ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: మన్మోహన్ సింగ్

  ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని శనివారం మాజీ ప్రధాని కాబోతున్న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు.15వ లోక్‌సభను రద్దు చేయాలన్న కేబినెట్‌ ఈరోజు తీర్మానం చేయనున్న నేపథ్యంలో మన్మోహన్‌ సింగ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన జీవితం తెరచిన పుస్తకమని ఆయన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి, పదేళ్ల యూపీఏ పాలనకు బాధ్యత వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. గత పదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యకర్తలు చేశామన్నారు. దేశానికి చేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. వచ్చే ప్రభుత్వానికి విజయాలు కలగాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో భారత్‌ సూపర్‌శక్తిగా తయారుకావాలని అన్నారు. ప్రధానికి ఇదే తన చివరి మీడియా సమావేశమని ఆయన స్పష్టం చేశారు.

సీమాంధ్ర ఎంపీలు

  సీమాంధ్ర ఎంపీలు   1. శ్రీకాకుళం: కింజారపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ) 2. విజయనగరం: పూసపాటి అశోక్ గజపతి రాజు (టీడీపీ) 3. కాకినాడ: తోట నరసింహం (టీడీపీ) 4. అరకు: కొత్తపల్లి గీత (వైసీపీ) 5. విశాఖ: కె.హరిబాబు (బీజేపీ) 6. అనకాపల్లి: ముత్తంశెట్టి శ్రీనివాసరావు (టీడీపీ) 7. అమలాపురం: డాక్టర్ రవీంద్రబాబు (టీడీపీ) 8. రాజమండ్రి:  మాగంటి మురళీమోహన్ (టీడీపీ) 9. నర్సాపూర్: గోకరాజు గంగరాజు (బీజేపీ) 10. ఏలూరు: మాగంటి వెంకటేశ్వరరావు (టీడీపీ) 11. విజయవాడ: కేశినేని నాని (టీడీపీ) 12. మచిలీపట్నం: కొనకళ్ళ నారాయణ (టీడీపీ) 13. గుంటూరు: గల్లా జయదేవ్ (టీడీపీ) 14. నరసరావుపేట: రాయపాటి సాంబశివరావు (టీడీపీ) 15. బాపట్ల: మాల్యాద్రి శ్రీరామ్ (టీడీపీ) 16. ఒంగోలు: వై.వి.సుబ్బారెడ్డి (వైసీపీ) 17. నెల్లూరు: మేకపాటి రాజమోహన్ రెడ్డి (వైసీపీ) 18. కడప: వైఎస్ అవినాష్ రెడ్డి (వైసీపీ) 19. నంద్యాల: ఎస్.పి.వై.రెడ్డి (వైసీపీ) 20. కర్నూలు: బుట్టా రేణుక (వైసీపీ) 21. రాజంపేట: పి.మిథున్ రెడ్డి (వైసీపీ) 22. అనంతపురం: జేసీ దివాకరరెడ్డి (టీడీపీ) 23. హిందూపురం: నిమ్మల కిష్టప్ప (టీడీపీ) 24. తిరుపతి: వరప్రసాదరావు (వైసీపీ) 25. చిత్తూరు: డా. ఎన్.శివప్రసాద్ (టీడీపీ)

రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ విజేతలు

  '     రంగారెడ్డి జిల్లాలో గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ. 1. మేడ్చెల్ - ఎం.సుధీర్ రెడ్డి (తెరాస) 2. మల్కాజిగిరి - రామచంద్రరావు (బీజేపీ) 3. కుత్బుల్లాపూర్ - కె.పి.వివేకానందగౌడ్ (టీడీపీ) 4. కూకట్ పల్లి -  మాధవరం క్రిష్ణారావు(టీడీపీ) 5. ఉప్పల్ -  ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ (బీజేపీ) 6. ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి (టీడీపీ/బీజేపీ) 7. ఎల్బీనగర్ - ఆర్.క్రిష్ణయ్య (టీడీపీ) 8. మహేశ్వరం - తీగల కృష్ణారెడ్డి (టీడీపీ) 9. రాజేంద్రనగర్ - ప్రకాష్ గౌడ్ (టీడీపీ) 10. శేరిలింగంపల్లి -  ఆరికపూడి గాంధీ (టీడీపీ) 11. చేవెళ్ళ(ఎస్సీ) - కె.యాదయ్య (కాంగ్రెస్) 12. పరిగి - టి.రామ్మోహనరెడ్డి(కాంగ్రెస్) 13. వికారాబాద్ (ఎస్సీ) - బి.సంజీవరావు (తెరాస) - 14. తాండూరు - మహేందర్ రెడ్డి (తెరాస)

మహబూబ్ నగర్ జిల్లా అసెంబ్లీ విజేతలు

      మహబూబ్ నగర్ జిల్లా గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ.   1.కొడంగల్ -  కె.రేవంత్ రెడ్డి (టీడీపీ) 2. నారాయణపేట్ -  కె.శివకుమార్ రెడ్డి (తెరాస) 3. మహబూబ్ నగర్ - వి.శ్రీనివాస గౌడ్ (తెరాస) 4. జడ్చర్ల -  సి. లక్ష్మారెడ్డి (తెరాస) 5. దేవరకద్ర - ఎ.వెంకటేశ్వర రెడ్డి (తెరాస) 6. మక్తల్ - సి.రామమోహనరెడ్డి (కాంగ్రెస్) 7. వనపర్తి - జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్) 8. గద్వాల్ - డి.కె.అరుణ (కాంగ్రెస్) 9. అలంపూర్ (ఎస్సీ) -  ఎం.శ్రీనాథ్ (తెరాస) 10. నాగర్ కర్నూల్ - మర్రి జనార్ధనరెడ్డి (తెరాస) 11. అచ్చంపేట (ఎస్సీ) - జి.బాలరాజ్ (తెరాస) 12. కల్వకుర్తి - చల్లా వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్) 13. షాద్ నగర్ - వై.అంజయ్యయాదవ్ (తెరాస) 14. కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు  (తెరాస)

హైదరాబాద్ జిల్లా అసెంబ్లీ విజేతలు

    హైదరాబాద్ జిల్లాలో గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ. 1. ముషీరాబాద్ - డా.కె.లక్ష్మణ్ (బీజేపీ) 2. మలక్ పేట - అహ్మద్ బలాల (ఎంఐఎం) 3. అంబర్ పేట - కిషన్ రెడ్డి (బీజేపీ) 4. ఖైరతాబాద్ -సీహెచ్.రామచంద్రారెడ్డి (బీజేపీ) 5. జూబ్లీహిల్స్ - మాగంటి గోపీనాధ్ (టీడీపీ) 6. సనత్ నగర్ -  తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీడీపీ/బీజేపీ) 7. నాంపల్లి - జాఫర్ హుస్సేన్ (ఎంఐఎం) 8. కార్వాన్ - కౌసర్ మొహిద్దిన్ (ఎంఐఎం) 9. గోషామహల్ - టి.రాజాసింగ్ (బీజేపీ)  10. చార్మినార్ - అహ్మద్ పాషాఖాద్రి (ఎంఐఎం)   11. చాంద్రాయణగుట్ట -  అక్బరుద్దీన్ ఓవైసీ 12. యాకుత్ పుర - ముంతాజ్ ఖాన్ (ఎంఐఎం) 13. బహదూర్ పుర - మోజం ఖాన్ (ఎంఐఎం) 14. సికింద్రాబాద్ -  పద్మారావు (తెరాస) -   15. కంటోన్మెంట్ (ఎస్సీ) - సాయన్న (టీడీపీ)

కంగ్రాట్స్ మోడీ: రజనీకాంత్ ట్విట్

      ఎన్నికల ముందు నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇప్పుడు ఎన్నికలలో బీజేపీ, ఎన్డీయే ఘన విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన సంతోషాన్ని రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చారు. ఈమధ్యే ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించిన రజనీకాంత్ మోడీకి తన అభినందనలను కూడా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘నరేంద్ర మోడీ జీ.. చారిత్రక విజయం సాధించిన మీకు హ‌ృదయపూర్వక అభినందనలు’’ అని ట్విట్ చేశారు. పనిలో పనిగా తమిళనాడులో భారీగా పార్లమెంట్ స్థానాలు గెలిచిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కూడా రజనీకాంత్ అభినందనలు తెలిపారు.

ముచ్చటగా మూడోసారి ఓడిన డి.శ్రీనివాస్

      ఆల్రెడీ శాసనమండలి సభ్యుడిగా వున్న డి.శ్రీనివాస్ ఇంకా ఏదో సాధించాలని నిజామాబాద్ రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. ఫలితం మరోసారి.. ఇంకా చెప్పాలంటే ముచ్చటగామూడోసారి ఓడిపోయారు. ఓటమిలో ఆయన హ్యాట్రిక్ సృష్టించారు. ధర్మపురి శ్రీనివాస్ వరుసగా మూడోసారి పరాజయం పాలయ్యారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డిఎస్, టిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తొలిసారి 2009లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీ నారాయణ చేతిలో ఓడిపోగా, రెండవ సారి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో అదే ఎందల లక్ష్మీ నారాయణ (బిజెపి) చేతిలో డిఎస్ కంగుతిన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి భయంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి మారినా ప్రయోజనం లేక పోయింది. బాజిరెడ్డి గోవర్ధన్ చివరి క్షణంలో వైకాపా నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా టీఆర్ఎస్‌లో చేరి డీఎస్‌పై సంచలన విజయం సాధించారు.

ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెంచిన విజయం: పవన్ కళ్యాణ్

      సీమాంధ్రలో బీజేపీ, టీడీపీ కూటమి, దేశంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం పట్ల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హర్షాన్ని వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో వున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలను దోచుకున్న విధానం, తెలంగాణను విచ్ఛిన్నం చేసిన విధానం తాను ‘కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో’ నినాదం ఇవ్వడానికి కారణమైందని చెప్పారు. ఈ ఎన్నికలలో ఓట్లు చీలకూడదని, టీడీపీ, బీజేపీ కూటమి గెలవాలన్న ఉద్దేశంతోనే తన పార్టీ ఎన్నికలలో పోటీ చేయాలేదని, ఆ నిర్ణయం కారణంగా ఇప్పుడు బీజేపీ, టీడీపీ కూటమి సీమాంధ్రలో అధికారంలోకి రావడం ఆనందాన్ని కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. నరేంద్ర మోడీకి, చంద్రబాబుకి, తెలంగాణలో గెలిచిన కేసీఆర్‌కి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. తనకు ఏ రాజకీయ నాయకుడిమీదా వ్యక్తిగత ద్వేషం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. దోపిడీ దారులు గెలవకూడదని ప్రజలు ఈ ఎన్నికలలో తీర్పు ఇచ్చారని, తనకు ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని పెంచిన విజయమిదని పవన్ కళ్యాణ్ అన్నారు.

వికసించిన కమలం.. వణుకుతున్న హస్తం

      దేశవ్యాప్తంగా విడుదలవుతున్న ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా లభిస్తున్న మద్దతుతో కమలం వికసించింది. దారుణంగా ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ హస్తం గడగడా వణుకుతోంది. బీజేపీ కూటమికి 339 స్థానాలలో ఆధిక్యం దక్కింది. బీజేపీ కూటమి ధాటికి కాంగ్రెస్ పార్టీ కకావికలు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలోని మహామహులు అడ్రస్ లేకుండా పోయారు. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఓటమి దాకా వెళ్ళి బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడలో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కూడా ఓడిపోవడం శుభ పరిణామం.