అమెరికా నల్ల కలువ సెరీనా టెన్సిస్ కు గుడ్ బై
posted on Aug 10, 2022 @ 2:23PM
ప్రపంచ టెన్నిస్ ఆల్ టైం గ్రేట్ క్రీడామణుల్లో ఒకరైన సెరెనా విలియమ్స్… ఆ ఆటకు గుడ్ బై చెప్పేసింది. మహిళా టెన్నీస్ కే వన్నెతెచ్చిన క్రీడాకారిణిగా సెరేనాను టెన్నిస్ అభిమానులు అభివర్ణిస్తారు. పదునైన షాట్లతో, పవర్ ఫుల్ స్ట్రోక్స్ తో ఆమె ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటే ప్రేక్షకులు మైమరచిపోతారు.
23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ను తన ఖాతాలో వేసుకున్న అమెరికా క్రీడాకారిణి సెరినా విలియమ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అసంఖ్యాకమైన అభిమానులు ఉన్నారు. అటువంటి సెరీనా విలియమ్స్ టెన్నిస్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది.
రిటైర్మెంట్ ప్రకటన అని కాదు కానీ ఇక క్రీడకు దూరం అవుతున్నట్లు వివరణ ఇచ్చింది. టెన్నిస్ కు గుడ్ బై చెప్పి జీవితంలోని ఇతర పార్శ్వాల వైపు మళ్లుతున్నట్లు సెరీనా పేర్కొంది. ప్రస్తుతం టొరెంటో నేషనల్ ఓపెన్ టోర్నీ ఆడుతున్న సెరీనా వచ్చె నెలలో 41వ పడిలోకి అడుగిడ నుంది. స్వదేశంలో జరుగుతున్న టొరెంటో ఓపెన్ టోర్నీయే సెరీనా చివరి టోర్నమెంట్ అవుతుంది.