామే శ్వరుని రాయి అని, దీని నుండి వంతెన నిర్మించబడిందని కొందరు అంటారు. ప్రతి ఒక్కరికి వారి స్వంత అభి ప్రాయాలు ఉంటాయని గ్రామ అధిపతి నితిన్ పాండే అన్నారు. ఇదిలా ఉండగా, ఈ రాయిని ఆలయా నికి సమీపంలో ప్రతిష్టించి పూజలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.