సీమాంధ్ర ఎంపీటీసీ ఫలితాలు: టిడిపి ప్రభంజనం

      స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను బట్టి సీమాంధ్రలో టీడీపీ పార్టీ ముందంజలో ఉంది. సైకిల్‌ జోరుకు హస్తం పార్టీ, వైకాపా విలవిల లాడాయి. సీమాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లా పరిషత్తులను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ కౌంటింగ్‌ ప్రారంభమైంది మొదలు తొలి రౌండ్‌ నుండే దూసుకు పోయింది. సీమాంధ్ర జిల్లాల వారీగా బుదవారం ఉదయం 10:30నిమిషాలకి వివిధ పార్టీలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఇలా వున్నాయి.   1. శ్రీకాకుళం: కాంగ్రెస్ (7), తెలుగుదేశం (362), వైసీపీ (270), ఇతరులు (36) 2. విజయనగరం: కాంగ్రెస్ (40), తెలుగుదేశం (245), వైకాపా (155), ఇతరులు (20) 3. విశాఖపట్నం: కాంగ్రెస్ (11), తెలుగుదేశం (324), వైకాపా (241), ఇతరులు (49) 4. తూర్పు గోదావరి: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (516), వైకాపా (3030, ఇతరులు (52) 5. పశ్చిమ గోదావరి: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (587), వైకాపా (237), ఇతరులు (65) 6. కృష్ణ: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (458), వైకాపా (324), ఇతరులు (31) 7. గుంటూరు: కాంగ్రెస్ (4), తెలుగుదేశం (469), వైకాపా (409), ఇతరులు (39) 8. ప్రకాశం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (358), వైకాపా (386), ఇతరులు (39) 9. నెల్లూరు: కాంగ్రెస్ (15), తెలుగుదేశం (228), వైకాపా (306), ఇతరులు (34) 10. చిత్తూరు: కాంగ్రెస్ (3), తెలుగుదేశం (431), వైకాపా (333), ఇతరులు (36) 11. కడప: కాంగ్రెస్ (9), తెలుగుదేశం (194), వైకాపా (348), ఇతరులు (8) 12. కర్నూలు: కాంగ్రెస్ (41), తెలుగుదేశం (339), వైకాపా (390), ఇతరులు (45) 13. అనంతపురం: కాంగ్రెస్ (3), తెలుగుదేశం (506), వైకాపా (275), ఇతరులు (13) మొత్తం స్థానాలు: కాంగ్రెస్: 139, తెలుగుదేశం: 5017, వైకాపా: 3977, ఇతరులు: 459

సీమాంధ్ర, తెలంగాణల్లో పార్టీలకు జడ్పీటీసీ స్థానాలు

      జడ్పీటీసీ ఫలితాలల్లో సీమాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో వివిధ పార్టీలకు లభించిన జడ్పీటీసీ స్థానాల వివరాలు. సీమాంధ్ర.... 1. శ్రీకాకుళం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (3), వైకాపా (3), ఇతరులు (0) 2. విజయనగరం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (0), వైకాపా (0), ఇతరులు (0) 3. విశాఖపట్నం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (1), వైకాపా (1), ఇతరులు (0) 4. తూర్పు గోదావరి: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (2), వైకాపా (0), ఇతరులు (0) 5. పశ్చిమ గోదావరి: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (5), వైకాపా (0), ఇతరులు (0) 6. కృష్ణా: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (0), వైకాపా (2), ఇతరులు (0) 7. గుంటూరు: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (2), వైకాపా (1), ఇతరులు (0) 8. ప్రకాశం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (13), వైకాపా (16), ఇతరులు (0) 9. నెల్లూరు: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (2), వైకాపా (1), ఇతరులు (0) 10. చిత్తూరు: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (2), వైకాపా (2), ఇతరులు (0) 11. కడప: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (2), వైకాపా (4), ఇతరులు (0) 12. కర్నూలు: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (0), వైకాపా (1), ఇతరులు (1) 13. అనంతపురం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (2), వైకాపా (0), ఇతరులు (1) మొత్తం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (34), వైకాపా (31), ఇతరులు (2) తెలంగాణ.... 1. ఆదిలాబాద్: కాంగ్రెస్ (9), తెలుగుదేశం (2), తెరాస (26), ఇతరులు (2) 2. కరీంనగర్: కాంగ్రెస్ (14), తెలుగుదేశం (1), తెరాస (33), ఇతరులు 0() 3. వరంగల్: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (0), తెరాస (3), ఇతరులు (0) 4. ఖమ్మం: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (1), తెరాస (0), ఇతరులు (1) 5. నల్గొండ: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (0), తెరాస (2), ఇతరులు (0) 6. నిజామాబాద్: కాంగ్రెస్ (12), తెలుగుదేశం (0), తెరాస (24), ఇతరులు (0) 7. మెదక్: కాంగ్రెస్ (6), తెలుగుదేశం (3), తెరాస (10), ఇతరులు (0) 8. రంగారెడ్డి: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (1), తెరాస (0), ఇతరులు (0) 9. మహబూబ్‌నగర్: కాంగ్రెస్ (3), తెలుగుదేశం (1), తెరాస (1), ఇతరులు (0) మొత్తం: కాంగ్రెస్ (49), తెలుగుదేశం (9), తెరాస (99), ఇతరులు (3)

ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజల్ట్స్: తెలంగాణ జిల్లాలు

      తెలంగాణ జిల్లాల వారీగా ఎంపీటీసీ కౌంటింగ్ చకచకాల జరుగుతోంది. తెలంగాణ జిల్లాల వారీగా సాయంత్రం ఏడుగంటలకి వివిధ పార్టీలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఇలా వున్నాయి.   1. ఆదిలాబాద్: కాంగ్రెస్ (137), తెలుగుదేశం (58), తెరాస (236), ఇతరులు (99) 2. కరీంనగర్: కాంగ్రెస్ (207), తెలుగుదేశం (26), తెరాస (254), ఇతరులు (99) 3. వరంగల్: కాంగ్రెస్ (80), తెలుగుదేశం (39), తెరాస (76), ఇతరులు (24) 4. ఖమ్మం: కాంగ్రెస్ (52), తెలుగుదేశం (160), తెరాస (1), ఇతరులు (164) 5. నల్గొండ: కాంగ్రెస్ (206), తెలుగుదేశం (69), తెరాస (67), ఇతరులు (101) 6. నిజామాబాద్: కాంగ్రెస్ (158), తెలుగుదేశం (19), తెరాస (147), ఇతరులు (58) 7. మెదక్: కాంగ్రెస్ (142), తెలుగుదేశం (40), తెరాస (118), ఇతరులు (31) 8. రంగారెడ్డి: కాంగ్రెస్ (194), తెలుగుదేశం (111), తెరాస (114), ఇతరులు (109) 9. మహబూబ్ నగర్: కాంగ్రెస్ (162), తెలుగుదేశం (74), తెరాస (102), ఇతరులు (52) మొత్తం స్థానాలు: కాంగ్రెస్: 1338, తెలుగుదేశం: 596, తెరాస: 1115, ఇతరులు:735 .  

సీమాంధ్ర ఎంపీటీసీ తాజా ఫలితాల వివరాలు

      సీమాంధ్ర జిల్లాల వారీగా ఎంపీటీసీ కౌంటింగ్ చకచకాల జరుగుతోంది. సీమాంధ్ర జిల్లాల వారీగా సాయంత్రం ఏడుగంటలకి వివిధ పార్టీలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఇలా వున్నాయి.   1. శ్రీకాకుళం: కాంగ్రెస్ (4), తెలుగుదేశం (232), వైసీపీ (146), ఇతరులు (27) 2. విజయనగరం: కాంగ్రెస్ (12), తెలుగుదేశం (69), వైకాపా (52), ఇతరులు (5) 3. విశాఖపట్నం: కాంగ్రెస్ (5), తెలుగుదేశం (138), వైకాపా (98), ఇతరులు (22) 4. తూర్పు గోదావరి: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (258), వైకాపా (155), ఇతరులు (35) 5. పశ్చిమ గోదావరి: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (306), వైకాపా (128), ఇతరులు (37) 6. కృష్ణ: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (285), వైకాపా (177), ఇతరులు (23) 7. గుంటూరు: కాంగ్రెస్ (4), తెలుగుదేశం (348), వైకాపా (306), ఇతరులు (23) 8. ప్రకాశం: కాంగ్రెస్ (0), తెలుగుదేశం (352), వైకాపా (382), ఇతరులు (39) 9. నెల్లూరు: కాంగ్రెస్ (4), తెలుగుదేశం (97), వైకాపా (128), ఇతరులు (16) 10. చిత్తూరు: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (161), వైకాపా (125), ఇతరులు (10) 11. కడప: కాంగ్రెస్ (3), తెలుగుదేశం (154), వైకాపా (183), ఇతరులు (4) 12. కర్నూలు: కాంగ్రెస్ (25), తెలుగుదేశం (186), వైకాపా (243), ఇతరులు (26) 13. అనంతపురం: కాంగ్రెస్ (1), తెలుగుదేశం (240), వైకాపా (126), ఇతరులు (10) మొత్తం స్థానాలు: కాంగ్రెస్: 64, తెలుగుదేశం: 2826, వైకాపా: 2249, ఇతరులు: 277

సామాను సర్దుకుంటున్న ప్రధాని మన్మోహన్

      దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇంకో నాలుగు రోజుల్లో ప్రధాని సీటు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రధాని అధికార నివాసాన్ని ఖాళీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా మన్మోహన్ సింగ్‌కి చెందిన వ్యక్తిగత సామాను కూడా మూటగట్టి రెడీగా వుంచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ తన కార్యాలయంలో తన వ్యక్తిగత సిబ్బందితో వీడ్కోలు సమావేశం జరిపారు. ఈ సమావేశంలో 110 మంది ప్రధాని వ్యక్తిగత సహాయ సిబ్బంది, 400 మంది కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వీరందరిని మన్మోహన్ వ్యక్తిగతంగా కలసి తనతో కలసి పనిచేసినందుకు థాంక్స్ చెప్పారు. ప్రధాని కార్యలయం సిబ్బంది కరతాళ ధ్వనులతో మన్మోహన్‌కి వీడ్కోలు పలికారు. మన్మోహన్‌ సింగ్ శనివారం నాడు తన చిట్టచివరి కేబినెట్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్రపతిని కలిసి, అనంతరం దేశ ప్రజలని ఉద్దేశించి ప్రసంగించి, ఆ తర్వాత కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తూ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటారు.

కారుబాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన బాగ్దాద్.. 19 మంది మ‌ృతి

      ఇరాక్ రాజధాని బాగ్దాద్‌ బాంబు పేలుళ్ళ రాజధానిగా మారిపోయింది. ఎప్పుడు చూసినా బాంబు పేలుళ్ళు జరుగుతూనే వుంటాయి. మంగళవారం నాడు బాగ్దాద్‌లో జరిగిన ఒక కారు బాంబు పేలుడు 19 మందిని బలి తీసుకుంది. బాగ్దాద్‌లోని సదర్, జమిలి, తూర్పు బాగ్దాద్, డౌన్ టౌన్ బాగ్దాద్, ఉర్.. ఇలా మొత్తం ఐదు ప్రాంతాల్లో కారు బాంబు పేలుళ్ళు వరుసగా ఒకదాని తర్వాత మరొకటి జరగడంతో బాగ్దాద్ మొత్తం బాంబు పేలుళ్ళతో అదిరిపోయింది. ఈ పేలుళ్ళలో 19 మంది అక్కడికక్కడే మరణించగా, 49 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. షియా వర్గానికి చెందిన ముస్లింలు వారి మతపెద్ద ఇమామ్ అలీ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ వుండగా అవే ప్రదేశాలలో కారు బాంబులు పేలాయి. ఈ పేలుళ్ళ వెనుక తీవ్రవాదుల హస్తం వుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇజ్రాయిల్ మాజీ ప్రధానిని లోపలేశారు

      చేతికొచ్చినట్టు అవినీతికి పాల్పడిన ఇజ్రాయిల్ మాజీ ప్రధాని యెహుద్ ఒల్మర్టకి టెల్‌ ఇజ్రాయిల్ చట్టాలకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ అవినీతి తిమింగలం జెరూసలెం మేయర్‌గా, ఇజ్రాయిల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా వున్న సమయంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అలాగే జెరూసలెంలో కూడా రియల్ ఎస్టేట్ కుంభకోణంలో కూడా ఈ సార్ హస్తం వుందట. యెహుద్ అవినీతి భాగోతం అంతా 2009లో బయటపడింది. అప్పటికి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి హోదాలో అధికారం వెలగబెడుతున్న ఈ పెద్దమనిషి ప్రధాని పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అవినీతి మీద సుదీర్ఘ విచారణ జరిగింది. చిట్ట చివరికి ఆయనని కరుడుగట్టిన అవినీతిపరుడిగా తీర్మానించి ఆరేళ్ళు జైలు శిక్ష విధించారు. తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఇజ్రాయిల్ దేశంలో ఈ అవినీతి తిమింగలాన్ని తిట్టుకోనివాళ్ళే లేరు. ఇతగాడికి ఆరేళ్ళు జైలుశిక్ష పడటం ఇజ్రాయిల్ జనాలకి ఎంతో సంతోషం కలిగిస్తోంది. అయితే ఇంత జరిగినా యెహుద్ ప్రశాంతంగా జైల్లో కూర్చుంటానని అనడం లేదు. తనకు పడిన శిక్ష మీద పై కోర్టుకు అప్పీలు చేసుకుంటానని చెబుతున్నాడు. ఇలాంటి వ్యవహారాల్లో బాగానే ముదిరినట్టున్నాడు.

ట్విట్టర్‌ అకౌంట్ వుందా? మీకో శుభవార్త...

  ఈరోజుల్లో ట్విట్టర్ అకౌంట్ లేనివారు చాలా తక్కువ. ట్విట్టర్ వల్ల ఎన్నో ఉపయోగాలనున్నాయి. అలాగే కొన్ని తలనొప్పులు కూడా వున్నాయి. ట్విట్టర్ అకౌంట్లో ఒక్కోసారి మనకి ఇష్టంలేని ట్విట్‌లు పదేపదే మన వాల్ మీద ప్రత్యక్షమవుతూ చిరాకు తెప్పిస్తూ వుంటాయి. ఫేస్‌బుక్‌లో మాదిరిగా వాటిని అన్ ఫ్లో చేసే అవకాశం ఇప్పటి వరకూ లేకపోవడం వల్ల ట్విట్టర్ అకౌంట్ ఉపయోగించేవారు ఇబ్బందిపడేవారు. ఈ ఇబ్బందిని గ్రహించిన ట్విట్టర్ సంస్థ ఇప్పుడు ‘మ్యూట్ బటన్’ ఆప్షన్‌ని ప్రవేశపెట్టింది. వద్దన్నా వచ్చే ట్విట్‌లను ఈ ఆప్షన్ ద్వారా నిలిపేయొచ్చు. మన అకౌంట్‌ని ఫాలో అయ్యేవారి ట్విట్‌లను ఈ ఆప్షన్ ద్వారా తాత్కాలికంగా బ్లాక్ చేయొచ్చు. మనకు కావలసినంతకాలం మనకు ఇష్టంలేని అకౌంట్లను మ్యూట్‌లో పెట్టొచ్చు. మళ్ళీ అవసరం అనుకుంటే అన్ మ్యూట్ చేస్తే సదరు అకౌంట్ల నుంచి మళ్ళీ మనకి ట్విట్‌లు వస్తూ వుంటాయి. ట్విట్టరోళ్ళు భలే మంచి పని చేశారు కదూ!

ఎనిమిది మందిని మింగేసిన రోడ్డు ప్రమాదం

    ఉత్తర ప్రదేశ్‌లోని నాన్ పురా సమీపంలో వున్న బేచాయ్‌పురా గ్రామంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ముక్కుపచ్చలారని చిన్నపిల్లలతో సహా ఎనిమిది మంది మరణించారు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపై నుంచి ఒక జీపు వేగంగా దూసుకుని వెళ్ళడంతో ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న దుర్మా్ర్గపు డ్రైవర్‌కి కూడా ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. తప్పతాగి వున్న డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా జీపును నడపటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

మళ్ళీ దాడులు మొదలెట్టిన జగన్ పార్టీ

      ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు, నాయకుల మీద దాడులు చేసే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేటెంటు హక్కులు పొందినట్టుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద నిర్విరామంగా దాడులు చేస్తూనే వుంది. మొన్నటి వరకూ ఎన్నికల సందర్భంగా విపరీతంగా దాడులు చేసింది. పోలింగ్ జరిగే రోజుల్లో కూడా వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసి చావబాదారు. సాక్షాత్తూ టీడీపీ ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు మీదే దాడిచేశారంటే పరిస్థితి ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవచ్చు. పోలింగ్ ముగిసింది కదా, ఇక వైసీపీ దాడులు వుండవులే అనుకున్నవారికి షాకిస్తూ జగన్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం నాయకుల మీద దాడులు ప్రారంభించారు. మంగళవారం రోజున గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరిపాలెంలో వైకాపా కార్యకర్తలు విశ్వరూపం చూపించారు. తెలుగుదేశం కార్యకర్తకి చెందిన హోటల్‌ని తగులబెట్టారు.హోటల్ తగలబడిపోవడంతోపాటు ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలావుంటే, రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లాలలో తెలుగుదేశం నాయకుడి హత్య వెనుక ఎవరున్నారో బయటపడాల్సి వుంది.

సింగపూర్‌లో టాయ్‌లెట్ సీట్లో పాము

      మన రాజకీయ నాయకులు సీమాంధ్రని సింగపూర్‌లా చేసేస్తామని చెబుతూ వుంటారు. సింగపూర్ చాలా మోడ్రన్ అనే ఉద్దేశంతో అలా అంటూ వుంటారు. సింగపూర్‌లో జరిగిన ఈ సంఘటన గురించి చదివితే సింగపూర్ ఇంకా డెవలప్ కావల్సింది చాలా వుందని అర్థమవుతుంది. సింగపూర్‌లోని ఓ హైక్లాస్ ఏరియాలో ఒక హైక్లాస్ ఇంట్లో ఆ ఇంటి ఓనరమ్మ టాయ్‌లెట్‌లోకి వెళ్ళింది. ఆమె టాయ్‌లెట్‌లోకి అలా వెళ్ళిందో లేదో ఇలా టాయ్‌లెట్ సీట్లోంచి ఒక పాము సర్రుమని బయటకి వచ్చి ఆమె కాలుమీద కసిదీరా కాటేసింది. మళ్ళీ టాయ్‌లెట్‌ సీట్లోకి వెళ్ళి లోపల సెటిలైంది. పాముకాటుకి గురైన మహిళ లబోదిబోమని టాయ్‌లెట్‌లోనుంచి బయటికి పరుగెత్తి ఇంట్లోవాళ్ళకి అసలు విషయం చెప్పి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ ఇంట్లోవాళ్ళలో కొంతమంది ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్తే, మరికొందరు టాయ్‌లెట్ సీట్లో రెస్ట్ తీసుకుంటున్న పాముగారిని చావబాది అవతల పారేశారు. పాముకాటుకి గురైన మహిళ అదృష్టం బాగుండి ప్రాణాపాయం నుంచి బయటపడింది.

కారు డ్రైవర్ కాదు.. కామ పిశాచి!

      విదేశీ మహిళా పర్యాటకులు కారు డ్రైవర్ల బారిన పడటం మన దేశంలో మామూలైపోయింది. ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. భారతదేశాన్ని చూడటానికి ఒంటరిగా వచ్చిన ఒక మహిళ మీద ఢిల్లీ పరిసరాల్లో ఒక కారు డ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. అమెరికన్ పర్యాటకురాలు ఢిల్లీ నుంచి రుషీకేశ్‌‌కి వెళ్ళాలని అనుకుంది. ఒక కారును మాట్లాడుకుంది. అయితే కారు న్యూఢిల్లీ దాటి న్యూఢిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారి మీదకి ప్రవేశించిన తర్వాత సమయ్ సింగ్ అనే సదరు కారు డ్రైవర్‌లోని కామ పిశాచి కళ్ళు తెరిచాడు. ఆమెపై కారులోనే అత్యాచారానికి ప్రయత్నించాడు. కారు డ్రైవర్ని తీవ్రంగా ప్రతిఘటించిన ఆ అమెరికా మహిళ అక్కడి నుంచి తప్పించుకుని మరో కారులో రిషీకేశ్ వెళ్ళి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సమయ్‌సింగ్‌ని అరెస్టు చేశారు.

ఎంపీటీసీ కౌంటింగ్ సిబ్బందికి తేనెటీగల కాటు

  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల కౌంటింగ్‌లో సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఓట్ల కౌంటింగ్ చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక, కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు శ్రీకాకుళం జిల్లా పలాసలోని కౌంటింగ్ కేంద్రం సిబ్బందికి మరో కొత్త సమస్య వచ్చి పడింది. పలాస కౌంటింగ్ కేంద్రంపైకి తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల కుట్టుడు ధాటికి ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు మరో 20 మంది గాయపడ్డారు. తేనేటీగల బారిన పడి ముఖాలు వాచిపోయిన వారిని అధికారులు స్థానికుల సహయంతో ఆసుపత్రికి తరలించారు. తేనెటీగల గుంపు వస్తున్న విషయాన్ని గమనించి పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది వెంటనే తలుపులు మూసివేశారు. టూ లేట్.. అప్పటికే తేనెటీగలు భారీగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాయి. కనిపించిన వారిని కనిపించినట్టు కుట్టిపెట్టాయి.

ఆమె ఎంపీటీసీగా గెలిచింది.. కానీ మృత్యువు ఓడించింది

      విధి బలీయమైనదంటారు. ఈ మాటకు మరో ఉదాహరణగా నిలిచే సంఘటన ఈ ఎన్నికల సందర్భంగా జరిగింది. విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం కమ్మంగుల ఎంపీటీసీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున చిలుకమ్మ అనే మహిళ పోటీ చేసింది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత ఏప్రిల్ 21న చిలుకమ్మ అనారోగ్యంతో మరణించింది. ఇప్పుడు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో చిలుకమ్మ ఎంపీటీసీగా విజయం సాధించింది. ఎవరైనా ఎన్నికలలో విజయం సాధిస్తే ఆ అభ్యర్థి కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అయితే చిలుకమ్మ గెలిచిన విషయం తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులు బాధతో విలపిస్తున్నారు. చిలుకమ్మ బతికి వుంటే ఎంత సంతోషించేదో అని విలపిస్తున్నారు.

తెలంగాణలో తగ్గిన కారు జోరు

      రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తెలంగాణ ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రారంభించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగులో వుంది. ఆ తర్వాత చాలాసేపు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగింది. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత అనూహ్యంగా టీఆర్ఎస్ ముందుకు దూసుకువచ్చింది. కాంగ్రెస్ పార్టీని అధిగమించి ముందుముందుకి వెళ్ళిపోయింది. మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో పరాభవం పొందిన టీఆర్ఎస్ స్థానిక ఎన్నికలలో ప్రతీకారం తీర్చుకోబోతోందా అనే సందేహాలు కలిగాయి. అయితే మధ్యాహ్నం రెండున్నర తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీ పైచేయి సాధించింది. కాంగ్రెస్ పార్టీ 460 ఎంపీటీసీ స్థానాలతో మొదటి స్థానంలో వుండగా, టీఆర్ఎస్ 427 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. తెలుగుదేశం పార్టీ 183 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది.

ఎగ్జిట్ పోల్ సర్వేలు: ఛీ కొట్టిన కాంగ్రెస్

      సోమవారం నాడు వివిధ జాతీయ ఛానల్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయే అధికారంలోకి రాబోతోందని, యుపిఎ దుకాణం సర్దేయబోతోందన్న ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. దేశంలో 80 కోట్ల మంది ఓటర్లు వుంటే కేవలం లక్షమంది అభిప్రాయాలు కనుక్కుని ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ దేశంలోని ఓటర్లందరి మనోభావాలను ఎలా ప్రతిఫలిస్తాయని దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఈనెల 16వ తేదీన విడుదలయ్యేవే నిజమైన రిజల్ట్స్ అని దిగ్విజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు షకీల్ అహ్మద్ కూడా ఎగ్జిట్ పోల్స్ మీద స్పందించారు. 2004, 2009 సంవత్సరాల్లో కూడా ఇలాగే కాంగ్రెస్ వ్యతిరేక సర్వేలు ఇచ్చారని.. ఆ రెండు ఎన్నికలలోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆయన గుర్తు చేశారు.

ఆస్పత్రిలో పేషెంట్ల మధ్య గొడవ.. ఒకరి మృతి

      ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లు ఎక్కడైనా బాధపడుతూ, నీర్సంగా వుంటారు. తమ వ్యాధులకు చికిత్స పొందడం మినహా మిగతా విషయాలను పేషెంట్లు పట్టించుకోరు. అయితే బొంబాయిలోని బాంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లలో కొందరు ఒకరితో మరొకరు గొడవపడి దారుణంగా కొట్టుకున్నారు. అసలే పేషెంట్లు కావడం వల్ల ఒక పెషెంట్ మరణించాడు. ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షహబుద్దీన్ తాలూక్ దార్ అనే వృద్ధుడు తన వార్డులోనే వున్న మరో ముగ్గురు వృద్ధ పేషెంట్లతో గొడవపడ్డాడు. దాంతో ఆ ముగ్గురు ముసలోళ్ళు కలిసి ఈ ముసలోడిని చావబాదారు. ఈ ముసలాయన కూడా తిరగబడి ఆ ముగ్గర్నీ కొట్టాడు. దాంతో ఆ ముగ్గరిలో ఒక ముసలాయన అక్కడిక్కడే మరణించారు. ఆ ఆస్పత్రిలో అత్యాధునిక చికిత్స అందుబాటులో వున్నప్పటికీ సదరు ముసలాయన్ని ఎవరూ బతికించలేకపోయారు. షహబుద్దీన్ కొట్టిన ముగ్గురు పేషెంట్లలో ఒకరు మరణించారు.. మిగతా ఇద్దరు వ‌ృద్ధ పేషెంట్లు తీవ్ర గాయాలతో ఐసీయులో చికిత్స పొందుతున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజల్ట్స్: తెలంగాణ జిల్లాలు

      తెలంగాణ జిల్లాల వారీగా ఎంపీటీసీ కౌంటింగ్ చకచకాల జరుగుతోంది. తెలంగాణ జిల్లాల వారీగా మధ్యాహ్నం ఒంటిగంటకి వివిధ పార్టీలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఇలా వున్నాయి.   1. ఆదిలాబాద్: కాంగ్రెస్ (43), తెలుగుదేశం (26), తెరాస (79), ఇతరులు (23) 2. కరీంనగర్: కాంగ్రెస్ (32), తెలుగుదేశం (5), తెరాస (53), ఇతరులు (18) 3. వరంగల్: కాంగ్రెస్ (3), తెలుగుదేశం (2), తెరాస (4), ఇతరులు (0) 4. ఖమ్మం: కాంగ్రెస్ (8), తెలుగుదేశం (29), తెరాస (0), ఇతరులు (29) 5. నల్గొండ: కాంగ్రెస్ (21), తెలుగుదేశం (5), తెరాస (10), ఇతరులు (13) 6. నిజామాబాద్: కాంగ్రెస్ (47), తెలుగుదేశం (8), తెరాస (61), ఇతరులు (14) 7. మెదక్: కాంగ్రెస్ (22), తెలుగుదేశం (2), తెరాస (13), ఇతరులు (6) 8. రంగారెడ్డి: కాంగ్రెస్ (55), తెలుగుదేశం (27), తెరాస (24), ఇతరులు (33) 9. మహబూబ్ నగర్: కాంగ్రెస్ (55), తెలుగుదేశం (2), తెరాస (1), ఇతరులు (2) మొత్తం స్థానాలు: కాంగ్రెస్: 239, తెలుగుదేశం: 106, తెరాస: 245, ఇతరులు: 124.