నగరిలోరోజా ...హిందూపురంలో బాలకృష్ణ ముందంజ

      సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా నగరి నుంచి ఎన్నికల బరిలో దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రోజా ఆధిక్యంలో ఉన్నారు. తన సమీప టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై ఆమె ముందంజలో కొనసాగుతున్నారు. సీమంధ్రలోటీడీపీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. * రేపల్లె, ఒంగోలులో ఆధిక్యం ప్రదర్శిస్తున్న టీడీపీ అభ్యర్థులు * హిందూపురంలో బాలకృష్ణ ముందంజ * నగరిలో వైసీపీ అభ్యర్థి రోజా ముందంజ * ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి ముందంజ * చిత్తూరు లోక్‌సభ టీడీపీ ఆధిక్యం * పెనమలూరు, మచిలీపట్నంలో టీడీపీ ఆధిక్యం. * కర్నూలు లోక్‌సభ టీడీపీ ఆధిక్యం. * బాపట్ల, నరసారావుపేటలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యం.

లీడింగ్ లో కొనసాగుతున్న ప్రముఖులు

ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆధిక్యంలో కొనసాగుతున్న ప్రముఖుల జాబిత:   వారణాసి  - నరేంద్ర మోడీ - బిజెపి రాయబరేలీ - సోనియా గాంధీ - కాంగ్రెస్ అలహాబాద్ - మురళీమనోహర్ జోషి -బిజెపి ఝాన్సీ ఉమాభారతి - బిజెపి మధర - హేమామాలిని - బిజెపి మీరట్ - నగ్మా - కాంగ్రెస్ బెంగళూరు సౌత్ - అంనతకుమార్ - బిజెపి ఫిలిబిత్ - మేనకా గాంధీ - బిజెపి నాజానంద్ గామ్ - అభిషేక్ సింగ్ - బిజెపి జ్యోతిరాధిత్య సింథియా - కాంగ్రెస్ చింద్వార - కమల్‌నాథ్ -  కాంగ్రెస్ కడప - అవినాష్ రెడ్డి  -వైఎస్ఆర్ సిపి

సార్వత్రిక ఎన్నికలు: సీమాంధ్రలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్

  సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్ శరవేగంగా జరుగుతోంది. అందరూ ఊహించినట్టుగానే సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో వుంది. సీమాంధ్ర పార్లమెంట్ స్థానాల్లో 12 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో వుంది. వైసీపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ 58 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, వైసీపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. బీజేపీ 2 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో వుంది. తెలంగాణలో పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో వుంది. కాంగ్రెస్ 10 పార్లమెంట్ స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, టీఆర్ఎస్ 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో వుంది. టీడీపీ బీజేపీ కూటమి 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో వున్నారు. తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ 53 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, కాంగ్రెస్ 22 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. టీడీపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ఎంఐఎం రెండు స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో వున్నారు.

హిందూపురంలో బాలకృష్ణ దూకుడు

      దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ పండుగ అంగరంగ వైభవంగా మొదలైంది. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ లీడ్‌లో వున్నారు. భారీ ఆధిక్యం సాధించే దిశగా దూసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది. హిందూపురం నందమూరి వంశానికి పెట్టని కోటలా వుంది. ఎన్టీఆర్ కూడా అక్కడి నుంచి పోటీ చేసి విజయాలు సాధించారు. ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తాన్న నమ్మకం అందరిలోనూ వుంది. ఇప్పుడు ఆ నమ్మకం నిజమవుతోంది. ఇప్పుడు అందరి దృష్టీ బాలకృష్ణ ఎంతటి సంచలన విజయం సాధిస్తారన్న విషయం మీదే కేంద్రీకృతమై వుంది. బాలకృష్ణ సాధించబోయే మెజారిటీ మీదే ఇప్పుడు అందరి ద‌ృష్టీ కేంద్రీక‌‌ృతమై వుంది. బాలక‌‌ృష్ణ హిందూపురం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా నిలుస్తారన్న నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

దేవుడా.. నువ్వే కాపాడాలి దేవుడా..

      దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ హడావిడి జరుగుతూ వుండగా, ప్రజలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలల పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం టెన్షన్‌తో అల్లాడిపోతున్నారు. ఓటరు దేవుడు ఎలాగూ కరుణించేశాడు. ఇప్పుడు అభ్యర్థులకు ఆకాశంలో వున్న దేవుడి అవసరం వచ్చి పడింది. దాంతో 99 శాతం మంది అభ్యర్థులు ఇప్పుడు గుళ్ళూ గోపురాల చుట్టూ తిరిగే పనిలో వున్నారు. గురువారం నాడు దేశవ్యాప్తంగా అనేకమంది అభ్యర్థులు తమ ఇష్టదేవతలకు ప్రత్యేక పూజలు చేయించడంలో బిజీగా వున్నారు. మొక్కుబడులు తీర్చకుంటున్నారు. గంటలకు గంటలు దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శుక్రవారం ఉదయం చాలామంది రాజకీయ నాయకులు తమ ఇష్టదైవాల దేవాలయాలను సందర్శించి మరోవిడత ప్రత్యేక పూజలు చేయించారు. ఆకాశంలో దేవుడు కరుణించినా, ఓటరు దేవుడి కరుణ వుంటేనే ఎవరైనా గెలిచేది.. ఆ ఓటరు దేవుడు ఎవరిని కరుణించిందీ కొద్దిసేపట్లో తెలిసిపోతుంది.    

కాకినాడ ఈవీఎంల కేంద్రం వద్ద అర్ధరాత్రి కలకలం

      కాకినాడ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఉంచిన కౌంటింగ్ కేంద్రాల దగ్గర అపరిచిత వ్యక్తులు కొన్ని ఈవీఎంలను తీసుకుని కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఒక అపరిచిత వ్యక్తి గురువారం అర్ధరాత్రి ఒక కారులో కొన్ని ఈవీఎంలను తీసుకుని కౌటింగ్ కేంద్రంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు ఆ కారును అడ్డుకున్నారు. అసలు ఈవీఎంలు బయటి నుంచి లోపలకి వెళ్ళడం ఏమిటని ప్రశ్నిచారు. అందుకు కారులో వున్న వ్యక్తి ఈవీఎంలను టెస్టింగ్ కోసం తీసుకొస్తున్నామని చెప్పాడు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎవరూ స్పందించలేదు. పోలీసులు ఆ వ్యక్తితో పాటు అతను తెచ్చిన ఈవీఎంలను, కారును స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.

రాష్ట్రంలో ఫలితాలు కాస్త ఆలస్యం.. ఎందుకంటే...

      రాష్ట్రంలో ఓట్ల లెక్కింపులో ఎన్నికల కమిషన్ ఈసారి రెండు రకాల పద్ధతులను అనుసరించనుంది. సాధారణంగా ఈవీఎంలో పోల్ అయిన ఓట్లను రెండు పద్ధతులలో లెక్కించవచ్చు. ఇంతకాలం ఒక పద్ధతిని అనుసరించి ఓట్లను లెక్కిస్తూ వస్తున్నారు. అంటే, ఈవీఎంని బ్యాలెట్ యూనిట్ అనే పరికరానికి అనుసంధానం చేస్తే సదరు ఈవీఎంలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయో తెలుస్తుంది. అలాగే ప్రింటర్ అండ్ ఆగ్జిలరీ యూనిట్ అనే పద్ధతిలో కూడా ఓట్లను లెక్కించవచ్చు. ఎన్నికల కమిషన్ మొదటి నుంచీ బ్యాలెట్ యూనిట్ ద్వారా కౌంటింగ్ జరుపుతోంది. అయితే ఈవీఎంల పనితీరు, కొంతమంది సిబ్బంది కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరించినట్టు అనుమానాలు రావడంతో ఈసారి ఓట్లను పై రెండు పద్ధతులలోనూ లెక్కించాలని, రెండు పద్ధతులలో ఓట్లు సరిపోలిన పక్షంలోనే ఫలితం ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘాన్ని కోరారు. దానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ఆమోదం తెలిపారు. దాంతో రాష్ట్రంలో ప్రతి ఈవీఎంలోని ఓట్లను రెండు పద్ధతులలో లెక్కించాక మాత్రమే ఫలితాన్ని ప్రకటిస్తారు. దీనివల్ల రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల ప్రకటన కొంత ఆలస్యంగా జరిగే అవకాశం వుందని తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా 989 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

      దేశవ్యాప్తంగా ఓట్ల కౌటింగ్ కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలలో 543 నియోజకవర్గాలకు రికార్డు స్థాయిలో 66.38 శాతం పోలింగ్ నమోదైంది. 543 లోక్‌సభ స్థానాలకు 8,251 మంది అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. కౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య దేశవ్యాప్తంగా 989 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చూసేందుకు ఎన్నికల కమిషన్ అన్ని కౌంటింగ్ టేబుళ్ల వద్ద సూక్ష్మ పరిశీలకులను నియమించింది. 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్‌లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు అరగంట సమయం పడుతుంది. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు: అనకాపల్లి తొలి.. మల్కాజిగిరి చివరి..

      దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పార్లమెంట్ స్థానాల్లో అనకాపల్లి నియోజకవర్గం ఫలితం ముందుగా వచ్చే అవకాశముంది. అనకాపల్లి లోక్‌సభ స్థానం కౌంటింగ్ 18 రౌండ్లలోనే పూర్తి కానుంది. అనకాపల్లి ఎంపీ స్థానానికి 8 మంది పోటీలో ఉన్నారు. అలాగే ఓటర్ల పరంగా దేశంలో అతిపెద్ద నియోజకవర్గంగా గుర్తింపు పొందిన మల్కాజ్గిరి ఎంపీ స్థానం ఫలితం ఆఖరున వెలువడనుంది. ఈ నియోజకవర్గంలో 45 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగనుంది. ఇక్కడ దాదాపు 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

కరీంనగర్ జిల్లాలో పోటీలో వున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

    1. కోరుట్ల - కొమిరెడ్డి రాములు (కాంగ్రెస్/సీపీఐ) - కె.విద్యాసాగర్ రావు (తెరాస) - సురభి భూంరావు (బీజేపీ) 2. జగిత్యాల - టి.జీవన్ రెడ్డి (కాంగ్రెస్/సీపీఐ) - ఎం.సంజయ్ కుమార్ (తెరాస) - ఎల్.రమణ (టీడీపీ/బీజేపీ) 3. ధర్మపురి (ఎస్సీ) - ఎ.లక్ష్మణ్ కుమార్ (కాంగ్రెస్/సీపీఐ) - కొప్పుల ఈశ్వర్ (తెరాస) - కన్నం అంజయ్య (బీజేపీ) 4. రామగుండం - బాబర్ సలీమ్ పాషా(కాంగ్రెస్/సీపీఐ) - ఎస్.సత్యనారాయణ (తెరాస) - గుజ్జుల రామకృష్ణారెడ్డి (బీజేపీ) 5. మంథని - డి.శ్రీధర్ బాబు(కాంగ్రెస్/సీపీఐ) - పుట్ట మధు (తెరాస) - కర్రు నాగయ్య (టీడీపీ/బీజేపీ) 6. పెద్దపల్లి - భాను ప్రసాద్ రావు(కాంగ్రెస్/సీపీఐ) - డి.మనోహర రెడ్డి(తెరాస) - సీహెచ్. విజయరమణారావు (టీడీపీ/బీజేపీ) 7. కరీంనగర్ - సి.లక్ష్మీనరసింహారావు (కాంగ్రెస్/సీపీఐ) - గంగుల కమలాకర్ (తెరాస) - బండి సంజయ్ (బీజేపీ) 8. చొప్పదండి (ఎస్సీ) - సుద్దాల దేవయ్య (కాంగ్రెస్/సీపీఐ) - బోడిగ శోభ (తెరాస) - మేడిపల్లి సత్యం (టీడీపీ/బీజేపీ) 9. వేములవాడ - బి.వెంకటేశ్వర్లు(కాంగ్రెస్/సీపీఐ) - సి.హెచ్. రమేష్ బాబు (తెరాస) - ఆది శ్రీనివాస్ (బీజేపీ) 10. సిరిసిల్ల - కె.రవీందర్ రావు (కాంగ్రెస్/సీపీఐ) - కె.తారకరామారావు (తెరాస) - ఎ.విజయ (బీజేపీ) 11. మానకొండూర్ (ఎస్సీ) - ఆరేపల్లి మోహన్(కాంగ్రెస్/సీపీఐ) - రసమయి బాలకిషన్ (తెరాస) - కె.సత్యనారాయణ (టీడీపీ/బీజేపీ) 12. హుజూరాబాద్ - కె.సుదర్శన్ రెడ్డి(కాంగ్రెస్/సీపీఐ) - ఈటెల రాజేందర్ (తెరాస) - ముద్దసాని కశ్యపురెడ్డి (టీడీపీ/బీజేపీ) 13. హుస్నాబాద్ - ప్రవీణ్ రెడ్డి(కాంగ్రెస్/సీపీఐ) - వి.సతీష్ కుమార్ (తెరాస) - డి.శ్రీనివాసరావు (బీజేపీ)