దొంగ భక్తి!
posted on Aug 10, 2022 @ 2:30PM
మనం ఏంచేస్తున్నా పైవాడు గమని స్తూనే ఉంటాడన్నది అనాదిగా ప్రవచ కులు,మతబోధకులు అంటున్న మాట. ధర్మమార్గాన నడవాలి, ధర్మచిం తనే చేయాలి. ఆ పరిధి దాటి మనిషి ఇవత లకి రాకూడదు. వస్తే దేవుడు శపిస్తాడు, నీకు తెలీకుండానే అనేకా నేక ఇబ్బందు లకు గురవుతావు. మరి తెలిసి చేసే తప్పులు దేవుడు కాయడా? ఏమో మరి కానీ జబల్సూర్ దొంగని మాత్రం దేవుడు ఏమేరకు కరుణిస్తాడో చూడాలి.
ఇతగాడి పేరు, ఊరూ సంగతి అటుంచితే అతను దొంగతనం చేయడానికి మధ్య ప్రదేశ్ జబల్పూర్‌లో ఒక గుడికి వెళ్లా డు. చుట్టూరా ఎవరూలేరు, అయినా పరికించి చూశాడు. కాస్తంత ధైర్యం తెచ్చకుని హుండీ దగ్గరికి వెళ్లాడు. కానీ అతను అమాం తం దాన్ని పగలగొట్టి సొమ్ము మూటగట్టుకుపోలేదు. ఎదురుగా అమ్మవారిని స్మరించుకున్నాడు. రెండు చేతులూ జోడిం చి తల్లీ నా తప్పు ను కాయి అని కోరుకున్నాడు. హుండీ పగలగొట్టి డబ్బులు తీసుకున్నాడు.
ఆ దేవత అలా బొమ్మలా చూస్తుండిపోయింది. తన భక్తుడు ఇంతపనిచేశాడేమిటా అనుకొనీ ఉండవచ్చు. మొత్తానికి ఆమె అపా ర కరుణామూర్తి గనుక పైకి ఏమీ అనలేదు, శూలమూ విసరలేదు. దొంగగారు హమ్మయ్య.. అనుకున్నాడు. మూట తీసుకుని బయటపడ్డాడు. కానీ దేవుడి గర్భగుడిలోనూ సిసి టీవీలు ఉంటాయన్న సంగతి పాపం ఆ పిచ్చాడికి తెలియలేదు. అదుగో వాటికి దొరికాడు.. అదీ అమ్మవారి మహత్తు! అతగాడి విన్యాసాలన్నీ సోషల్ మీడియాలో ఇపుడు చక్కర్లు కొడుతు న్నాయి. మొదటి సారే అయినా, వెధవ పని వెధవ పనేగా! పోనీలే తర్వాత తెలుసుకుంటడనేది ఉండదు.